MIG in Salur suburb Joint Collector Mayur Ashok along with local authorities on Tuesday inspected the suitable places for laying outs.
Publish Date : 11/05/2022
*ఎం.ఐ.జి. లే అవుట్ల స్థలాలను పరిశీలించిన జేసీ*
విజయనగరం, మే 10 ః సాలూరు పట్టణ పరిధిలో ఎం.ఐ.జి. లే అవుట్లు వేసేందుకు అనువైన స్థలాలను జాయింట్ కలెక్టర్ మయూర్ అశోక్ స్థానిక అధికారులతో కలిసి మంగళవారం పరిశీలించారు. పట్టణ పరిధిలో కొన్ని స్థలాలను గుర్తించి లే అవుట్లు వేసేందుకు అనుకూలమా కాదా అని సమీక్షించారు. పూర్తి స్థాయి సర్వే చేసి ఎంత వరకు అనుకూలమో పరిశీలించి చర్యలు తీసుకోవాలని అధికారులను జేసీ ఆదేశించారు. అనంతరం ఆయన బొబ్బిలి పరిధి రామందొరవలస జగనన్న కాలనీల్లో వేసిన లే అవుట్లను సందర్శించారు. నిర్మాణాలు వేగవంతానికి చర్యలు తీసుకోవాలని, నీటి సదుపాయం కల్పించాలని బుడా అధికారులకు సూచించారు. త్వరితగిన అప్రోచ్ రోడ్లను నిర్మించాలని చెప్పారు. ప్రతి ఒక్కరూ నిర్మాణాలు చేసే విధంగా చర్యలు తీసుకోవాలని, లబ్ధిదారులను ప్రోత్సహించాలని సూచించారు. ఆయన వెంట బొబ్బిలి మున్సిపల్ కమిషనర్ శ్రీనివాసరావు, టౌన్ ప్లానింగ్ అధికారి పద్మజ, ఇంజినీరింగ్ విభాగం అధికారులు, రెవెన్యూ అధికారులు తదితరులు ఉన్నారు.
