The Vijayanagara festival kicked off in earnest on Sunday with dazzling art forms, impressive folk performances and rousing enthusiasm.
Publish Date : 14/10/2022
ఘనంగా ప్రారంభమైన విజయనగరం ఉత్సవాలు
పురవీధుల్లో జానపద కళల జాతర
ర్యాలీని ప్రారంభించిన మంత్రి బొత్స
వర్షంలోనూ తరగని ఉత్సాహం
చిందేసిన ఎంఎల్‌సి రఘురాజు, ఆర్‌డిఓ సూర్యకళ
విజయనగరం, అక్టోబరు 09 ః అబ్బురపరిచే కళారూపాలు, ఆకట్టుకొనే జానపద ప్రదర్శనలు, ఉరకలెత్తే ఉత్సాహంతో విజయనగర ఉత్సవాలు ఆదివారం ఘనంగా ప్రారంభమయ్యాయి. ఉత్సవ ర్యాలీని శ్రీ పైడితల్లి అమ్మవారి ఆలయం వద్ద, రాష్ట్ర విద్యాశాఖామంత్రి బొత్స సత్యనారాయణ ప్రారంభించారు. వేలాదిమంది పాల్గొన్న ఈ భారీ ర్యాలీ మహారాజా కోట మీదుగా సింహాచలం మేడ వరకు సాగింది. కోట జంక్షన్ వద్ద ఏర్పాటు చేసిన వేదిక నుంచి మంత్రి బొత్స సత్యనారాయణ, డిప్యుటీ స్పీకర్ కోలగట్ల వీరభద్రస్వామి, జెడ్‌పి ఛైర్మన్ మజ్జి శ్రీనివాసరావు, ఎంపి బెల్లాన చంద్రశేఖర్, ఎంఎల్‌సిలు ఇందుకూరి రఘురాజు, పెనుమత్స సురేష్‌బాబు, జిల్లా కలెక్టర్ ఎ.సూర్యకుమారి, ఎస్‌పి దీపిక, జాయింట్ కలెక్టర్ మయూర్ అశోక్ తదితరులు తిలకించారు.
వివిధ జానపద కళారూపాలు, విద్యార్థుల ప్రదర్శనలతో వర్షంలో సైతం ర్యాలీ ఆద్యంతమూ ఉత్సాహంగా సాగింది. కేరళ కళాకారులతో ఎంఎల్‌సి ఇందుకూరి రఘురాజు, ఆర్‌డిఓ సూర్యకళ పాదం కలిపి చిందేయడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. వారిని జిల్లా కలెక్టర్ సూర్యకుమారి, జెడ్‌పి ఛైర్మన్ మజ్జి శ్రీనివాసరావు సైతం ఉత్సాహ పరిచారు. జిల్లా ఉత్సవాల చరిత్రలో అత్యంత భారీ ర్యాలీని నిర్వహించారు. సుమారు 52 విభాగాలు ఈ ర్యాలీలో పాల్గొన్నాయి. రోలర్ స్కేటర్స్, పైడితల్లి అమ్మవారి ఘటాలు, నాదస్వరం, నవ దుర్గలు, ఆగమ పండితుల బృందం, సంగీత కళాశాల విద్యార్థులు, అధ్యాపకుల ర్యాలీ, జిల్లా కవులు, రచయితల ర్యాలీ, థింసా నృత్యం, సచివాలయాల బృందం, వలంటీర్లు, బాలికల బ్యాండ్, అంగన్‌వాడీ కర్యకర్తలు, ఎఎన్ఎంలు, తప్పెటగుళ్లు, పట్టణ లెటరింగ్ కళాకారులు, మహాత్మాగాంధీ, నెహ్రూ, అంబేద్కర్, కందుకూరి, టంగుటూరి వేషధారణలు, గురజాడ వేషధారణలు, ఆదిభట్ల నారాయణదాసు వేషధారణ, కోలాటం, అల్లూరి, గిడుగు, కోడి రామ్మూర్తి వేషధారణ, బాలుర బ్యాండ్, చెక్క భజనలు, స్కౌట్స్ మరియు గైడ్స్, ఎన్‌జిఓలు, జెడ్‌పి మినిస్టీరియల్ అసోసియేషన్, డేన్సర్స్ అసోసియేషన్, క్రీడా సంఘాలు, పులి వేషాలు, ఎన్ఎస్ఎస్, తెలుగుతల్లి, దుర్గాదేవి, ఝాన్సీలక్ష్మిభాయి వేషధారణలు, సాము గరిడీ, వాకర్స్ క్లబ్, డ్వాక్రా సంఘాలు, గరగ నృత్యం, ఎన్‌సిసి స్టూడెంట్స్, బుట్ట బొమ్మలు, విచిత్ర వేషధారణలు, బిందెల డాన్స్, ప్రభుత్వ ప్రయివేటు కళాశాలలు, పాఠశాలల విద్యార్థులు, మెడికల్, ఇంజనీరింగ్ విద్యార్థులు, కేరళ డప్పు వాయిద్యాలు, తీన్‌మార్ బ్యాండ్, టిటిడి భక్తుల కోలాటం, దేవుడి దాసులు, డప్పు వాయిద్యాలు, వివిధ ప్రభుత్వ శాఖల కార్యాలయాలు సిబ్బంది ఈ ర్యాలీలో పాల్గొన్నాయి. కార్యక్రమంలో డిఆర్ఓ ఎం.గణపతిరావు, ఆర్‌డిఓ సూర్యకళ, ర్యాలీ సమన్వయకర్త సుధాకర్, ఇన్‌ఛార్జి అధికారులు, పలువురు ప్రముఖులు, ఉత్సవ కమిటీ సభ్యులు, వివిధ సంస్థల ప్రతినిధులు, అధికారులు, కళాకారులు తదితరులు పాల్గొన్నారు.