News

Filter by:
No Image

రైతు ఉత్పత్తులకు మార్కెట్ సౌకర్యం కలిగించాలి • ఉద్యాన పంటల పై దృష్టి పెట్టాలి • గంట్యాడ, బొండపల్లి మండలాల్లో క్షేత్ర స్థాయి పర్యటనలు చేసిన కలెక్టర్

Published on: 15/11/2025

రైతు ఉత్పత్తులకు మార్కెట్ సౌకర్యం కలిగించాలి ఉద్యాన పంటల  పై దృష్టి పెట్టాలి గంట్యాడ, బొండపల్లి మండలాల్లో క్షేత్ర స్థాయి పర్యటనలు చేసిన కలెక్టర్ విజయనగరం, నవంబర్ 14 :   రైతులు పండించే పంటకు మార్కెట్ సౌకర్యం లేకుంటే  రైతు ఇబ్బంది పడతారని,  పంటను విక్రయించుకునే  వెసలుబాటు కల్పించాలని వ్యవసాయ అధికారులకు కలెక్టర్ సూచించారు.  శుక్రవారం కలెక్టర్ గంట్యాడ, బొండపల్లి మండలాల్లో పలు గ్రామాల్లో పర్యటించి  మామిడి, టమాట,  రైతులు  పండిస్తున్న ప్రకృతి వ్యవసాయాన్ని, ఉద్యాన పంటలను సందర్శించారు.  కోటారుబిల్లి గ్రామం లో ఈ పంట సూపర్ చెక్ లో […]

No Image

13.12.2025 తేదీన జరగబోయే జాతీయ లోక్ అదాలత్ ను వినియోగించుకోవాలని పిలుపునిచ్చిన జిల్లా ప్రధాన న్యాయమూర్తి

Published on: 13/11/2025

13.12.2025 తేదీన జరగబోయే జాతీయ లోక్ అదాలత్ ను వినియోగించుకోవాలని   పిలుపునిచ్చిన జిల్లా ప్రధాన న్యాయమూర్తి *  విజయనగరం జిల్లా ప్రధాన న్యాయమూర్తి గారు గౌరవనీయులు శ్రీమతి ఎం భ బి త గారు అధ్యక్షతన సీనియర్ సివిల్ జడ్జ్ మరియు జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ కార్యదర్శి శ్రీ ఏ కృష్ణ ప్రసాద్ గారు యొక్క ఆధ్వర్యంలో  తేదీ 13.12.2025 న జరగబోయే జాతీయ లోక్ అదాలత్ కు సంబంధించి విజయనగరం జిల్లా  మరియు […]

No Image

పత్తి రైతులు కోనుగోలు కేంద్రాలోనే విక్రయించాలి జిల్లాలోపత్తి రైతు కొనుగోలు కేంద్రం ప్రారంభం జిల్లాకలెక్టర్ ఎస్.రాంసుందర్ రెడ్డి

Published on: 13/11/2025

 పత్తి  రైతులు కోనుగోలు కేంద్రాలోనే విక్రయించాలి  జిల్లాలో పత్తి రైతు కొనుగోలు కేంద్రం ప్రారంభం  జిల్లా కలెక్టర్ ఎస్.రాంసుందర్ రెడ్డి విజయనగరం, నవంబర్ 12: జిల్లా పత్తి రైతుల సంక్షేమం కోసం ప్రభుత్వం పత్తి కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసిందని జిల్లా కలెక్టర్ ఒక ప్రకటనలో తెలిపారు. రైతులంతా ఈ కొనుగోలు కేంద్రం లొనే వారి పంటను విక్రయించాలని, దళారీలను, మధ్యవర్తుల ను నమ్మవద్దని తెలిపారు.  రాజాం వ్యవసాయ మార్కెట్ కమిటీ పరిధిలో పత్తి కొనుగోలు కేంద్రాన్ని  శాసన సభ్యులు మరియు  అధ్యక్షులు, వ్యవసాయ మార్కెట్ […]

No Image

పేదల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం *బొండపల్లి మండలం గ్రామంలో జరిగిన గృహప్రవేశాలలో పాల్గొన్న మంత్రి కొండపల్లి

