News

Filter by:
No Image

21.11.2025 *అనాథ బాలలకు భవిష్యత్తు నిర్మిద్దాం.*బాల్య వివాహాలు అరికట్టాలి.*భేటీ బచావో భేటీ పడావో నినాదం ప్రచారం చేయాలి.మిషన్ వాత్సల్య కమిటీ సమావేశంలో జిల్లా కలెక్టర్ఎస్.రాంసుందర్ రెడ్డి

Published on: 22/11/2025

పత్రికా ప్రకటన-7 *అనాథ బాలలకు భవిష్యత్తు నిర్మిద్దాం. *బాల్య వివాహాలు అరికట్టాలి. *భేటీ బచావో భేటీ పడావో నినాదం ప్రచారం చేయాలి. మిషన్ వాత్సల్య కమిటీ సమావేశంలో జిల్లా కలెక్టర్ ఎస్.రాంసుందర్ రెడ్డి. విజయనగరం అక్టోబర్ 22 : అనాథ బాలల సంరక్షణ కోసం గ్రామస్థాయి కమిటీలు చిత్తశుద్ధితో పనిచేయాలని కలెక్టర్ ఎస్.రాంసుందర్ రెడ్డి అధికారులను ఆదేశించారు. అనాథ బాలల సంక్షేమం పరిరక్షణ కోసం కేంద్ర ప్రభుత్వ మిషన్ వాత్సల్య కార్యక్రమం కింద జిల్లా కమిటీ సమావేశం కలెక్టరేట్ లో […]

No Image

21.11.2025 మాతృ, శిశు మ‌ర‌ణాల‌ ప‌ట్ల క‌లెక్ట‌ర్‌ ఆగ్ర‌హం నివార‌ణ‌కు ప్ర‌జ‌ల్లో అవ‌గాహ‌న క‌ల్పించాలని ఆదేశం

Published on: 22/11/2025

ప‌త్రికా ప్ర‌క‌ట‌న‌-5 మాతృ, శిశు మ‌ర‌ణాల‌ ప‌ట్ల క‌లెక్ట‌ర్‌ ఆగ్ర‌హం నివార‌ణ‌కు ప్ర‌జ‌ల్లో అవ‌గాహ‌న క‌ల్పించాలని ఆదేశం విజ‌య‌న‌గ‌రం, న‌వంబ‌రు 21 ః      జిల్లాలో మాతృ, శిశు మ‌ర‌ణాలు సంభ‌వించ‌డం ప‌ట్ల వైద్యారోగ్య‌శాఖ‌పై జిల్లా క‌లెక్ట‌ర్ ఎస్.రాంసుంద‌ర్ రెడ్డి ఆగ్ర‌హాన్ని వ్య‌క్తం చేశారు. మ‌ర‌ణాలు చోటుచేసుకుంటుంటే క్షేత్ర‌స్థాయిలోని ప్ర‌భుత్వ యంత్రాంగం ఏంచేస్తోంద‌ని ప్ర‌శ్నించారు. పేద ప్ర‌జ‌ల ప్రాణాల ర‌క్ష‌ణకోస‌మే ఈ యంత్రాంగం ఉంద‌ని, సిబ్బంది నిర్ల‌క్ష్యాన్ని ప్ర‌ద‌ర్శిస్తే స‌హించేది లేద‌ని హెచ్చ‌రించారు.                  డిస్ట్రిక్ట్‌ మెట‌ర్న‌ల్‌, చైల్డ్ డెత్ స‌ర్వైలెన్స్ రెస్పాన్స్ క‌మిటీ (ఎంపిసిడిఎస్ఆర్‌) స‌మీక్షా స‌మావేశం […]

No Image

21.11.2025 పక్షి ప్రమాద రహితంగా భోగాపురం విమానాశ్రయం 👉జిల్లా కలెక్టర్ రాంసుందర్ రెడ్డి

