Close

Compensation for SC and ST rape cases should be given immediately, said District Collector Suryakumari

Publish Date : 24/08/2022

ఎస్.సి, ఎస్.టి  అత్యాచార కేసులకు పరిహారం సత్వరమే అందజేయాలి

జిల్లా కలెక్టర్ సూర్య కుమారి

విజయనగరం, ఆగస్టు 17:: ఎస్.సి, ఎస్.టి అత్యాచార కేసులను త్వరితగతిన పరిష్కరిస్తూ  బాధితులకు  అందవలసిన పరిహారాన్ని సత్వరమే అందేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ఎ. సూర్య కుమారి ఆదేశించారు. ఈ విషయం లో పోలీస్, డి.ఆర్.ఓ  ల మధ్య సమన్వయం  ఉండాలన్నారు. కలెక్టరేట్ ఆడిటోరియంలో బుధవారం జిల్లా విజిలెన్స్ అండ్ మానిటరింగ్ సమావేశం జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో జరిగింది. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ విచారణ లో ఫిర్యాదుదారుల నివేదికలు తప్పుగా తేల్చినపుడు జిల్లా పోలీసు సూపరింటెండెంట్ వారి అనుమతి పొందిన తరువాత మాత్రనే ఫాల్స్ కేస్ గా ధ్రువీకరణ చేయాలన్నారు. అత్యాచార బాధితులకు భూమి మంజూరు విషయం లో జాప్యం జరుగుతున్నదని డిడి కలెక్టర్ దృష్టికి తీసుకురాగా  నిర్దేశిత ప్రదేశం లో భూమి  అందుబాటులో లేకపోవడంతో మంజూరు చేయలేదని గంట్యాడ, పూసపాటి రేగ తహశీల్దార్లు తెలిపారు. 15 రోజుల్లో భూమిని గుర్తించి మంజూరు చేయాలని ఇద్దరు తహసీల్దార్లకు కలెక్టర్  సూచించారు.  మెడికల్ సర్టిఫికెట్ల  జారీ లో జాప్యం జరుగుతున్నట్లు పోలీస్ అధికారులు కలెక్టర్ దృష్టికి తీసుకురాగా ఆలస్యం చెయ్యకుండా జారీ చేయాలని డిసిహెచ్ఎస్  డా. నాగభూషణ రావు కు సూచించారు.

            ఎస్.సి. ఎస్.టి రక్షణ చట్టం క్రింద మార్చి  నుండి జులై వరకు జిల్లాలో  మొత్తం 54 కేసులు నమోదయ్యాయని అదనపు ఎస్.పి సత్యనారాయణ తెలిపారు.  ఇందు లో 40 కేసులు విచారణ లో వున్నాయని, కోర్ట్ లో 7 కేసు లు ట్రయల్ లో ఉన్నాయని 7 కేసు లు బదిలీ చేయడం  జరిగిందని తెలిపారు. ఈ సమావేశంలో డి.ఆర్.ఓ గణపతి రావు, సోషల్ వెల్ఫేర్ డిడి రత్నం, ట్రాఫిక్, ఎస్.సి., ఎస్.టి సెల్  డి.ఎస్. పి లు, ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్ , జిల్లా అధికారులు, సభ్యులు పాల్గొన్నారు.

Compensation for SC and ST rape cases should be given immediately, said District Collector Suryakumari