News
30.10.2025 వర్షాలప్రభావాన్ని పరిశీలించిన జిల్లా కలెక్టర్ రాంసుందర్ రెడ్డి
Published on: 31/10/2025పత్రికా ప్రకటన వర్షాల ప్రభావాన్ని పరిశీలించిన జిల్లా కలెక్టర్ రాంసుందర్ రెడ్డి రేగిడి ఆమదాలవలస, (విజయనగరం) అక్టోబర్ 30 : మొంథా తుఫాను కారణంగా కురిసిన భారీ వర్షాల ప్రభావాన్ని జిల్లా కలెక్టర్ ఎస్. రాంసుందర్ రెడ్డి గురువారం పరిశీలించారు. ఆయన గురువారం రాజాం నియోజకవర్గంలో సుడిగాలి పర్యటన జరిపారు. రహదారులను, పంట పొలాలను, నీటి ప్రవాహాలను పరిశీలించారు. రేగిడి ఆమదాలవలస మండలం సంకిలి బ్రిడ్జి వద్ద ఉధృతంగా ప్రవహిస్తున్న నాగావళి నదిని పరిశీలించారు. నది ప్రవాహం, దిగువనున్న ప్రాంతాలు, పంట పొలాల పరిస్థితిని […]
30.10.2025 జలాశయాల్లో నీటి స్థాయిలు సాధారణ స్థితికి వచ్చే వరకూ జాగ్రత్త వహించాలి, టెలికాన్ఫరెన్స్ లో స్పష్టం చేసిన జిల్లా కలెక్టర్ ఎస్. రాంసుందర్ రెడ్డి
Published on: 31/10/2025పత్రికా ప్రకటన జలాశయాల్లో నీటి స్థాయిలు సాధారణ స్థితికి వచ్చే వరకూ జాగ్రత్త వహించాలి ప్రతి నష్టాన్ని నమోదు చేయాలి ప్రభుత్వ భవనాల నష్టాలను అంచనా వేయాలి వరద బాధితులకు రేషన్, నిత్యావసరాల పంపిణీ వెంటనే జరగాలి టెలికాన్ఫరెన్స్ లో స్పష్టం చేసిన జిల్లా కలెక్టర్ ఎస్. రాంసుందర్ రెడ్డి విజయనగరం, అక్టోబర్ 30 : జిల్లాలోని జలాశయాలన్నిటి లో ఇన్ఫ్లో , అవుట్ ఫ్లో లను పరిశీలిస్తూ ఎక్కడా ఎటువంటి నష్టాలూ జరగకుండా చూడాలని […]
29-10-2025-జిల్లా కలెక్టర్ ను, యంత్రాంగాన్ని అభినందించిన ముఖ్యమంత్రి
Published on: 30/10/2025పత్రికా ప్రకటన *జిల్లా కలెక్టర్ ను, యంత్రాంగాన్ని అభినందించిన ముఖ్యమంత్రి* విజయనగరం, అక్టోబర్ 29: మొంథా తుఫాన్ సమయంలో నిర్విరామంగా కృషి చేసి ఎటువంటి ప్రాణ నష్టం జరగకుండా సేవలు అందించినందుకు, సమయస్ఫూర్తితో, సమన్వయం, మానవతా దృక్పథంతో వ్యవహరించిన జిల్లా కలెక్టర్ ఎస్. రాంసుందర్ రెడ్డి ని, జిల్లా యంత్రాంగాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రత్యేకంగా అభినందించారు. తుఫాన్ సమయంలో జిల్లా యంత్రాంగం ప్రాణ నష్టం లేకుండా చర్యలు తీసుకోవడం, ముందు జాగ్రత్త చర్యలు […]
29-10-2025-తుఫానును ఎదుర్కొనడంలో ప్రభుత్వ ముందుచూపు భేష్ జిల్లా కలెక్టర్ పనితీరు అభినందనీయం అన్ని శాఖలు సమన్వయంతో పనిచేశాయి రాష్ట్రమంత్రి కొండపల్లి శ్రీనివాస్ గజపతినగరంలో విస్తృత పర్యటన