Published on: 22/11/2025

పత్రికా ప్రకటన-2 పక్షి ప్రమాద రహితంగా భోగాపురం విమానాశ్రయం జిల్లా కలెక్టర్  రాంసుందర్ రెడ్డి విజయనగరం, నవంబర్ 21 :   భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయాన్ని పక్షి ప్రమాద రహితంగా తీర్చిదిద్దాలని జిల్లా కలెక్టర్ ఎస్ రాంసుందర్ రెడ్డి ఆదేశించారు. మొట్టమొదటి ఏరోడ్రోమ్ ఎన్విరాన్‌మెంట్ మేనేజ్‌మెంట్ కమిటీ (AEMC) సమావేశం కలెక్టర్ ఛాంబర్ లో జిల్లా కలెక్టర్ అధ్యక్షతన శుక్రవారం జరిగింది. ప్రకృతికి అనుకూలంగా సురక్షితమైన, సుస్థిరమైన విమానాశ్రయ వాతావరణాన్ని కల్పించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. అంతర్జాతీయ విమానయాన భద్రతా ప్రమాణాలకు అనుగుణంగా, విమానాశ్రయం చుట్టూ పది […]

No Image

21.11.2025 పకడ్బందీగా ధాన్యం కొనుగోలు కొనుగోలు కేంద్రాలను తనిఖీ చేసిన జెసి సేధు మాధవన్

Published on: 22/11/2025

పత్రికా ప్రకటన పకడ్బందీగా ధాన్యం కొనుగోలు కొనుగోలు కేంద్రాలను తనిఖీ చేసిన జెసి సేధు మాధవన్ బొబ్బిలి, రామభద్రాపురం (విజయనగరం), నవంబర్ 21 :  ధాన్యం కొనుగోలు ప్రక్రియను పకడ్బందీగా నిర్వహించాలని జాయింట్ కలెక్టర్ ఎస్. సేధుమాధవన్ అధికారులను ఆదేశించారు. రైతులు ఇబ్బంది పడకుండా ప్రక్రియను నిబంధనల ప్రకారం పూర్తి చేయాలని సూచించారు. ఆయన శుక్రవారం బొబ్బిలి, రామభద్రాపురం మండలాల్లో పర్యటించారు. బొబ్బిలి మండలం మెట్టవలస, రామభద్రపురం మండలం రొంపల్లి గ్రామాల్లోని రైతు సేవా కేంద్రాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ధాన్యం కొనుగోలు ప్రక్రియను పరిశీలించారు. […]

No Image

20.11.2025-సానుభూతి కాదు…స‌హానుభూతి చూపండి ఇత‌ర వ‌ర్గాల‌తో స‌మానంగా ఎస్సీలు ఎద‌గాలి వారికి సంక్షేమ ప‌థ‌కాలు స‌క్రమంగా అందాలి రాష్ట్ర ఎస్‌సి క‌మిష‌న్ ఛైర్మ‌న్ కెఎస్ జ‌వ‌హ‌ర్‌ జిల్లాలో విస్తృత ప‌ర్య‌ట‌న‌

Published on: 21/11/2025

ప‌త్రికా ప్ర‌క‌ట‌న‌ సానుభూతి కాదు…స‌హానుభూతి చూపండి ఇత‌ర వ‌ర్గాల‌తో స‌మానంగా ఎస్సీలు ఎద‌గాలి వారికి సంక్షేమ ప‌థ‌కాలు స‌క్రమంగా అందాలి రాష్ట్ర ఎస్‌సి క‌మిష‌న్ ఛైర్మ‌న్ కెఎస్ జ‌వ‌హ‌ర్‌ జిల్లాలో విస్తృత ప‌ర్య‌ట‌న‌ విజ‌య‌న‌గ‌రం, న‌వంబ‌రు 20 ః                 ఎస్సీల‌ప‌ట్ల సానుభూతి కాకుండా, వారి బాధ‌ల‌ను మ‌న‌స్ఫూర్తిగా అర్ధం చేసుకొని స‌హానుభూతి చూపించాల‌ని రాష్ట్ర ఎస్‌సీ క‌మిష‌న్‌ ఛైర్మ‌న్ కెఎస్ జ‌వ‌హ‌ర్ కోరారు. ఇత‌ర వ‌ర్గాల‌తో స‌మానంగా ఈ 15 శాతం జ‌నాభా కూడా అభివృద్ది చెందేందుకు ప్ర‌తీఒక్క‌రూ స‌హకారం అందించాల‌ని సూచించారు. క‌మిష‌న్ […]

