Close

All the branches should move to the new district and we will allot space for the construction, said the District Collector. Suryakumari

Publish Date : 05/03/2022

కొత్త జిల్లాకు అన్ని శాఖలూ తరలిరావాలి

భవనాల నిర్మాణానికి స్థలం కేటాయిస్తాం

జిల్లా కలెక్టర్ ఎ. సూర్యకుమారి

పార్వతీపురంలో విస్తృత పర్యటన

ప్రభుత్వ  కార్యాలయాలకు భవనాల పరిశీలన

పార్వతీపురం (విజయనగరం), మార్చ్ 04 :    కొత్త జిల్లా కేంద్రం పార్వతీపురంలో అన్ని ప్రభుత్వ శాఖలు తమ కార్యాలయాలను ఏర్పాటు చేయాలని జిల్లా కలెక్టర్ శ్రీమతి ఎ సూర్యకుమారి ఆదేశించారు. ఉగాది నుంచి కొత్త జిల్లాల్లో పాలన మొదలవుతుందని స్పష్టం చేశారు. సబ్ కలెక్టర్ భావన, ఐటిడిఎ పీవో ఆర్.కూర్మనాధ్ తో కలిసి కలెక్టర్ పార్వతీపురంలో శుక్రవారం విస్తృతంగా పర్యటించారు.

       ప్రభుత్వ కార్యాలయాలకు గుర్తించిన తాత్కాలిక భవనాలను కలెక్టర్ పరిశీలించారు. భవనాల్లో వసతులను తనిఖీ చేశారు. కలెక్టర్ క్యాంప్ కార్యాలయం, నివాసం కోసం ప్రతిపాదించిన సబ్ కలెక్టర్ క్యాంప్ ఆఫీస్, ఇతర భవనాలను పరిశీలించారు. కలెక్టర్, జేసీ కార్యాలయాలకు ప్రతిపాదించిన ఐటిడిఎ నూతన భవనాన్ని పరిశీలించి, పలు సూచనలు చేశారు. పనులను త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు. వివిధ ప్రభుత్వ కార్యాలయాలు ఏర్పాటు చేయాలని నిర్ణయించిన ఆర్సీఎం పాఠశాల భవనాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేశారు. ప్రతీ అంతస్తును, గదిని పరిశీలించి, పలు ఆదేశాలు జారీ చేశారు. అక్కడి వంటగదిని కేంటీన్ గా మార్చాలని సూచించారు. పాఠశాల యాజమాన్యంతో మాట్లాడారు. ఇతర కార్యాలయాల కోసం సబ్ కలెక్టర్ కార్యాలయం, ఐటీడీవో పీవో కార్యాలయం, వైటీసీ, అటవీశాఖ గెస్ట్ హౌస్, కోన్ని ప్రయివేటు భవనాలను, ప్రభుత్వ భవన సముదాయాల నిర్మాణం కోసం పలు స్థలాలను పరిశీలించారు. ఈ మేరకు ప్రభుత్వానికి ఇప్పటికే ప్రతిపాదనలు పంపించడం జరిగిందని చెప్పారు. కొత్త కార్యాలయాలు ఏర్పాటు కోసం భవనాలను గుర్తించడంలో, ఇతర జిల్లాలకంటే ముందున్నామని, దాదాపు అన్ని కార్యాలయాలకు భవనాలను గుర్తించడం పూర్తి అయ్యిందని తెలిపారు. ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా త్వరలో ఎంవోయూ కుదుర్చుకుంటామని చెప్పారు.

     అనంతరం ఐటిడిఎ సమావేశ మందిరంలో వివిధ శాఖల అధికారులు, సిబ్బంది తో కలెక్టర్ సమావేశాన్ని నిర్వహించారు. ఆయాశాఖల అవసరాలను, ప్రస్తుతం అందుబాటులో ఉన్న వనరులని, సిబ్బంది, వాహనాల పరిస్థితిని తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, కొత్త జిల్లాకు తరలివచ్చేందుకు అన్ని శాఖలు సిద్ధం కావాలని ఆదేశించారు. దాదాపు 74 ప్రభుత్వ శాఖలకు భవనాలను గుర్తించడం జరిగిందని, అన్ని వసతులతో, చిన్నచిన్న మార్పులతో వాటిని సిద్ధం చేస్తామని చెప్పారు. జిల్లాస్థాయి అధికారులకోసం కొత్త ఫోన్ నంబర్లు సిద్ధం చేయాలని, క్రిందిస్తాయి సిబ్బందిని ఆదేశించారు. ఆయా శాఖాధిపతుల కోసం కొత్తగా మెయిల్ ఐడి లను సిద్ధం చేస్తామని చెప్పారు. ప్రభుత్వ భవనాల నిర్మాణం కోసం ఇప్పటికే సుమారు 200 ఎకరాల స్థలాన్ని గుర్తించడం జరిగిందని, సొంత కార్యాలయ నిర్మాణం కోసం ముందుకు వచ్చే శాఖకు వెంటనే స్థలాన్ని కేటాయించడం జరుగుతుందని చెప్పారు. అవకాశం ఉన్న శాఖలు, సొంత భవనాన్ని నిర్మించుకోవడానికీ ముందుకు రావాలని కలెక్టర్ సూచించారు. ఈ పర్యటనలో మున్సిపల్ కమిషనర్ సింహాచలం, ఆర్ అండ్ బి ఎస్ఈ వికె విజయశ్రీ, ఇఇ లు జివి వెంకటరమణ, నాగ మోహన్, ఆర్.డబ్ల్యూ.ఎస్ ఎస్ఈ కె.శివానందకుమార్, ఈఈ యడ్ల గోవిందరావు, ఐటిడిఎ అధికారులు, ఇతర సిబ్బంది పాల్గొన్నారు.

All the branches should move to the new district and we will allot space for the construction, said the District Collector. Suryakumari