Close

A report on defense in industries should be submitted in 3 months- District Collector Surya Kumari

Publish Date : 12/09/2022

పరిశ్రమలలో రక్షణ పై 3 నెలలో నివేదిక అందజేయాలి

జిల్లా కలెక్టర్ సూర్య కుమారి

విజయనగరం, సెప్టెంబరు 07:: ఇండస్ట్రియల్ సేఫ్టీ ఆడిట్ క్రింద  ఎక్కువగా కాలుష్యం విడుదల చేస్తున్న  రెడ్,  ఆరంజ్ కేటగిరీల పరిశ్రమల్లో రక్షణ ఎక్కుప్మెంట్ ను తనిఖీ  చేసి 3 నెలల్లో  నివేదిక సమర్పించాలని జిల్లా కలెక్టర్ ఎ. సూర్య కుమారి జిల్లా స్థాయి రక్షణ కమిటీకి

         ఆదేశించారు. పరిశ్రమల రక్షణ పై బుధవారం రాష్ట్ర స్థాయి కమిటీ అధికారులతో అన్ని జిల్లాల కలెక్టర్లు, జిల్లా కమిటీ సభ్యులతో వీడియో కాన్ఫరెన్స్ జరిగింది. ఈ వీడియో కాన్ఫరెన్స్ కు  జిల్లా స్థాయి కమిటీ చైర్మన్ మరియు జిల్లా  కలెక్టర్ తో పాటు సభ్యులు పరిశ్రమసల శాఖ జి.ఎం పాపారావు, కర్మాగారాల ఉప తనిఖీ అధికారి నారాయణ, కార్మిక శాఖ ఉప కమిషనర్ శుభ్రహ్మణ్యం, పి.సి.బి ఈ ఈ లు పాల్గొన్నారు. వి.సి అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ ఇటీవల రాష్ట్రంలో పరిశ్రమలలో  జరిగిన ప్రమాదాలను దృష్టి లో పెట్టుకొని పరిశ్రలలో సేఫ్టీ ని తనిఖీ చేయడానికి జిల్లా స్థాయి కమిటీలను ప్రభుత్వం ఏర్పాటు చేసిందని తెలిపారు. జిల్లాలో రెడ్, ఆరంజ్ కేటగిరీ లలో 62 పరిశ్రమలు ఉన్నాయని, వాటిని కమిటీ సభ్యులు తనిఖీ చేసి 3 నెలల్లో నివేదికను రాష్ట్ర స్థాయి కమిటీ కి పంపవలసి ఉంటుందని తెలిపారు.

A report on defense in industries should be submitted in 3 months- District Collector Surya Kumari