Construction of priority buildings should be completed by November, house constructions should be reviewed daily with engineering assistants, this crop registration should be completed by 10th of the month, estimates should be sent to Gadapa Gadapa in the program, Collector clarification in Cheepurupalli division review
Publish Date : 12/09/2022
ప్రయారిటీ భవనాల నిర్మాణాలను నవంబర్ లోగా పూర్తి చేయాలి,
గృహ నిర్మాణాలు పై ఇంజనీరింగ్ అసిస్టెంట్ లతో రోజూ సమీక్షించాలి,
ఈ క్రాప్ నమోదు నెల 10 లోగా పూర్తి కావాలి,
గడప గడపకు కార్యక్రమంలో ఎస్టిమేషన్లు పంపాలి,
చీపురుపల్లి డివిజన్ సమీక్ష లో కలెక్టర్ స్పష్టీకరణ
విజయనగరం, సెప్టెంబర్ 06:: ప్రయారిటీ భవనాలను నవంబర్ నెల లోగా పూర్తి చేసి, డిసెంబర్ నుండి ఇతర అభివృద్ధి పనులకు వెళ్లాలని జిల్లా కలెక్టర్ ఎ. సూర్య కుమారి అధికారులకు ఆదేశించారు. ఆర్.బి.కె లు, సచివాలయ, అంగన్వాడీ భవనాలకు సంబంధించి నిధులు ఉన్నాయని, పనుల వేగం పెంచి దసరా నాటికి ప్రారంభోత్సవాలు కు సిద్ధం చేయాలని ఆదేశించారు. వెల్నెస్ కేంద్రాలకు అత్యంత ప్రాధాన్యత నివ్వాలని, ఫామిలీ డాక్టర్ కాన్సెప్ట్ క్రింద వైద్యులు ఈ కేంద్రాల నుండే పని చేస్తారని తెలిపారు. చీపురుపల్లి డివిజన్ అధికారులతో కలెక్టర్ సూర్య కుమారి జె.సి. మయూర్ అశోక్ తో కలసి మంగళవారం హౌసింగ్, ఈ క్రాప్, ప్రయారిటీ భవనాలు, గడప గడపకు, నాడు నేడు తదితర అంశాల పై మండల వారీగా సమీక్షించారు. భవనాలు, గృహాలకు సంబంధించి ఇప్పటివరకు ఒక్క బిల్లు కూడా పడని వాటిని నాట్ స్టార్టడ్ గానే భావిస్తామని, త్వరగా బిల్స్ జెనరేట్ చేయాలని సూచించారు. గృహ నిర్మాణాలలో ఇంజనీరింగ్ అసిస్టెంట్లు పూర్తి స్థాయిలో నిమగ్నం కావాలని, ఇంజినీరింగ్ అసిస్టెంట్ల లాగిన్ లొనే ఇన్ఫ్రా వివరాలను అప్లోడ్ చేయాలని, అప్పుడే నిధుల ఖర్చు, పనుల వివరాలు ఆన్లైన్ లో కనపడతాయని అన్నారు. ప్రతి రోజు పురోగతి పై ఆర్.డి.ఓ, ఎం.పి డి.ఓ లు ఈ.ఏ లను సమీక్షించాలని అన్నారు. చిన్న చిన్న కారణాలతో వెనకపడితే చర్యలు తప్పవని హెచ్చరించారు. పురోగతి తక్కువగా ఉన్నవారికి ఛార్జ్ మెమో లు జారీ చేస్తామన్నారు.
ఈ క్రాప్ నమోదు ఈ నెల 10 లోగా పూర్తి కావలసి ఉండగా ఇప్పటివరకు జిల్లాలో 40 శాతం మాత్రమే అయ్యిందని, దీని పై ప్రత్యేక దృష్టి పెట్టాలని అన్నారు.
గడప గడపకు కార్యక్రమం క్రింద సచివాలయ పరిధిలో ప్రభుత్వం మంజూరు చేసిన 20 లక్షల రూపాయలకు లైన్ ఎస్టిమేషన్లను పంపాలని , సంబంధిత ఎం.ఎల్.ఏ తో మాట్లాడి ప్రభుత్వం నిర్దేశించిన పనులకు ఖర్చు చేయాలని సూచించారు. నాడు నేడు పనులను, మధ్యాహ్న భోజనం పధకాలను ప్రతిరోజు పర్యవేక్షించాలని సూచించారు. స్పందన దరఖాస్తుల పరిష్కారం లో సంబంధిత ఫోటో లను ముందు, తర్వాత అని మార్క్ చేసి అప్లోడ్ చేయాలని తెలిపారు.