Published on: 30/10/2025పత్రికా ప్రకటన తుఫానును ఎదుర్కొనడంలో ప్రభుత్వ ముందుచూపు భేష్ జిల్లా కలెక్టర్ పనితీరు అభినందనీయం అన్ని శాఖలు సమన్వయంతో పనిచేశాయి రాష్ట్రమంత్రి కొండపల్లి శ్రీనివాస్ గజపతినగరంలో విస్తృత పర్యటన విజయనగరం, అక్టోబరు 29 ః మోంథా తుఫానును ఎదుర్కొనడంలో ప్రభుత్వం అనుసరించిన ముందుచూపు అభినందనీయమని రాష్ట్ర ఎంఎస్ఎంఈ, సెర్ప్, ఎన్నారై సాధికారత సంబంధాల శాఖామంత్రి కొండపల్లి శ్రీనివాస్ అన్నారు. జిల్లాలో తుఫాను కారణంగా ఎటువంటి ప్రాణ, ఆస్తి నష్టాలు […]
29.10.2025 *శుద్ధ జలము సరఫరా చేయండి**అంటువ్యాధులు రాకుండా చర్యలు తీసుకోండి* జిల్లా కలెక్టర్ ఎస్ రాంసుందర్ రెడ్డి
Published on: 30/10/2025పత్రికా ప్రకటన-3 *శుద్ధ జలము సరఫరా చేయండి* *అంటువ్యాధులు రాకుండా చర్యలు తీసుకోండి* -జిల్లా కలెక్టర్ ఎస్ రాంసుందర్ రెడ్డి విజయనగరం/తెర్లాం, అక్టోబర్ 29: జిల్లాలో వరద ప్రభావిత ప్రాంతాల పరిశీలనలో భాగంగా బుధవారం తెర్లాం మండలంలోని గంగన్నపాడు గ్రామాన్ని జిల్లా కలెక్టర్ శ్రీ ఎస్. రాంసుందర్ రెడ్డి ప్రత్యక్షంగా పరిశీలించారు. ఆ గ్రామం లో నర్సిపల్లి వారి బంధ చెరువు ఓవర్ ఫ్లో కావడంతో గ్రామంలోని ప్రధాన వీధుల్లో నీటి ప్రవాహం కొనసాగుటుండటం గమనించిన కలెక్టర్ […]
29.10.2025 తుఫాన్ నష్టాలను తక్షణమే పంపాలి, మత్స్యకారులకు ప్రభుత్వం ప్రకటించిన సహాయం వెంటనే అందజేయాలి, తుఫాన్ లో సమర్ధవంతంగా పని చేసిన అధికారులకు, సచివాలయ సిబ్బందికి అభినందనలు తెలిపిన కలెక్టర్
Published on: 30/10/2025పత్రికా ప్రకటన-2 తుఫాన్ నష్టాలను తక్షణమే పంపాలి మత్స్యకారులకు ప్రభుత్వం ప్రకటించిన సహాయం వెంటనే అందజేయాలి తుఫాన్ లో సమర్ధవంతంగా పని చేసిన అధికారులకు, సచివాలయ సిబ్బందికి అభినందనలు తెలిపిన కలెక్టర్ విజయనగరం, అక్టోబరు 29: తుఫాన్ వలన సంభవించిన నష్టాలను వెంటనే పంపాలని జిల్లా కలెక్టర్ ఎస్.రాంసుందర్ రెడ్డి అధికారులకు ఆదేశించారు. శాఖల వారీగా జరిగిన నష్టాలను తెలియజేస్తూ వాటి పునరుద్ధరణకు అయ్యే ఖర్చు అంచనాలను కూడా బుధవారం సాయంత్రం లోగానే పంపాలని తెలిపారు. […]
29.10.2025 *మానవత్వం చాటుకున్న కలెక్టర్*
Published on: 30/10/2025పత్రిక ప్రకటన *మానవత్వం చాటుకున్న కలెక్టర్* విజయనగరం, అక్టోబర్ 29: జిల్లా కలెక్టర్ ఎస్. రాంసుందర్ రెడ్డి తుఫాన్ ప్రభావిత మండలాల పర్యటనకు బయలుదేరిన సందర్భంగా గజపతినగరం సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగినట్లు గమనించారు. వెంటనే తన వాహనాన్ని ఆపించి, స్వయంగా దిగి, గాయపడిన వ్యక్తుల వద్దకు చేరుకున్నారు. బాధితుల స్థితిని తెలుసుకుని, అంబులెన్స్‌ను ఏర్పాటు చేయించి తక్షణం ఆసుపత్రికి తరలించారు. ఎక్కడైనా ప్రమాదం, అత్యవసర పరిస్థితి ఉంటే మానవతా దృష్టితో స్పందించాలని ఈ సందర్భంగా కలెక్టర్ […]
గుర్ల కేజీబివి విద్యార్ధులు క్షేమంగా ఉన్నారని జిల్లా కలెక్టర్ ఎస్.రామసుందర్ రెడ్డి తెలిపారు.
