Close

Calm Panchayat Elections, 86.92 per cent Voting Registration, Supervised by Collector Suryakumari, Self Counting Examiner

Publish Date : 15/11/2021

ప్ర‌శాంతంగా పంచాయితీ ఎన్నిక‌లు
86.92 శాతం ఓటింగ్ న‌మోదు
ప‌ర్య‌వేక్షించిన క‌లెక్ట‌ర్ సూర్య‌కుమారి
స్వ‌యంగా కౌంటింగ్ ప‌రిశీల‌న‌
విజ‌య‌న‌గ‌రం, న‌వంబ‌రు 14 ః
          పంచాయితీ ఎన్నిక‌ల ప్ర‌క్రియ ఆదివారం ప్ర‌శాంతంగా పూర్త‌య్యింది. జిల్లాలో ఖాళీగా ఉన్న రెండు స‌ర్పంచ్ స్థానాల‌కు, మ‌రో రెండు వార్డు స‌భ్యుల స్థానాల‌కు ఎన్నికలు జ‌రిగాయి. మొత్తంమీద స‌గ‌టున 86.92 శాతం ఓటింగ్ న‌మోద‌య్యింది. భోగాపురం మండ‌లం లింగాల‌వ‌ల‌స స‌ర్పంచ్ స్థానానికి 89.42 శాతం, నెల్లిమ‌ర్ల మండ‌లం ఎటి అగ్ర‌హారం స‌ర్పంచ్ స్థానానికి 90.30 శాతం, ఎల్‌.కోట మండ‌లం రేగ‌లోని వార్డు మెంబ‌రు స్థానానికి 85.39శాతం, మ‌క్కువ మండ‌లం కాశీప‌ట్నం వార్డు మెంబ‌రు స్థానానికి 63.62శాతం ఓటింగ్ న‌మోద‌య్యింది.
         ఎన్నిక‌ల అనంత‌రం మ‌ధ్యాహ్నం ఓట్ల లెక్కింపు నిర్వ‌హించారు. లింగాల‌వ‌ల‌స స‌ర్పంచ్ ఎన్నిక‌లో బుగత లలిత స‌ర్పంచ్‌గా గెలుపొందారు. ఎటి అగ్ర‌హారంలో  స‌ర్పంచ్‌గా మీసాల సూర్యాకాంతం గెలుపొందారు. వార్డు స‌భ్యుల స్థానాల‌కు సంబంధించి రేగ‌లో లెంక శ్రీను, కాశీప‌ట్నంలో అల్లు కృష్ణవేణి గెలుపొందారు. ప‌టిష్ట‌మైన పోలీసు బందోబ‌స్తు ఏర్పాటు చేయ‌డంతో, ఎటువంటి అవాంఛ‌నీయ సంఘ‌ట‌న‌లూ చోటుచేసుకోకుండా, ఎన్నిక‌ల ప్ర‌క్రియ ప్ర‌శాంతంగా ముగిసింది.
ప‌ర్య‌వేక్షించిన క‌లెక్ట‌ర్ సూర్య‌కుమారి
          పంచాయితీ ఎన్నిక‌ల ప్ర‌క్రియ‌ను జిల్లా క‌లెక్ట‌ర్ శ్రీ‌మ‌తి ఎ.సూర్య‌కుమారి ప‌ర్య‌వేక్షించారు. ఎప్ప‌టిక‌ప్పుడు ఓటింగ్ శాతాన్ని, బూత్‌ల‌వ‌ద్ద ప‌రిస్థితిని తెలుసుకుంటూ, ప‌లు ఆదేశాల‌ను జారీ చేశారు. నెల్లిమ‌ర్ల మండ‌లం ఎటి అగ్ర‌హారం వ‌ద్ద నిర్వ‌హించిన ఓట్ల లెక్కింపు ప్ర‌క్రియ‌ను క‌లెక్ట‌ర్ స్వ‌యంగా ప‌రిశీలించారు. క‌లెక్ట‌రేట్‌లో ఏర్పాటు చేసిన కంట్రోలు రూము నుంచి డిఆర్ఓ ఎం.గ‌ణ‌ప‌తిరావు, జిల్లా పంచాయితీ అధికారి ఎస్‌.సుభాషిణి ఎన్నిక‌ల‌ను ప‌ర్య‌వేక్షించారు.
Calm Panchayat Elections, 86.92 per cent Voting Registration, Supervised by Collector Suryakumari, Self Counting Examiner