Close

District Collector Suryakumari congratulated the wave singing training which ended

Publish Date : 14/06/2022

*ముగిసిన తరంగ గాన శిక్షణ*
అభినందించిన జిల్లా కలెక్టర్ సూర్యకుమారి
విజయనగరం, జూన్ 12 :- భజన సంప్రదాయంపై నేటి తరానికి అవగాహన కల్పించే ఉద్దేశంతో, జిల్లా.కలెక్టర్ సూర్యకుమారి ఆదేశాల మేరకు,  మహారాజ ప్రభుత్వ సంగీత, నృత్య కళాశాలలో వారం రోజుల పాటు ఏర్పాటు చేసిన *తరంగ గానం*  ప్రత్యేక వర్క్ షాప్ ఆదివారంతో ముగిసింది.  జూన్ 6 నుంచి 12వ తేదీ వరకు ఉదయం 8 నుంచి 10 గంటల మధ్య, ఒంగోలు వాసి, ప్రముఖ సంగీత తరంగ గాన విద్వాంసులు ఘోరకవి శ్రీ కృష్ణ సంపత్ కుమార్ ఆధ్వర్యంలో ఈ శిక్షణా కార్య్రమం జరిగింది. సుమారు 80 మంది తరంగ గానంలో శిక్షణ పొందారు.
       స్థానిక శ్రీ మన్నార్ రాజగోపాల్ స్వామి ఆలయంలో ఆదివారం సాయంత్రం జరిగిన ముగింపు కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ ఎ.సూర్యకుమారి, ప్రముఖ సంగీత తరంగ గాన విద్వాంసుల ఘోరకవి శ్రీ కృష్ణ సంపత్ కుమార్, ప్రభుత్వ సంగీత నృత్య కళాశాల ప్రిన్సిపాల్ వి.ప్రసన్న కుమారి హాజరయ్యారు. ఈ సందర్భంగా సంపత్ కుమార్ తన శిష్య బృందంతో నిర్వహించిన తరంగగాన ప్రదర్శన భజన కార్య్రమం ఆద్యంతం మంత్రముగ్ధుల్ని చేసింది. అనంతరం తరంగ గాన విద్వాంసులు సంపత్ కుమార్ ను సతీ సమేతంగా, జిల్లా కలెక్టర్ సూర్యకుమారి ఘనంగా సత్కరించారు.
 కార్యక్రమంలో కళాశాల అధ్యాపకులు, ఇతర ప్రముఖులు, సంగీత ప్రియులు, విద్యార్థులు పాల్గొన్నారు.
District Collector Suryakumari congratulated the wave singing training which ended