You are the compass for the future generation, said District Collector A. Surya Kumari in the review of the Education Department
Publish Date : 24/08/2022
భావి తరానికి మీరే దిక్సూచీ
- నూతన విద్యా విధానం పై అవగాహన పెరగాలి
- విద్య తో పాటు నైతిక విలువలను బోధించాలి
- విద్యార్ధుల ఆరోగ్యం పై కూడా శ్రద్ధ పెట్టాలి
- నమోదు పెరగాలి, డ్రాప్ ఔట్స్ తగ్గాలి
- వచ్చే సెన్సస్ లో శతశాతం అక్షరాస్యత రికార్డు కావాలి
విద్యా శాఖ సమీక్ష లో జిల్లా కలెక్టర్ ఎ. సూర్య కుమారి
విజయనగరం, ఆగష్టు 20 : బాలల భావి తరానికి ఉపాధ్యాయులే దిక్సూచీలని, సమాజ పరివర్తనను కలిగించే శక్తి ఉపాధ్యాయులకే ఉందని జిల్లా కలెక్టర్ సూర్య కుమారి పేర్కొన్నారు. ఉపాధ్యాయులు అనుకుంటే ప్రతి విద్యార్ధిని సంస్కరింఛి, ఉత్తమ భవిష్యత్తు ఇవ్వగలరని అన్నారు. బాధ్యత గల వృత్తి లో ఉన్నారు కనుక కొంత సామజిక బాధ్యత చూపాలని కోరారు. కలెక్టరేట్ ఆడిటోరియం లో శనివారం ఎం.ఈ.ఓ లు, పాఠశాల సముదాయ ప్రధానోపాధ్యాయుల (స్కూల్ కాంప్లెక్స్ హెడ్ మాస్టర్స్ ) తో జిల్లా స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఒకప్పుడు జిల్లా ప్రధాన కేంద్రం లోనే యాప్లలో సమాచారం అప్ లోడ్ చేసేవారమని, ప్రస్తుతం పాఠశాల స్థాయి వరకూ చేరిందని, ఎంత పని చేసినా యాప్ లలో అప్ లోడ్ చేస్తేనే చేసిన పని కనపడుతుందని తెలిపారు. పాఠశాలకు నాడు నేడు ఒక వరమని, దీనితో పాఠశాలల నిర్వహణ లో సమూల మార్పులు వచ్చాయని, అన్ని రకాల సౌకర్యాలతో విద్యనందించడం జరుగుతోందన్నారు.
జాతీయ విద్యా విధానం పై ముందుగా ఉపాధ్యాయులు పూర్తి స్థాయి లో అర్ధం చేసుకోవాలని, అనంతరం ప్రజలకు, ప్రజా ప్రతినిధులకు అవగాహన కలిగించాలని అన్నారు. పాఠశాల విద్య తో పాటు పిల్లలకు నైతిక విలువలను కూడా బోధించాలని, అదే విధంగా వారి ఆరోగ్యం పై కూడా ఉపాద్యాయులు శ్రద్ధ పెట్టాలని పేర్కొన్నారు. పిల్లల బరువు, హెచ్.బి శాతాన్ని ఎప్పటికప్పుడు తనిఖీ చేయించాలన్నారు. . ప్రభుత్వం అమలు చేస్తున్న ఫ్యామిలీ ఫిజిసియన్ కాన్సెప్ట్ ను పాఠశాలలలో సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. కిషోర బాలికల కోసం సఖి బృందాలను ర్పాటు చేయడం జరిగిందని, బాల్య వివాహాలు జరగకుండా పిల్లలకు అవగాహన కలిగించాలని అన్నారు. కౌమార బాల బాలికలు చదువు, కెరీర్ తప్ప వేరే ఆలోచనలు లేకుండా చూసే బాధ్యతను ఉపాధ్యాయులు తీసుకోవాలని అన్నారు. సామజిక విలువలు, బాధ్యతను పెంఛి వ్యక్తిగతంగా జీవితం లో ఎదిగేలా చూడాలని , యోగా, కమ్యూనికేషన్ స్కిల్స్ నేర్పించాలని, ప్రత్యేకతలున్న వారిని గుర్తించి ప్రోత్సహించాలని హితవు పలికారు.
ఈ ఏడాది 10 ఫలితాలలో రాష్ట్రం లో 3 వ స్థానం లో ఉండడం సంతోషాన్ని ఇచ్చిందని, ఈ సందర్భంగా ఉపాధ్యాయులకు అభినందనలు తెలిపారు. మీ బాధ్యత మరింత పెరిగిందని, భవిష్యత్తు లో ఈ రాంక్ తగ్గ కుండా చూడాలని అన్నారు. వయోజన విద్యా శాఖ ద్వారా నిరక్షరాష్యులను అక్షరాష్యులుగా చేసే చిట్టి గురువులు కార్యక్రమం జరుగుతోందని, చిట్టి గురువుల తో ఉపాధ్యాయులు మాట్లాడుతూ వారిని ప్రోత్సహించడం ద్వారా కార్యక్రమాన్ని మరింత విజయవంతం చేయడానికి కృషి చేయాలనీ అన్నారు. సంతకం నేర్చుకుంటే చదువు వచ్చినట్లు కాదని, , రెండవ దశ లో వారికీ పూర్తిగా చదవడం రావాలని, , డిజిటల్ లిటరసీ పై కూడా అవగాహనా కలిగించాలని అన్నారు. వచ్చే జనాభా లెక్కల్లో జిల్లా సంపూర్ణ అక్షరాశ్యత సాధించిన జిల్లాగా నమోదు కావాలన్నారు.
