Close

Under the Netanna Nestham scheme, 706 people in the district will be benefited and the government’s aim is to make the weaker sections economically stronger.

Publish Date : 30/08/2022

నేతన్న నేస్తం పధకం క్రింద జిల్లాలో 706 మందికి  లబ్ధి

బలహీనవర్గాల వారు ఆర్థికంగా బలోపేతం కావాలన్నదే ప్రభుత్వ ధ్యేయం

జిల్లా పరిషత్ చైర్మన్ మజ్జి శ్రీనివాస రావు

విజయనగరం, ఆగస్టు 25::  వైఎస్సార్ నేతన్న నేస్తం పథకం క్రింద రాష్ట్రంలో అర్హులైన వైఎస్ ఆర్ నేతన్న నేస్తం” లబ్ధిదారులకు వరుసగా నాలుగవ  ఏడాది ఆర్థిక సహాయ పంపిణీ కార్యక్రమాన్ని  కృష్ణా జిల్లా,  పెడన మండలం తోటమూల గ్రామం నుండి గురువారం  బటన్ నొక్కి నగదు మొత్తాన్ని నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లో  రాష్ట్ర ముఖ్యమంత్రి   వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారు జమ చేశారు.

ఈ కర్యంక్రమాన్ని కలెక్టరేట్ ఆడిటోరియం లో లైవ్ ఏర్పాటు గావించారు.  ఆడిటోరియం నుండి జిల్లా కలెక్టర్ సూర్య కుమారి, జిల్లా పరిషత్ చైర్మన్ మజ్జి శ్రీనివాస రావు, చేనేత శాఖ ఏ.డి మురళీ కృష్ణ, చేనేత కార్మికులు, లబ్ధిదారులు పాల్గొన్నారు.  ముఖ్యమంత్రి బటన్ నొక్కి జమ చేసిన అనంతరం జిల్లాకు చెందిన 706 మంది లబ్ధిదారులకు ఒక్కొక్కరికి 24 వేల రూపాయలు చొప్పున మొత్తం ఒక కోటి  81 లక్షల  రూపాయల  మెగా చెక్కును జిల్లా  కలెక్టర్, చైర్మన్ చేతుల మీదుగా  అందజేశారు.

 అనంతరం జిల్లా పరిషత్ చైర్మన్ మజ్జి శ్రీని వాస రావు మీడియా తో మాట్లాడుతూ  ఇచ్చిన మాట ప్రకారం నేతన్నలకు  వరుసగా నాల్గవ సారి కూడా  ఆర్ధిక సహాన్ని అందించడం ముఖ్య మంత్రి గారి చిత్త శుద్ధికి నిదర్శనమన్నారు. అంతే కాకుండా నేతన్నల శ్రమ, ఆరోగ్యాన్ని దృష్టి లో పెట్టుకొని వారికి  50 ఏళ్ళు నిండగానే  పింఛన్ సదుపాయాన్ని క్షల్పించిన  ముఖ్యమంత్రి కి బీసీ లందరూ అండగా నిలవాలని కోరారు. కులం, మతం, పార్టీలకు అతీతంగా అర్హతే ప్రామాణికంగా సంక్షేమ పథకాలను అందిస్తున్న ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అని పేర్కోన్నారు. నేతన్న నేస్తం క్రింద అందిన ఆర్ధిక సహాయం తో మగ్గాలు,అందుకు అవసరమైన యంత్ర సామగ్రిని కొనుక్కొని ఆర్థికంగా బలోపేతం కావాలని ఆకాంక్షించారు.

గతంలో పనిచేసిన  ప్రభుత్వం బలహీన వర్గాలను విస్మరించారని, బాధ్యత గా వ్యవహరించక పోవడం వలనే మరింత బలహీనులయ్యారని అన్నారు. ముఖ్యమంత్రి సూచనల మేరకు ప్రజల మధ్యే ఉంటూ వారి అవసరాలను , సమస్య లను గుర్తిస్తూ పని చేస్తున్నామని, అందుకు ప్రజలు మద్ధతు తెలపాలని కోరారు.

Under the Netanna Nestham scheme, 706 people in the district will be benefited and the government's aim is to make the weaker sections economically stronger.