Published on: 13/11/2025

పేదల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం *బొండపల్లి మండలం గ్రామంలో జరిగిన గృహప్రవేశాలలో పాల్గొన్న మంత్రి కొండపల్లి విజయనగరం, నవంబర్ 12:  : పేదల సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వం పని చేస్తోందని రాష్ట్ర సూక్ష్మ మధ్య తరహా పరిశ్రమల, సెర్ప్  శాఖల మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు . పేదల అభివృద్ధికి ప్రభుత్వం అంకిత భావంతో, చిత్తశుద్ధితో పనిచేస్తూ ప్రతి సమస్య పట్ల స్పందిస్తోందని పేర్కొన్నారు.   రాష్ట్రవ్యాప్తంగా బుధవారం జరిగిన మూడు లక్షల గృహప్రవేశాలలో భాగంగా విజయనగరం జిల్లాలో 8793 గృహాలకు గృహప్రవేశాలు నియోజకవర్గం వారీగా జరిగాయి. ఇందులో […]

No Image

11.11.2025-పెట్టుబడులకు ఆకర్షితులు కావడం కాదు- పెట్టుబడులు పెట్టే స్థాయికి ఎదగాలి

Published on: 12/11/2025

పత్రికా ప్రకటన పెట్టుబడులకు ఆకర్షితులు కావడం కాదు- పెట్టుబడులు పెట్టే స్థాయికి ఎదగాలి వర్చువల్ గా కంప్రెస్డ్ బయోగ్యాస్ ప్లాంట్ కి శంకుస్థాపన చేసిన ముఖ్యమంత్రి విజయనగరం, నవంబర్ 11:  పెట్టుబడులకు ఆకర్షితులు కావడమే కాక పెట్టుబడులు పెట్టే స్థాయికి యువత ఎదగాలని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారు. మంగళవారం ప్రకాశం జిల్లా కనిగిరి నుండి వర్చువల్ గా రాష్ట్రంలో అనేక కార్యక్రమాలకు శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు ముఖ్యమంత్రి చేశారు. విజయనగరం జిల్లా వంగర మండలం అరసాడలో 102 కోట్ల రూపాయల పెట్టుబడితో […]

No Image

దివ్యాంగ విద్యార్థులకు అవసరమైన ఉపకరణములను పంపిణీ

Published on: 11/11/2025

విజయనగరం జిల్లాలో ప్రభుత్వ పాఠశాలలో 1 వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు చదువుతున్న (0-18) సంవత్సరాల మధ్య  వయసు గల  దివ్యాంగ విద్యార్థులకు అవసరమైన ఉపకరణములను పంపిణీ చేయుటకు అర్హులైన విద్యార్థులను గుర్తించు నిమిత్తం నియోజకవర్గ స్థాయిలో వైద్య శిబిరాలు క్రింది పేర్కొన్న తేదీలలోనిర్వహించబడనున్నాయి. వరుస సంఖ్య అసెంబ్లీ  నియోజక వర్గం పేరు వైద్యశిభిరం నిర్వహించనున్న స్థలంపేరు అసెంబ్లీ  నియోజక వర్గం లో వుండే మండలాల పేర్లు వైద్య శిభిరం నిర్వహించనున్న తేది 1 గజపతినగరం గజపతినగరం గజపతినగరం 10.11.2025 దత్తిరాజేరు […]

No Image

ఉపాధ్యాయుడిగా అవ‌తార‌మెత్తిన క‌లెక్ట‌ర్‌, విద్యార్ధుల‌తో క‌లిసి స‌హ‌పంక్తి భోజ‌నం

Published on: 11/11/2025

ఉపాధ్యాయుడిగా అవ‌తార‌మెత్తిన క‌లెక్ట‌ర్‌ విద్యార్ధుల‌తో క‌లిసి స‌హ‌పంక్తి భోజ‌నం గంట్యాడ‌, (విజ‌య‌న‌గ‌రం), న‌వంబ‌రు 07 ః      ఆయ‌న జిల్లాకు స‌ర్వోన్న‌తాధికారి. మొత్తం యంత్రాంగాన్ని శాసించే అత్యుత్త‌మ‌ ఉన్న‌తాధికారి. అయిన‌ప్ప‌టికీ ఒక సామాన్య వ్య‌క్తిలా విద్యార్ధుల‌తోబాటు  క్యూలో నిల్చొని భోజ‌నం ప‌ట్టుకున్నారు. వారితో క‌లిసి నేల‌పైనే కూర్చొని భోజ‌నం చేశారు. ఆయ‌నే జిల్లా క‌లెక్ట‌ర్ ఎస్‌.రాంసుంద‌ర్ రెడ్డి. ఈ అరుదైన సంఘ‌ట‌న శుక్ర‌వారం చోటుచేసుకుంది.                జిల్లా క‌లెక్ట‌ర్ రాంసుంద‌ర్ రెడ్డి శుక్ర‌వారం గంట్యాడ మండ‌లంలో ఆక‌స్మికంగా ప‌ర్య‌టించారు. జిల్లా ప‌రిష‌త్ ఉన్న‌త […]

