Aquarium exhibition in Shilparam on Sunday
Publish Date : 22/07/2022
ఆదివారం శిల్పారామం లో ఆక్వేరియం ప్రదర్శన
విజయనగరం, జులై 22: కలెక్టరు మరియు జిల్లా మెజిస్ట్రేట్, విజయనగరం వారి ఆదేశాల మేరకు శిల్పారామం – వ్యాస నారాయణ మెట్ట సమీపంలో (నల్లచెరువు) విజయనగరం నందు తేది. 24.07.2022 అనగా ఆదివారం మధ్యాహ్నం 3 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు మత్స్య శాఖ, విజయనగరం వారి ఆద్వర్యంలో అక్వేరియం ప్రదర్శన & అమ్మకాలు, ఫిష్ ఆంధ్రా అవుట్ లెట్ స్టాల్, వివిధ రకాల జాతుల చేపల ప్రదర్శన మొదలగు కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని మత్స్య శాఖ డి డి నిర్మలా కుమారి ఒక ప్రకటనలో తెలిపారు. కావున ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని ఈ కార్యక్రమమును జయప్రదం చేయాలని కోరారు.