Opportunity for changes and additions in the Aadhaar card by District Collector Surya Kumari
Publish Date : 16/05/2022
ఆధార్ కార్డు లో మార్పులు, చేర్పులకు అవకాశం
జిల్లా కలెక్టర్ సూర్య కుమారి
విజయనగరం, మే 15:: ఆధార్ కార్డ్ లో మార్పులు చేర్పులను చేసుకోడానికి వీలుగా విజయనగరంలో నాలుగు ఆధార్ కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు జిల్లా కలెక్టర్ సూర్య కుమారి ఒక ప్రకటనలో తెలిపారు. అదే విదంగా బొబ్బిలి నెల్లిమర్లలో కూడా ఏర్పాటు చేశామని అన్నారు.
ఆధార్ కార్డ్ లో మార్పులు చేర్పులను చేసుకోడానికి వీలుగా మండల కేంద్రాల్లో ఆధార్ కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు.
విజయనగరం మునిసిపల్ కార్పొరేషన్ లో గల అరుంధతినగర్, రాజులవీది, లక్ష్మిగనపతికోలనీ, బాలాజీనగర్ సచివాలయాల పరిదిలో, డెంకాడ, భోగాపురం, మెంటాడ, జామి, బొండపల్లి, గుర్ల, గంట్యాడ మండల కేంద్రాల్లో నున్న సచివలయాలలో, బాడంగి మండలం, పాల్తేరు సచివాలయాల పరిదిలో-2, బొబ్బిలి, తెర్లాం, ఎస్.కోట 1, ఎస్.కోట 2 సచివాలయాల పరిదిలో -2, వేపాడలో-1, నెల్లిమర్ల అర్బన్ లో -1 చెప్పున ఆధార్ కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు.
