Close

District Collector Surya Kumari wished a happy Telugu New Year to all who are coming from autumn to spring, from past to future, from old memories to new imaginations, from suffering to the pinnacle of comfort.

Publish Date : 01/04/2022

శుభకృత్ అందరికీ శుభాలు జలుగజేయాలి

జిల్లా ప్ర‌జ‌ల‌కు ఉగాది శుభాకాంక్ష‌లు తెలిపిన క‌లెక్ట‌ర్ సూర్య కుమారి

విజ‌య‌న‌గ‌రం, ఏప్రిల్ 01:: శిశిరం నుండి వసంతానికి, గతం నుండి భవిష్యత్తు కు, పాత జ్ఞాపకాల నుండి కొత్త ఊహాలలోనికి, బాధల నుండి సుఖాల శిఖరనికి చేర్చడానికి వస్తున్న శుభకృత్ తెలుగు నూతన సంవత్సరం అందరికీ శుభాలు కలుగజేయాలని జిల్లా కలెక్టర్ సూర్య కుమారి ఆకాంక్షించారు.

శ్రీ శుభ‌కృత్ నామ సంవ‌త్స‌ర ఉగాది వేళ జిల్లా ప్ర‌జ‌లంతా సుఖ సంతోషాల‌తో జీవించాల‌ని, సుభిక్షంగా ఉండాల‌ని అన్నారు. తెలుగునాట అంద‌రూ ఐక్య‌త‌గా జ‌రుపుకొనే వేడుక ఉగాది అని.. అలాంటి శుభ‌క‌ర‌మైన రోజును పుర‌ష్క‌రించుకొని ఏడాది పొడ‌వునా అంద‌రూ సంతోషంగా ఉండాల‌ని ఆ దేవుడ్ని వేడుకుంటున్నాన‌ని పేర్కొంటూ జిల్లా ప్ర‌జ‌ల‌కు క‌లెక్ట‌ర్ శుక్ర‌వారం ఓ ప్ర‌క‌ట‌న ద్వారా ఉగాది శుభాకాంక్ష‌లు తెలిపారు. ఈ ఏడాది అంద‌రికీ శుభాలే జ‌ర‌గాల‌ని, నూత‌న ల‌క్ష్యాల‌ను ఏర్పాటు చేసుకొని విజ‌య‌వంతంగా చేరుకోవాల‌ని అభిలాషించారు. జిల్లా ప్ర‌జ‌ల‌కు ఈ నూత‌న తెలుగు సంవ‌త్స‌రంలో మంచి ఆరోగ్య ప్ర‌సాదించాల‌ని.. మ‌న‌శ్శాంతి క‌ల‌గాల‌ని.. సిరి సంప‌ద‌ల‌తో తుల‌తూగాల‌ని ఆసిస్తున్నానని, అంద‌రికీ ఖ‌ర్చు త‌గ్గి… ఆదాయం పెర‌గాల‌ని.. రాజ‌పూజ్యం ఎక్కువగా ఉండి.. అవ‌మానాలు ఎదురు కాకూడ‌ద‌ని మనసారా కోరుకుంటున్నానని, జిల్లా ప్ర‌జ‌ల‌కు ఉగాది శుభాకాంక్ష‌లు తెలియ‌జేసారు.

District Collector Surya Kumari wished a happy Telugu New Year to all who are coming from autumn to spring, from past to future, from old memories to new imaginations, from suffering to the pinnacle of comfort.