Land owners should provide necessary information, distribution of land title deeds in first installment in 125 villages, allotment of land parcel numbers to land owners, revealed Joint Collector Mayur Ashok.
Publish Date : 26/09/2022
భూయజమానులు అవసరమైన సమాచారం అందజేయాలి
125 గ్రామాల్లో తొలి విడతగా భూహక్కు పత్రాల పంపిణీ
భూ యజమానులకు లాండ్ పార్శిల్ నెంబర్లు కేటాయింపు
జాయింట్ కలెక్టర్ మయూర్ అశోక్ వెల్లడి
విజయనగరం, సెప్టెంబరు 22 :జిల్లాలో వై.ఎస్.ఆర్. జగనన్న సమగ్ర భూహక్కు- భూరక్ష పథకం కింద చేపడుతున్న సమగ్ర భూసర్వే ఇప్పటివరకు 17 మండలాల్లోని 125 గ్రామాల్లో పూర్తయిందని జాయింట్ కలెక్టర్ మయూర్ అశోక్ వెల్లడించారు. ఈ గ్రామాల్లో భూ యజమానులు తమ గ్రామ రెవిన్యూ అధికారికి తమకు సంబంధించిన ఆధార్, బ్యాంకు ఖాతా, ఫోటో, మొబైల్ నెంబరు వంటి వ్యక్తిగత సమాచారాన్ని అందించి సహకరించాలని విజ్ఞప్తి చేశారు. జిల్లాలో 650 గ్రామాల్లో డ్రోన్ సర్వే పూర్తయ్యిందని వెల్లడించారు. అక్టోబరు మొదటి వారంలో భూసర్వే పూర్తయిన గ్రామాల్లో భూయజమానులకు భూహక్కు పత్రాలు పంపిణీ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్టు పేర్కొన్నారు. జిల్లాలో భూముల రీసర్వే వేగవంతంగా జరుగుతోందన్నారు. రీసర్వే పూర్తయిన గ్రామాల్లో భూముల రిజిస్ట్రేషన్ సేవలు కూడా సచివాలయాల్లోనే అందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. రీసర్వేలో భాగంగా భూయజమానులకు లాండ్ పార్శిల్ నెంబరు కేటాయించడం జరుగుతుందన్నారు. జిల్లాలోని ఈ క్రింది గ్రామాల్లో భూయజమానులు తమ సమాచారం ఇవ్వనట్లయితే తమ గ్రామ వి.ఆర్.ఓ.లకు తగిన సమాచారం అందించాలని కోరారు. మొదటి విడతలో రీసర్వే పూర్తయిన గ్రామాల వివరాలు ఇలా వున్నాయి.
గజపతినగరం :
నారాయణ గజపతి రాజపురం, డోలపాలెం, రామన్నపేట
తెర్లాం :
రామన్న అగ్రహారం, చుక్కవలస
దత్తిరాజేరు :
లింగరాజపురం, నీలకంఠరాజపురం, చెరకుపల్లి, దత్తి వెంకటాపురం, లక్ష్మీపురం, విశ్వేశ్వరాయపురం
బాడంగి : ఆనవరం, గోపాలకృష్ణరాయపురం, పి.వెంకంపేట, గూడేపువలస, కామన్నవలస, గజరాయునివలస, తెంటువలస, పెదపల్లి, పిండ్రంగివలస, వీరసాగరం, రామచంద్రాపురం, డి.వెంకయ్యపేట
బొబ్బిలి :
జగన్నాధపురం, జె.రంగరాయపురం)@కునుకువానివలస, బూర్జవలస (మెట్టవలసదగ్గర)
మెంటాడ :
చల్లపేట, అమరాయవలస
రామభద్రపురం :
అప్పలరాజుపేట, గొల్లపేట, శీతారంపురం, మామిడివలస, బూసాయవలస, సోంపురం, కొండపాలవలస, గంగన్న పాలవలస, నాయుడువలస, మర్రివలస, దుప్పలపూడి, నరసాపురం
గుర్ల :
గోషాడ, కలవచెర్ల
రాజాం :
విజయరామపురం, రామానుజుల పేట
రేగిడి ఆమదాలవలస :
గోపెంపేట, ఆడవరం, అక్కన్న అగ్రహారం, ఉప్పరనాయుడు వలస
వంగర :
టి.డి.కె.పురం, మద్దివలస
సంతకవిటి:
తమరాం, పేషాద్రిపురం
కొత్తవలస :
రాయపురాజుపేట, సుందరయ్యపేట
జామి :
శిరికిపాలెం, కిర్ల
డెంకాడ : బెల్లాం
పూసపాటిరేగ : పోరాం
బొండపల్లి : తమటాడ
