Land acquisition for projects and roads should be speeded up, District Collector A. Surya Kumari
Publish Date : 16/09/2022
ప్రోజెక్టుల, రహదారుల భూసేకరణ వేగవంతం కావాలి
జిల్లా కలెక్టర్ ఎ. సూర్య కుమారి
విజయనగరం, సెప్టెంబరు 14:: జిల్లాలో జాతీయ రహదారులకు, జలవనరుల ప్రాజెక్టులకు చేపడుతున్న భూసేకరణ వేగంగా జరగాలని జిల్లా కలెక్టర్ ఎ. సూర్య కుమారి ఆదేశించారు. బుధవారం కలెక్టర్ ఛాంబర్ లో జె.సి మయూర్ అశోక్ తో కలసి భూ సేకరణ పై ఉప కలెక్టర్లు, ఇరిగేషన్ ఇంజినీర్ల తో తోటపల్లి, తారకరామా, గజపతి నగరం బ్రాంచ్ కెనాల్, ఉత్తరాంధ్ర సుజల స్రవంతి , జాతీయ రహదారి తదితర ప్రాజెక్టుల పై సమీక్షించారు. తోటపల్లి కి సంబంధించిన పనులన్నీ అక్టోబర్ మొదటి వారానికి పూర్తి కావాలని తెలిపారు. ప్రాజెక్టులకు సేకరించిన భూములకు పరిహారాన్ని త్వరగా అందించి భూములను ఇంజనీరింగ్ అధికారులకు అప్పగించాలని భూ సేకరణ ఉప కలెక్టర్లకు సూచించారు. ఉత్తరాంధ్ర సుజల స్రవంతికి సంబంధించి అవార్డ్ పాస్ చేయడానికి సిద్ధంగా ఉన్నామని, త్వరగా పూర్తి గావించి అవార్డ్ లను పాస్ చేయాలన్నారు. షెడ్యూల్ ప్రకారంగా గ్రామ సభలు నిర్వహించి రైతులకు అవగాహన కలిగించి ఒప్పించాలని అన్నారు. గ్రామ సభల్లో ఏ ప్రాజెక్ట్ ఎంతవరకు వెళ్తుంది, ఎంత భూమి అవసరం అవుతోంది,ఏ ఏ గ్రామాల ద్వారా ప్రాజెక్ట్ లు కొనసాగుతున్నది తదితర వివరాలు తెలిపే మ్యాప్ లను ఫ్లెక్సీ చేసి ప్రదర్శించాలని సూచించారు. నెల రోజుల్లో భూ సేకరణ పురోగతి కనపడాలని, ఉద్యాన, పంటల నష్టాలను త్వరగా అంచనా వేసి అధికారులంతా సమన్వయంగా పని చేయాలని తెలిపారు.
ఈ సమావేశంలో పార్వతీపురం, బొబ్బిలి, చీపురుపల్లి ప్రత్యేక ఉప కలెక్టర్లు సుదర్శన దొర, వెంకటేశ్వర రావు, పద్మలత, జలవనరుల ఈ ఈ లు రామచంద్ర రావు, ఉమేష్ కుమార్, డీఈ లు పాల్గొన్నారు.
