District Collector A. Suryakumari assured that they will work to solve the problems of employees and teachers.
Publish Date : 07/09/2022
ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి కృషి
జిల్లా కలెక్టర్ ఎ.సూర్యకుమారి
విజయనగరం, సెప్టెంబరు 01 ః ఉద్యోగులు, ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తామని జిల్లా కలెక్టర్ ఎ.సూర్యకుమారి హామీ ఇచ్చారు. ఉద్యోగులు, ఉపాధ్యాయుల సమస్యలను తెలుసుకొనేందుకు జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశం కలెక్టరేట్ ఆడిటోరియంలో గురువారం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ఉద్యోగులు, ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి కట్టుబడి ఉన్నామని స్పష్టం చేశారు. ఇంతకుముందు కూడా ఇలాంటి సంయుక్త సమావేశాలను నిర్వహించి, సమస్యల పరిష్కారానికి కృషి చేసినట్లు తెలిపారు. ప్రస్తుతం ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలనుంచి వచ్చిన వినతులను పరిశీలించి, వాటిలో, జిల్లా స్థాయి సమస్యలను వెంటనే పరిష్కరించేందుకు చర్యలు చేపడతామని, రాష్ట్ర స్థాయి సమస్యలను ప్రభుత్వానికి నివేదించి, పరిష్కారానికి కృషి చేస్తామని చెప్పారు.
ఎపి రెవెన్యూ అసోసియేషన్, ఎపి టీచర్స్ ఫెడరేషన్, 108 సర్వీసెస్ ఎంప్లాయిస్ అసోసియేషన్, ఎపి విఆర్ఓస్ అసోసియేషన్, ఎపి ఆర్‌డబ్ల్యూఎస్ ఎంప్లాయిస్, ఇంజనీర్స్ అసోసియేషన్, ఎపి సర్వే ఎంప్లాయిస్ అసోసియేషన్, ఎపి ఎన్‌జీఓస్ అసోసియేషన్, ఎపి నాన్ గ్రాడ్యుయేట్ వెటరేరియన్స్ ఫెడరేషన్, ఎపిఎస్ఆర్‌టిసి ఎంప్లాయిస్ అసోసియేషన్ తదితర పలు సంఘాల నాయకులు మాట్లాడుతూ తమతమ శాఖల పరంగా సమస్యలతోపాటు, ఉద్యోగుల ఇతర సాధారణ అంశాలను కూడా వివరించారు. తమ సంఘాల తరపున వినతిపత్రాలను డిఆర్ఓ ఎం.గణపతిరావుకు అందజేశారు. ఈ కార్యక్రమంలో కలెక్టరేట్ పరిపాలనాధికారి దేవ్‌ప్రసాద్, ఇతర సిబ్బంది, ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల నాయకులు, ప్రతినిధులు పాల్గొన్నారు.