Published on: 29/10/2025విజయనగరం, అక్టోబర్ 28 : గుర్ల కేజీబివి విద్యార్ధులు క్షేమంగా ఉన్నారని జిల్లా కలెక్టర్ ఎస్.రామసుందర్ రెడ్డి తెలిపారు. కేజీబీవీలో షార్ట్ సర్క్యూట్ కారణంగా డార్మెటరీలో పరుపులు అంటుకొని వచ్చిన పొగతో ఐదుగురు విద్యార్థులు స్వల్ప అస్వస్థతకు గురి అయ్యారని తెలిపారు. వెంటనే వారిని నెల్లిమర్ల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించగా, విద్యార్థుల ఆరోగ్యం ప్రస్తుతం మెరుగుపడిందని వైద్యులు తెలిపినట్లు కలెక్టర్ ప్రకటించారు. ఈ సంఘటనపై మంత్రి […]
24 గంటలూ క్షేత్ర స్థాయిలోనే సిబ్బంది ఉండాలి జిల్లా కలెక్టర్ ఎస్.రాంసుందర్ రెడ్డి రేషన్ పంపిణీ శత శాతం పూర్తి కావాలని ఆదేశం రాత్రంతా కంట్రోల్ రూంలోనే ఉండి పరిస్థితిని సమీక్షించిన కలెక్టర్
Published on: 29/10/202524 గంటలూ క్షేత్ర స్థాయిలోనే సిబ్బంది ఉండాలి జిల్లా కలెక్టర్ ఎస్.రాంసుందర్ రెడ్డి రేషన్ పంపిణీ శత శాతం పూర్తి కావాలని ఆదేశం రాత్రంతా కంట్రోల్ రూంలోనే ఉండి పరిస్థితిని సమీక్షించిన కలెక్టర్ విజయనగరం, అక్టోబరు 28 ః రేషన్ పంపిణీ బుధవారంలోగా శతశాతం పూర్తి కావాలని జిల్లా కలెక్టర్ ఎస్.రాంసుందర్ రెడ్డి ఆదేశించారు. మోంథా తుఫాను తీరం దాటనున్న కారణంగా కలెక్టరేట్ కంట్రోల్ రూమ్ […]
తుఫాను సన్నద్ధతను మంత్రి కొండపల్లి శ్రీనివాస్ పర్యవేక్షించారు
Published on: 29/10/2025తుఫాను సన్నద్ధతను పర్యవేక్షించిన మంత్రి కొండపల్లి విజయనగరం, అక్టోబర్ 28: : మెంథా తుఫాను ను ఎదుర్కొనడానికి జిల్లా యంత్రాంగం చేసిన ఏర్పాట్లను రాష్ట్ర ఎంఎస్ఎంఈ, సెర్ప్, ఎన్నారై సాధికారత సంబంధాల శాఖా మంత్రి కొండపల్లి శ్రీనివాస్ పర్యవేక్షించారు. ఆయన మంగళవారం సాయంత్రం కలెక్టరేట్ కంట్రోల్ రూమ్ ను సందర్శించారు. ఏర్పాట్లపై సమీక్షించారు. సన్నద్ధతను జిల్లా కలెక్టర్ రాంసుందర్ రెడ్డి మంత్రికి వివరించారు. అధికారులంతా అప్రమత్తంగా ఉండాలని మంత్రి ఆదేశించారు. ………………. జారీ ః జిల్లా సమాచార పౌర సంబంధాల శాఖాధికారి, విజయనగరం.