Close

A new Revenue Division with 9 zones has been set up at Cheepurupalli

Publish Date : 06/04/2022

ఆర్‌డిఓ కార్యాల‌యాన్ని ప్రారంభించిన మంత్రి బొత్స‌

చీపురుప‌ల్లి (విజ‌య‌న‌గ‌రం), ఏప్రెల్ 04 ః    చీపురుప‌ల్లి ప్ర‌జ‌ల చిర‌కాల వాంఛ నెర‌వేరింది. చీపురుప‌ల్లి కేంద్రంగా 9 మండ‌లాల‌తో కొత్త రెవెన్యూ డివిజ‌న్ ఏర్పాట‌య్యింది. ఈ డివిజ‌న్‌లో చీపురుప‌ల్లి, గ‌రివిడి, గుర్ల‌, నెల్లిమ‌ర్ల‌, మెర‌క‌ముడిదాం, వంగ‌ర‌, రేగిడి ఆమ‌దాల‌వ‌ల‌స‌, సంత‌క‌విటి, రాజాం మండ‌లాలు ఉన్నాయి.  డివిజ‌న్ కేంద్ర‌మైన చీపురుప‌ల్లి ప‌ట్ట‌ణంలో కొత్త‌గా ఏర్పాటు చేసిన ఆర్‌డిఓ కార్యాల‌యాన్ని, రాష్ట్ర పుర‌పాల‌క‌, ప‌ట్ట‌ణాభివృద్ది శాఖామంత్రి బొత్స స‌త్య‌నారాయ‌ణ సోమ‌వారం ప్రారంభించారు. ఈ సంద‌ర్భంగా గ‌రివిడి నుంచి చీపురుప‌ల్లి వ‌ర‌కూ భారీ మోటార్ సైకిల్ ర్యాలీని నిర్వ‌హించి, ప్ర‌భుత్వానికి కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు.

               ఈ కార్య‌క్ర‌మంలో  జిల్లాప‌రిష‌త్ ఛైర్మ‌న్ మ‌జ్జి శ్రీ‌నివాస‌రావు,  విజ‌య‌న‌గ‌రం పార్ల‌మెంటు స‌భ్యులు బెల్లాన చంద్ర‌శేఖ‌ర్‌, ఎంఎల్‌సి పెనుమ‌త్స సురేష్‌బాబు, రాజాం శాస‌న‌స‌భ్యులు కంబాల జోగులు, నెల్లిమ‌ర్ల ఎంఎల్ఏ బ‌డ్డుకొండ అప్ప‌ల‌నాయుడు, జిల్లా క‌లెక్ట‌ర్ ఎ.సూర్య‌కుమారి, ఎస్‌పి దీపిక, జాయింట్ క‌లెక్ట‌ర్ మ‌యూర్ అశోక్‌, విజ‌య‌న‌గ‌రం ఆర్‌డిఓ బిహెచ్ భ‌వానీ శంక‌ర్‌, చీపురుప‌ల్లి ఆర్‌డిఓ ఎం.అప్పారావు, ప‌లువురు అధికారులు, నాయ‌కులు పాల్గొన్నారు.

A new Revenue Division with 9 zones has been set up at Cheepurupalli