Actions against those who smuggle PDS rice,Joint Collector Mayur Ashok
Publish Date : 18/06/2022


విజయనగరం, జూన్ 14:: పేదప్రజల సంక్షేమం కోసం ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా బిపిఎల్ కార్డుదారులకు పంపిణీ చేస్తున్న కిలో రూపాయి బియ్యంను నల్లబజారు కి తరలించడం చట్టరిత్యా నేరమని సంయుక్త కలెక్టర్ కె.మయూర్ అశోక్ ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలో ఈ విషయమై విస్తృతంగా తనిఖీలు జరుచున్నవని, ఈ విషయంలో ఇప్పటివరకు ఎన్ఫోర్స్మెంట్ సిబ్బందిచే 244 చౌకదరల దుఖాణములను, 42 పౌల్ట్రీ ఫారంలను మరియు 18 కిరాణా దుఖాణములను తనిఖీ చేసి పిడిఎస్ బియ్యము అక్రమముగా నిలువ చేసిన బత్తుల మన్మధరావు తండ్రి దాలిరాజు వారి నుండి 5.20 క్వింటాల్ బియ్యమును స్వాధీనం చేసుకోవడం జరిగిందన్నారు. గజపతినగరం నకు చెందిన అరిశెట్టి చిదంబరం వారి నుండి 3.76 క్వింటాల్ పిడిఎస్ బియ్యమును స్వాదినము చేసుకొని 6ఏ కేసులు నమోదు చేయడమైనదని తెలిపారు.
ఈ విధమైన తనిఖీలు నిరంతరంగా జరుగుతాయని పిడిఎస్ బియ్యముతో అక్రమమ వ్యాపారం చేసేవారిపై 6A కేసులు నమోదు చేయటతో పాటుగా క్రిమినల్ చర్యలు తీసుకోవడం జరుగుందని హెచ్చరించారు.
