Close

Let’s unveil the new India, said J.C. Mayurashok who hoisted the national flag at the Collectorate.

Publish Date : 24/08/2022

సరిక్రొత్త భారత దేశాన్ని అవిష్కరిద్దాం

కలెక్టరేట్ వద్ద జాతీయ పతాకాన్ని ఎగురవేసిన జె.సి.మయూర్ అశోక్

విజయనగరం, ఆగస్టు 15:: 76 వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను పురస్కరించుకొని కలెక్టరేట్ వద్ద సంయుక్త కలెక్టర్ మయూర్ అశోక్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి జెండా వందనం గావించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రధానమంత్రి మోడీ గారి ఆశయం మేరకు సరి క్రొత్త భారత దేశాన్ని ఆవిష్కరించడం లో ప్రతి ఒక్కరు భాగస్వాముల కావాలన్నారు.  స్వాతంత్ర్య వజ్రోత్సవాల్లో భాగంగా ఆజాది క అమృత్ వేడుకలను జిల్లా అంతటా ఘనంగా జరుపుకుని దేశ భక్తిని చాటుకున్నామని గుర్తు చేసారు.

            అదే స్ఫూర్తి తో రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పధకాలను  ప్రజలకు చేరువుగా ఉంటూ పారదర్శకంగా  అందేలా  చూడాలన్నారు.  అధికారులంతా అంకిత భావంతో, చిత్త శుద్ధితో పని చేయాలన్నారు.

ఈ కార్యక్రమంలో డి.ఆర్.ఓ గణపతి రావు, కలెక్టర్ ఏ.ఓ దేవ్ ప్రసాద్, పలు శాఖలకు చెందిన జిల్లా అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

Let's unveil the new India, said J.C. Mayurashok who hoisted the national flag at the Collectorate.