News
రాష్ట్రమంత్రి కొండపల్లి శ్రీనివాస్ జల్లాస్థాయి అండర్-14 అథ్లెటిక్స్ ప్రారంభం
Published on: 07/11/2025పత్రికా ప్రకటన శారీరక మానసిక ఆరోగ్యానికి క్రీడలు దోహదం రాష్ట్రమంత్రి కొండపల్లి శ్రీనివాస్ జల్లాస్థాయి అండర్-14 అథ్లెటిక్స్ ప్రారంభం బొండపల్లి (విజయనగరం), నవంబరు 06 ః శారీరక మానసిక ఆరోగ్యానికి క్రీడలు దోహదం చేస్తాయని రాష్ట్ర చిన్న, సూక్ష్మ, మధ్యతరహా పరిశ్రమలు, సెర్ప్, ఎన్నారై సాధికారతా సంబంధాల శాఖామంత్రి కొండపల్లి శ్రీనివాస్ అన్నారు. బొండపల్లి మండలంలోని జిల్లాపరిషత్ ఉన్నత పాఠశాలలో అండర్-14 అథ్లెటిక్స్ పోటీలను ఆయన గురువారం ప్రారంభించారు. విద్యార్థుల మార్చ్‌ఫాస్ట్‌ను తిలకించారు. క్రీడాజ్యోతిని ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, క్రీడలవల్ల శారీరక ధారుడ్యం ఏర్పడుతుందనని అన్నారు. […]
రైతు పక్షానే ప్రభుత్వం ఉంటుంది· యూరియా వినియోగం పై రైతుల్లో అవగాహన కలిగించాలి–మంత్రి కొండపల్లి·
Published on: 07/11/2025రైతు పక్షానే ప్రభుత్వం ఉంటుంది· యూరియా వినియోగం పై రైతుల్లో అవగాహన కలిగించాలి–మంత్రి కొండపల్లి· వైద్య కళాశాలల విషయం లో పిపి మోడల్ తో ప్రయోజనం-మంత్రి గుమ్మిడి సంద్యారాణి· 35 శాతం లోపల జరిగిన పంట నష్టాన్ని కూడా పరిగణన లోకి తీసుకోవాలి-జిల్లా పరిషత్ చైర్మన్ మజ్జిశ్రీనివాస రావు· జిల్లా పరిషత్ సర్వ సభ్య సమావేశం లో మెడికల్ కళాశాల ,పంట నష్ట రైతు పక్షానే ప్రభుత్వం ఉంటుంది యూరియా వినియోగం పై రైతుల్లో అవగాహన కలిగించాలి –మంత్రి కొండపల్లి వైద్య కళాశాలల విషయం లో […]
05.11.2025 రెవిన్యూ సేవల కోసం అందిన వినతులు పెండింగ్ ఉంటె సహించేది లేదు • రీ సర్వే లో తప్పులు లేకుండా చూడాలి • ప్రైవేటు దేవాలయాల్లో సి సి కెమెరాలను ఏర్పాటు చేయాలి • రెవిన్యూ అధికారుల సమావేశం లో స్పష్టం చేసిన జిల్లా కలెక్టర్ ఎస్. రాంసుందర్ రెడ్డి
Published on: 06/11/2025పత్రికా ప్రకటన-5 రెవిన్యూ సేవల కోసం అందిన వినతులు పెండింగ్ ఉంటె సహించేది లేదు రీ సర్వే లో తప్పులు లేకుండా చూడాలి ప్రైవేటు దేవాలయాల్లో సి సి కెమెరాలను ఏర్పాటు చేయాలి రెవిన్యూ అధికారుల సమావేశం లో స్పష్టం చేసిన జిల్లా కలెక్టర్ ఎస్. రాంసుందర్ రెడ్డి విజయనగరం, నవంబర్ 05 : రెవిన్యూ సేవల కోసం అందిన దరఖాస్తులను గడువు లోగా పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ ఎస్. రాంసుందర్ రెడ్డి తెలిపారు. ఇళ్ళ స్థలాలు, ఓ.బి.సి సర్టిఫికేట్ , ఇంటిగ్రేటెడ్ సర్టిఫికెట్స్, మ్యుటేషన్ తదితర […]
05.11.2025 పోషకాహారాన్ని సకాలంలో అందించాలి, జాయింట్ కలెక్టర్ ఎస్.సేధు మాధవన్