No Image

జిల్లా వ్యాప్తంగా జాతీయ క్యాన్సర్ అవగాహన దినోత్సవర్యాలీలు నిర్వహణ, ప్రజల ఆరోగ్యంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి- జిల్లాకలక్టరు జిల్లా కలక్టరు ఎస్ రాంసుందర్ రెడ్డి

Published on: 11/11/2025

జిల్లా వ్యాప్తంగా జాతీయ క్యాన్సర్ అవగాహన దినోత్సవ ర్యాలీలు నిర్వహణ ప్రజల ఆరోగ్యంపై రాష్ట్ర  ప్రభుత్వం ప్రత్యేక దృష్టి –          జిల్లా కలక్టరు జిల్లా కలక్టరు ఎస్ రాంసుందర్ రెడ్డి విజయనగరం, నవంబరు, 07:  జాతీయ క్యాన్సర్ అవగాహన దినోత్సవం సందర్భంగా  ప్రతి మండల స్థాయిలో మరియు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం స్థాయిలో గ్రామస్థాయిలో  జిల్లా వ్యాప్తంగా గురువారం నాడు  ప్రజలను అవగాహన కల్పించుటకు ర్యాలీలు మీటింగులు పెద్ద ఎత్తున నిర్వహించడం జరిగినదని జిల్లా కలక్టరు జిల్లా కలక్టరు ఎస్ రాంసుందర్ […]

No Image

సఫాయి కర్మచారి యువతకు ఋణావకాశం

Published on: 11/11/2025

ఫాయి కర్మచారి  యువతకు  ఋణావకాశం విజయనగరం  జిల్లాలోని  సఫాయి కర్మచారి వృత్తిలో వున్న నిరుద్యోగ యువతకు NSKFDC పదకములో సెప్టిక్ ట్యాంక్ క్లీనింగ్ (Desludging Vehicles) వాహనములను సబ్సిడీ పై మంజూరు చేయుటకు దరఖాస్తులను కోరడమైనది. NSKFDC పదకములోది.29-11-2023 న, వైస్ చైర్మన్ మరియు మేనేజింగ్ డైరెక్టర్, ఆంధ్రప్రదేశ్ షెడ్యూల్డు కులముల సహకార ఆర్ధిక సంస్థ, తాడేపల్లి, అమరావతి వారు విజయనగరం  జిల్లాకు మంజూరు చేసిన 3000 లీటర్ల సామర్ధ్యం గల సెప్టిక్ ట్యాంక్ క్లీనింగ్ (Desludging Vehicles) వాహనముల లబ్దిదారులలో ఋణమును చెల్లించుటలో  విఫలమైన లబ్దిదారులకు చెందిన మూడు (3) సెప్టిక్ ట్యాంక్ క్లీనింగ్ (Desludging […]

No Image

మండ‌లానికి వెయ్యిమందికి తక్కువ కాకుండా ఉపాధి ప‌ని, జిల్లా క‌లెక్ట‌ర్ ఎస్‌.రాంసుంద‌ర్ రెడ్డి

Published on: 11/11/2025

మండ‌లానికి వెయ్యిమందికి తక్కువ కాకుండా ఉపాధి ప‌ని జిల్లా క‌లెక్ట‌ర్ ఎస్‌.రాంసుంద‌ర్ రెడ్డి విజ‌య‌న‌గ‌రం, న‌వంబ‌రు 07 ః  ప్ర‌తిరోజూ మండ‌లంలో క‌నీసం వెయ్యిమందికి త‌క్కువ కాకుండా ఉపాధిప‌నుల‌ను క‌ల్పించాల‌ని జిల్లా క‌లెక్ట‌ర్ ఎస్‌.రాంసుంద‌ర్ రెడ్డి అధికారుల‌ను ఆదేశించారు. మ‌హాత్మా గాంధీ గ్రామీణ ఉపాధిహామీ ప‌థ‌కం అమ‌లుపై శుక్ర‌వారం టెలీకాన్ఫ‌రెన్స్ ద్వారా సంబంధిత అధికారుల‌తో స‌మీక్షించారు. ప‌నుల పుర‌రోగ‌తిని తెలుసుకున్నారు.                  ఈ సమావేశ‌మంలో క‌లెక్ట‌ర్ మాట్లాడుతూ, ఉపాధిహామీ ప‌నుల వేగాన్ని పెంచాల‌ని, ప‌నిలో పాల్గొనే వేత‌న‌దారుల‌ను సంఖ్య‌ను గ‌ణ‌నీయంగా పెంచాల్సి ఉంద‌ని చెప్పారు. […]