Close

Cash prize for those who provide information that gender determination tests are being conducted, District Collector Surya Kumari

Publish Date : 23/06/2022

లింగ నిర్ధారణ పరీక్షలు జరుపుతున్నట్లు సమాచారం అందించే వారికి నగదు బహుమతి

జిల్లా కలెక్టర్ సూర్య కుమారి

విజయనగరం, జూన్ 22::    జిల్లాలో ఎక్కడైనా స్కానింగ్ కేంద్రాల్లో గానీ, లాబ్ లలో గానీ లింగ నిర్ధారణ పరీక్షలు జరుపుతున్నట్లు ఆధారాల తో  సమాచారం అందించే వారికి 5 వేల రూపాయలు నగదు బహుమతి అందజేయడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ ఎ. సూర్య కుమారి ఒక ప్రకటనలో తెలిపారు.  ఇటీవల జిల్లాలో  జన్మిస్తున్న ఆడపిల్లల సంఖ్య మగ పిల్లల సంఖ్య కన్నా తగ్గడం జరుగుతోందని, ఆడపిల్లలగా గుర్తించిన వెంటనే గర్భ శ్రావాలు జరుగుతున్న ట్లు అనుమానంగా ఉందని తెలిపారు. అందువలన లింగ నిర్ధారణ పరీక్షల పై గట్టి నిఘా ను ఏర్పాటు చేయాలని వైద్య శాఖ అధికారులకు ఆదేశించడం జరిగిందని తెలిపారు.

Cash prize for those who provide information that gender determination tests are being conducted, District Collector Surya Kumari