Taking over the responsibilities of Suryakala as Vijayanagaram RDO
Publish Date : 06/08/2022
విజయనగరం ఆర్డీవోగా ఎం. వి. సూర్యకళ గురువారం బాధ్యతలు స్వీకరించారు. సంహాచలం దేవస్థానం ఈవోగా పని చేస్తున్న ఈమె బదిలీపై ఇక్కడకు విచ్చేశారు. ఇంత వరకు ఇక్కడ పని చేసిన ఆర్డీవో బీహెచ్ భవానీ శంకర్ నర్శీపట్నం బదిలీపై వెళ్లిపోగా అప్పటి నుంచి కె.ఆర్.ఆర్.సి. ప్రత్యేక ఉప కలెక్టర్ సూర్యనారాయణ ఆ బాధ్యతలు నిర్వర్తించారు. గురువారం నూతన ఆర్డీవోగా జిల్లాకు విచ్చేసిన సూర్యకళ ఆయన నుంచి బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆర్డీవో కార్యాలయ అధికారులు, సిబ్బంది, తహశీల్దార్లు ఆమెను మర్యాద పూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛాలు అందజేసి శుభాకాంక్షలు తెలిపారు.
