Close

Jagananna Sports Club in every village, District Collector A. Suryakumari

Publish Date : 12/09/2022

ప్ర‌తీ గ్రామంలో జ‌గ‌న‌న్న స్పోర్ట్స్‌ క్ల‌బ్‌

జిల్లా క‌లెక్ట‌ర్ ఎ.సూర్య‌కుమారి

విజ‌య‌న‌గ‌రం, సెప్టెంబ‌రు 10 ః  ప్ర‌తీ గ్రామంలో జ‌గ‌న‌న్న స్పోర్ట్స్ క్ల‌బ్‌ను ఏర్పాటు చేయాల‌ని జిల్లా క‌లెక్ట‌ర్ ఎ.సూర్య‌కుమారి ఆదేశించారు. జ‌గ‌న‌న్న స్పోర్ట్స్ క్ల‌బ్‌ల ఏర్పాటుకు సంబంధించి ప్ర‌చార గోడ‌ప‌త్రిక‌ల‌ను, క‌లెక్ట‌ర్ త‌న క్యాంపు కార్యాల‌యంలో శ‌నివారం ఆవిష్క‌రించారు. స్పోర్ట్స్ క్ల‌బ్ ఏర్పాటుకోసం ప్ర‌భుత్వం రూపొందించిన ప్ర‌త్యేక యాప్‌కు విస్తృత ప్ర‌చారం క‌ల్పించాల‌ని క‌లెక్ట‌ర్ కోరారు. గ్రామంలోని క్రీడాకారుల‌ను గుర్తించి, వారిని సంఘ‌టిత ప‌రిచి, ఈ క్ల‌బ్‌ల‌ను ఏర్పాటు చేయాల‌ని, దీనికోసం ప్లే స్టోర్ నుంచి యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాల‌ని సూచించారు. ఈ కార్య‌క్ర‌మంలో సెట్విజ్ సిఇఓ బి.రామానందం, ఛీఫ్ కోచ్ పి.అప్ప‌ల‌నాయుడు పాల్గొన్నారు.

Jagananna Sports Club in every village, District Collector A. Suryakumari