Published on: 06/11/2025పత్రికా ప్రకటన-3 పోషకాహారాన్ని సకాలంలో అందించాలి జాయింట్ కలెక్టర్ ఎస్.సేధు మాధవన్ విజయనగరం, నవంబరు 05 ః గర్భిణులు, బాలింతలకు పోషకాహారాన్నిసకాలంలో అందించాలని జాయింట్ కలెక్టర్ ఎస్.సేధు మాధవన్ ఆదేశించారు. జిల్లా స్థాయి ఎస్ఎన్‌పి (సప్లిమెంటరీ న్యూట్రిషన్ ప్రోగ్రాం) సమావేశం జెసి ఛాంబర్‌లో బుధవారం జరిగింది. ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్, కమిటీ చైర్మన్ జెసి మాట్లాడుతూ, అంగన్‌వాడీ కేంద్రాలకు సక్రమంగా సరుకులను అందించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అలాగే పౌర సరఫరాల సంస్థ ద్వారా అందిస్తున్న బియ్యం, పప్పు, నూనె సరఫరాలో ఎటువంటి జాప్యం లేకుండా […]
05.110.2025 ప్రభుత్వ సేవలు సత్వరమే అందాలి, జిల్లా కలెక్టర్ ఎస్.రాంసుందర్ రెడ్డి
Published on: 06/11/2025పత్రికా ప్రకటన-2 ప్రభుత్వ సేవలు సత్వరమే అందాలి జిల్లా కలెక్టర్ ఎస్.రాంసుందర్ రెడ్డి పూసపాటిరేగ, డెంకాడ,(విజయనగరం), నవంబరు 05 ః ప్రజలకు ప్రభుత్వ సేవలను తక్షణమే అందించాలని జిల్లా కలెక్టర్ ఎస్.రాంసుందర్ రెడ్డి ఆదేశించారు. ఆయన బుధవారం డెంకాడ, పూసపాటిరేగ మండలాల్లో ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. ముందుగా డెంకాడ తాహసీల్దార్ కార్యాలయాన్ని సందర్శించారు. రాష్ట్రప్రభుత్వం ఆన్‌లైన్ ద్వారా అందిస్తున్న సేవలపై తహసీల్దార్ రాజారావును ఆరా తీశారు. ధరఖాస్తులను ఎప్పటికప్పుడు పరిష్కరిస్తూ, పెండింగ్ లేకుండా చూడాలని ఆదేశించారు. నిర్ణీత కాలవ్యవధిలోగా పరిష్కారం చూపాలని సూచించారు. పూసపాటిరేగ […]
దేశం గర్వించే స్థాయిలో భోగాపురం విమానాశ్రయం : కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు
Published on: 05/11/2025*దేశం గర్వించే స్థాయిలో భోగాపురం విమానాశ్రయం : కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు* నవంబర్ 04 : ప్రపంచాన్ని గెలిచే శక్తి ఉత్తరాంధ్రకు ఉందని.. అందుకు వనరుగా భోగాపురం విమానాశ్రయం ఉపయోగపడాలని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు పిలుపునిచ్చారు. మంగళవారం నాడు భోగాపురం విమానాశ్రయ పనుల పురోగతిని జిల్లా కలెక్టర్ ఎస్. రాంసుందర్ రెడ్డి, ఎస్పీ ఎ. ఆర్. దామోదర్ స్థానిక ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు, ఎమ్మెల్యే లోకం మాధవి, మార్క్ […]
03.11.2025 సమిష్టి కృషితో సత్ఫలితాలు, జిల్లా కలెక్టర్ రాంసుందర్ రెడ్డికలెక్టర్, జేసీలను సన్మానించిన జిల్లా అధికారులు
Published on: 05/11/2025పత్రికా ప్రకటన-2 సమిష్టి కృషితో సత్ఫలితాలు జిల్లా కలెక్టర్ రాంసుందర్ రెడ్డి కలెక్టర్, జేసీలను సన్మానించిన జిల్లా అధికారులు విజయనగరం, నవంబర్ 03 : సమన్వయంతో, సమిష్టిగా కృషి చేసినప్పుడే సత్ఫలితాలను సాధించవచ్చని జిల్లా కలెక్టర్ ఎస్.రాంసుందర్ రెడ్డి స్పష్టం చేశారు. మోంథా తుఫానును ఎదుర్కోవడంలో జిల్లా యంత్రాంగాన్ని సమర్థంగా నడిపించి, అన్ని రకాల ముందుజాగ్రత్త చర్యలను చేపట్టి నష్టాన్ని గణనీయంగా నివారించిన జిల్లా కలెక్టర్ రాంసుందర్ రెడ్డి రాష్ట్ర ముఖ్యమంత్రి నుంచి ప్రత్యేకంగా అభినందనలు అందుకున్న విషయం తెలిసిందే. ఈ నేపధ్యంలో జిల్లా […]
