Close

One hundred percent registration of pregnant women should take place, said District Collector Surya Kumari

Publish Date : 23/05/2022

👉గర్భిణీల నమోదు శత శాతం జరగాలి
👉జిల్లా కలెక్టరు సూర్య కుమారి
విజయనగరం, మే 21::  జిల్లాలో  గర్భిణీల నమోదు శత శాతం జరగాలని జిల్లా కలెక్టర్ సూర్య కుమారి అధికారులకు ఆదేశించారు. శనివారం కలెక్టరేట్ సమావేశ మందిరం లో వైద్య ఆరోగ్య, మహిళా శిశు అభివృద్ధి అధికారులతో  గర్భిణీలు నమోదు, ప్రసవం వరకు వారిని పర్యవేక్షించే తీరు పై సీడీపీఓ లతో, వైద్యులతో సమీక్షించారు. జిల్లాలో గర్భిణీల నమోదు  96.4 శాతం ఉండగా మిగిలిన వారిని  ఎందుకు నమోదు  చేయలేదని అరా తీశారు. ప్రతి గర్భిణీ నమోదు కావాలని, నమోదు అయిన వారిని ప్రసవించే వరకు పర్యవేక్షించాలని  సూచించారు. మాతా శిశు మరణాలను జీరో చేయాలన్నారు.  మంగళవారం లోగా మిగిలిపోయిన వారి వివరాలను కారణాలతో సహా అందించాలన్నారు.
 ఈ సమావేలం లో  డి ఎం హెచ్ ఓ డా.రమణ కుమారి, ఐ.సి.డి.ఎస్ పి.డి శాంతకుమారి, వైద్యాధికారులు, సీడీపీఓ లు పాల్గొన్నారు.
One hundred percent registration of pregnant women should take place, said District Collector Surya Kumari