Close

Awareness should be provided on the scheme for complete home ownership in the world,District Collector A. Suryakumari

Publish Date : 28/10/2021

జ‌గ‌న‌న్న సంపూర్ణ గృహ‌హ‌క్కు ప‌థ‌కంపై అవ‌గాహ‌న క‌ల్పించాలి
జిల్లా క‌లెక్ట‌ర్ ఎ.సూర్య‌కుమారి
గ్రామ స‌చివాల‌యం, ఆర్‌బికె త‌నిఖీ

గ‌జ‌ప‌తిన‌గ‌రం, (విజ‌య‌న‌గ‌రం), అక్టోబ‌రు 27  ః ప్ర‌భుత్వం అమ‌లు చేస్తున్న జ‌గ‌న‌న్న సంపూర్ణ గృహ‌హ‌క్కు ప‌థ‌కంపై ల‌బ్దిదారుల‌కు పూర్తిస్థాయిలో అవ‌గాహ‌న క‌ల్పించి, దీనిని వినియోగించుకొనేలా చూడాల‌ని జిల్లా క‌లెక్ట‌ర్ శ్రీ‌మ‌తి ఎ.సూర్య‌కుమారి స‌చివాల‌య సిబ్బందిని ఆదేశించారు. ఈ ప‌థ‌కం ద్వారా అతి త‌క్కువ మొత్తాన్ని చెల్లించి, గ‌రిష్ట ప్ర‌యోజ‌నం పొంద‌వ‌చ్చ‌ని సూచించారు.
గ‌జ‌ప‌తిన‌గ‌రం మండ‌లం, ముచ్చెర్ల గ్రామ స‌చివాల‌యాన్ని, రైతు భ‌రోసా కేంద్రాన్ని, జిల్లా క‌లెక్ట‌ర్ సూర్య‌కుమారి బుధ‌వారం ఆక‌స్మికంగా త‌నిఖీ చేశారు. ముందుగా  సిబ్బంది హాజ‌రును ప‌రిశీలించారు. గ్రామ‌స్తుల‌నుంచి వ‌చ్చిన అర్జీలు, వాటి ప్ర‌స్తుత స్థితిపైనా, కోవిడ్ వేక్సినేష‌న్‌పైనా ఆరా తీశారు. ఎప్ప‌టిక‌ప్పుడు వ‌చ్చిన‌ ద‌ర‌ఖాస్తుల‌ను ప‌రిశీలించి,  స‌మ‌స్యల‌ను ప‌రిష్క‌రించాల‌ని ఆదేశించారు.  సచివాల‌య ప‌రిధిలో వివిధ ప్ర‌భుత్వ ప‌థ‌కాల అమ‌లు తీరుపై ప్ర‌శ్నించారు. ప‌థ‌కాల‌కు సంబంధించి, స‌చివాల‌యంలో ఉంచిన పోస్ట‌ర్ల‌ను ప‌రిశీలించారు. జ‌గ‌న‌న్న సంపూర్ణ గృహ‌హ‌క్కు ప‌థ‌కంపై విస్తృతంగా ప్ర‌చారాన్ని చేయాల‌ని సూచించారు. అనంత‌రం రైతు భ‌రోసా కేంద్రాన్ని త‌నిఖీ చేశారు. విత్త‌నాలు, ఎరువుల స‌ర‌ఫ‌రాపై సిబ్బందిని ప్ర‌శ్నించారు. గ్రామ‌స్తులు, రైతుల‌తో మాట్లాడి వారి స‌మ‌స్య‌ల‌ను తెలుసుకున్నారు. ప్ర‌తీఒక్క‌రూ త‌ప్ప‌నిస‌రిగా కోవిడ్ వేక్సిన్ వేయించుకోవాల‌ని కలెక్ట‌ర్ కోరారు.

Awareness should be provided on the scheme for complete home ownership in the world,District Collector A. Suryakumari