02. 11.2025 నేడు కలెక్టరేట్ లో ప్రజా సమస్యల పరిష్కార వేదిక* *మీ కోసం కాల్ సెంటర్ 1100 సేవలను వినియోగించుకోవాలి *జిల్లా కలెక్టర్ ఎస్. రాంసుందర్ రెడ్డి
Published on: 03/11/2025పత్రికా ప్రకటన *నేడు కలెక్టరేట్ లో ప్రజా సమస్యల పరిష్కార వేదిక* *మీ కోసం కాల్ సెంటర్ 1100 సేవలను వినియోగించుకోవాలి *జిల్లా కలెక్టర్ ఎస్. రాంసుందర్ రెడ్డి విజయనగరం, నవంబర్ 02:- సోమవారం ఉదయం కలెక్టరేట్ ఆడిటోరియంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పబ్లిక్ గ్రీవెన్స్ రిడ్రసెల్ సిస్టం – పిజిఆర్ఎస్) కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ ఎస్. రాంసుందర్ రెడ్డి తెలిపారు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు కార్యక్రమం […]
01.11.2025 నవంబర్ 17 నుండి 30 వరకు కుష్టు వ్యాధిగ్రస్తుల గుర్తింపు ప్రత్యేక డ్రైవ్, సామాజిక భయం విడనాడండి – కుష్టు వ్యాధిని తరిమికొట్టండి — జిల్లా కలెక్టర్ ఎస్ రాంసుందర్ రెడ్డి
Published on: 03/11/2025పత్రికా ప్రకటన-3 నవంబర్ 17 నుండి 30 వరకు కుష్టు వ్యాధిగ్రస్తుల గుర్తింపు ప్రత్యేక డ్రైవ్ సామాజిక భయం విడనాడండి – కుష్టు వ్యాధిని తరిమికొట్టండి — జిల్లా కలెక్టర్ ఎస్ రాంసుందర్ రెడ్డి విజయనగరం, నవంబర్ 01: కుష్టు వ్యాధి పూర్తిగా నయం చేయగల వ్యాధి అని, కుష్టు వ్యాధి సోకిన వారిని సమాజం చిన్న చూపు చూస్తుందన్న అపోహను విడనాడితే సమాజం నుండి కుష్టు వ్యాధిని పూర్తిగా నిర్మూలించవచ్చని కలెక్టర్ జిల్లా కలెక్టర్ మరియు జిల్లా కుష్టు వ్యాధి నిర్మూలన సమన్వయ కమిటీ చైర్మన్ ఎస్. రాంసుందర్ […]
30.10.2025 భూసేకరణకుసంబంధించిన పనులన్నీ వేగవంతం కావాలి, జిల్లా కలెక్టర్ ఎస్.రాంసుందర్ రెడ్డి
Published on: 31/10/2025పత్రికా ప్రకటన-4 భూసేకరణకు సంబంధించిన పనులన్నీ వేగవంతం కావాలి జిల్లా కలెక్టర్ ఎస్.రాంసుందర్ రెడ్డి విజయనగరం, అక్టోబరు 30: జిల్లాలో పలు ప్రోజెక్టుల కోసం చేపడుతున్న భూసేకరణ కు సంబంధించిన అవార్డ్ పాస్ చేయడం, సంబంధిత అధికారులకు లేఖలు రాయడం, ఇతర ప్రాసెస్సింగ్ వేగవంతం కావాలని జిల్లా కలెక్టర్ ఎస్.రాంసుందర్ రెడ్డి తెలిపారు. గురువారం ముగ్గురు ఆర్.డి.ఓ లతో కలెక్టర్ తన ఛాంబర్లో భూసేకరణ పై సమీక్షించారు. జాతీయ రహదారుల, భోగాపురం ఎయిర్పోర్ట్, ట్రైబల్ యూనివర్సిటీ, రెల్లి వద్ద గ్రేహౌండ్స్ కి కేటాయించిన భూమి, ఎం.ఎస్.ఎం.ఈ ల కోసం భూసేకరణ, మురునీరు […]