నీతీ అయోగ్ లో ఆశావహ జిల్లాల్లో మనం ఉన్నామని, మన ర్యాంకింగ్ జాతీయా స్థాయి లో కనపడుతుందని, దానిని ప్రతి ఒక్కరూ గుర్తు పెట్టుకోవాలని అన్నారు. పరీక్షల్లో పాస్ కావడం కాదని, డిస్టిన్క్షణ్ ఉండాలని తెలిపారు. అందుకోసం మాల్ ప్రాక్టీసు చెయ్యవద్దని, కష్టపడి చదివించాలని అన్నారు. ఉపాధ్యాయుల సర్వీస్ విషయాలను, సమస్యలను తక్షణమే పరిష్కరించి వారికీ సహకరించాలని డి.ఈ.ఓ కు కలెక్టర్ సూచించారు.
డి.ఈ.ఓ వెంకటేశ్వర రావు పవర్ పాయింట్ ద్వారా పలు అంశాలను వివరించారు. జిల్లాలో 162 స్కూల్ కాంప్లెక్స్ లు ఉన్నాయని, ప్రతి స్కూల్ కాంప్లెక్స్ పరిధి లో నున్న పాఠశాలను ప్రతి వారానికి ఒక సరి పర్యవేక్షించాలని, నెలకో సారి తచేర్స్ తో సమీక్షించాలని ఆదేశించారు. ప్రతి స్కూల్ వద్ద పైన ఫిర్యాదుల పెట్టె ను ఏర్పాటు చేయాలనీ సూచించారు.
డైట్ ప్రిన్సిపాల్ తిరుపతి నాయుడు మాట్లాడుతూ స్కూల్ కాంప్లెక్స్ విధానం ఉద్దేశ్యం , ఉపాధ్యాయుల పాత్ర పై వివరించారు. ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో నమోదు శాతం పెరగాలని, డ్రాప్ అవుట్ ల శాతం తగ్గించాలని అన్నారు. జిల్లాలో 11 వేల మంది డ్రాప్ అవుట్ పిల్లలు ఉన్నట్లు గుర్తించడం జరిగిందని, వారిని భౌతికంగా తనిఖీ చేసి స్కూల్స్ లో చేర్పించాలన్నారు. కన్సిస్టెంట్ రిథమ్స్ క్రింద పాఠశాలల వసతులను తనిఖీ చేసి రెమర్క్ లను ఆన్లైన్ లో అప్ లోంద్ చెయ్యాలన్నారు.
సమగ్ర శిక్షా ప్రాజెక్ట్ అధికారి స్వామి నాయుడు మాట్లాడుతూ జగనన్న విద్య కిట్లను అన్ని పాఠశాలలకు సరఫరా చేయడం జరిగిందని, మిగిలినవి, సరిపోనివి ఉంటె మండలాల ద్వారా జిల్లాకు పంపాలని, వాటిని అవసరం ఉన్న చోట సరఫరా చేస్తామని తెలిపారు. ప్రతి లెక్క ఆన్లైన్ ద్వారానే జరగాలని అన్నారు. నాడు నేడు రెండవ దశ క్రింద 727 పాఠశాలలు మంజూరు కాగా645 పాఠశాలలకు రివాల్వింగ్ ఫండ్ జమ అయ్యిందని, మిగిలిన వారు కూడా బ్యాంకు ఖాతాలను మ్యాప్ చెయ్యాలని తెలిపారు.
వయోజన విద్యా శాఖ డి.డి. సుగుణాకర రావు మాట్లాడుతూ చిట్టి గురువులు కార్యక్రమానికి పెద్ద ఎత్తున ఉపాధ్యాయులు, ప్రజా ప్రతినిధులు సహకరిస్తున్నారని, పూర్తి స్థాయిలో ఈ కార్యక్రమాన్ని విజయవంతం గావించి అక్టోబర్ 2 నాటికీ సత శాతం అక్షరాష్యతను సాధించడానికి కృషి చేయాలన్నారు.
బాలికల పై లైంగిక వేధింపులను ఆపండి – పోస్టర్ విడుదల:
సమావేశం అనంతరరం బాలికల పై లైంగిక వేధింపులను ఆపండి పోస్టర్ విడుదల చేసారు. ఇందులో గుడ్ టచ్, బాడ్ టచ్ ల పై అవగాహన కలిగించే అంశాలను, హెల్ప్ లైన్ నెంబర్లను పొందుపరిచారు. అన్ని స్కూల్స్ గోడల పై హెల్ప్ లైన్ నెంబర్ల ను రాయించాలని కలెక్టర్ ఈ సందర్భంగా ఆదేశించారు.
