Close

Construction of houses for airport residents should be speeded up, house entry should be done by Dussehra in Gudepuvalasa, basic facilities should be completed by the end of the month, District Collector A. Surya Kumari

Publish Date : 14/09/2022

ఎయిర్పోర్ట్  నిర్వాసితుల గృహనిర్మాణాలు వేగవంతం కావాలి

 గుడెపువలస  లో  దసరాకి గృహప్రవేశాలు

నెలాఖరులోగా మౌలిక వసతులు పూర్తి చేయాలి

 జిల్లా కలెక్టర్ ఎ. సూర్య కుమారి

విజయనగరం, సెప్టెంబరు 13: భోగాపురం ఎయిర్పోర్ట్ నిర్వాసితుల కు సంబంధించిన గృహ నిర్మాణాలను వేగంగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టరు ఎ. సూర్య కుమారి ఆదేశించారు. గూడెపు వలస  గ్రామంలో దసరా నాడు గృహ ప్రవేశాలకు ఏర్పాట్లు చేయాలని సూచించారు. మంగళవారం కలెక్టర్ తన ఛాంబర్ లో భోగాపురం నిర్వాసితుల   కు సంబంధించి ఆర్ అండ్ ఆర్ పనుల పై జె.సి మయూర్ అశోక్ తో కలసి సమీక్షించారు. పొలిపల్లి, గూడెపువలస, బొల్ల0కల పాలెం, రెల్లిపేట గ్రామాల్లో జరుగుతున్న పనులను వర్క్ వారీగా సమీక్షించారు.  అంతర్గత రహదారులు, తాగునీటి సరఫరా, పోస్ట్ ఆఫీస్, అంగన్వాడీ భవనం వెల్నెస్ సెంటర్, డిజిటల్ లైబ్రరీ, సచివాలయం, వెటర్నరీ ఆసుపత్రి, డంపింగ్ యార్డ్, స్మశానం   తదితర నిర్మానాలను వేగవంతం చేయాలన్నారు. అదే విధంగా  రామాలయం, గ్రామ దేవత అమ్మవారి  గుడులను కూడా సిద్ధం చేయాలన్నారు. పెండింగ్ ఉన్న రహదారి పనులకు తక్షణమే టెండర్లను పిలవాలని ఆర్ అండ్ బి ఈఈ కు  సూచించారు. పెండింగ్ కోర్ట్ కేసు లన్నిటికీ  కౌంటర్లు వేయడం పూర్తి అయినప్పటికీ త్వరగా పరిష్కారం జరిగేలా చూడాలన్నారు. ఎయిర్పోర్ట్ కు అవసరమగు 2203 ఎకరాలకు గాను 2183 ఎకరాలకు వెజిటేరియన్  క్లియరెన్స్ పూర్తి చేయడం జరిగిందని తెలిపారు. మిగిలిన 10 శాతం కూడా  త్వరగా పూర్తి చేయాలన్నారు.

ఈ సమావేశంలో ఆర్.డి.ఓ సూర్యకళ, పంచాయతీ రాజ్ ఈఈ గుప్త, తహసీల్దార్ శ్రీనివాస రావు, డీఈ లు పాల్గొన్నారు.

Construction of houses for airport residents should be speeded up, house entry should be done by Dussehra in Gudepuvalasa, basic facilities should be completed by the end of the month, District Collector A. Surya Kumari