No Image

19.11.2025 *పట్టణం లో ఆటోమేటిక్ టెస్టింగ్ యంత్రం ఏర్పాటుచేయాలి *పట్టణాల్లో రహదారులు ఎప్పటికప్పుడు శుభ్రపరచాలి* ఎన్ సి ఎ పి ప్రమాణాలకు లోబడి కాలుష్యం ఉండాలి* ఎన్ సి ఎ పి జిల్లా కమిటీ మీటింగ్ లో కలెక్టర్ఎస్.రాంసుందర్ రెడ్డి

Published on: 21/11/2025

పత్రికాప్రకటన-6 *పట్టణం లో ఆటోమేటిక్ టెస్టింగ్ యంత్రం ఏర్పాటు చేయాలి *పట్టణాల్లో రహదారులు ఎప్పటికప్పుడు శుభ్రపరచాలి *ఎన్ సి ఎ పి ప్రమాణాలకు లోబడి కాలుష్యం ఉండాలి *ఎన్ సి ఎ పి జిల్లా కమిటీ మీటింగ్ లో కలెక్టర్ ఎస్.రాంసుందర్ రెడ్డి విజయనగరం నవంబర్ 19 : పట్టణాల్లో ఎన్ సి ఎ పి ప్రమాణాలకు లోబడి కాలుష్యం ఉండాలని జిల్లా కలెక్టర్ ఎస్.రాంసుందర్ రెడ్డి అధికారులను ఆదేశించారు. తన ఛాంబర్ లో నేషనల్ క్లీన్ ఎయిర్ ప్రోగ్రామ్ […]

No Image

19.11.2025 *రైతు సంక్షేమమే ముఖ్యమంత్రి ధ్యేయం *అధిక లాభాలు వచ్చే పంటలు పండించేందుకు రైతులు మొగ్గు చూపాలి -జిల్లా కలెక్టర్ రాంసుందర్ రెడ్డి *2.27 లక్షల రైతులకు 150 కోట్లు అన్నదాత సుఖీభవ విడుదల

Published on: 21/11/2025

పత్రికాప్రకటన-4 *రైతు సంక్షేమమే ముఖ్యమంత్రి ధ్యేయం *అధిక లాభాలు వచ్చే పంటలు పండించేందుకు రైతులు మొగ్గు చూపాలి -జిల్లా కలెక్టర్ రాంసుందర్ రెడ్డి *2.27 లక్షల రైతులకు 150 కోట్లు అన్నదాత సుఖీభవ విడుదల విజయనగరం నవంబర్ 19 : ఈ సంవత్సరం అధికవర్షాలు నమోదు కావడం వలన జిల్లా వ్యాప్తంగా వరి పంట అధికదిగుబడి సాధించామని జిల్లా కలెక్టర్ ఎస్. రాంసుందర్ రెడ్డి అన్నారు. వేపాడ తహసిల్దార్ కార్యాలయం ఆవరణలో ఏర్పాటుచేసిన అన్నదాత సుఖీభవ-పి ఏం కిసాన్ రెండవ విడత నిధులు విడుదల […]

No Image

18.11.2025- Revised పదవ తరగతిఫలితాల్లో మెరుగైన ర్యాంకులు సాధించాలి–జిల్లాకలెక్టర్ ఎస్. రాంసుందర్ రెడ్డి

Published on: 19/11/2025

పత్రిక ప్రకటన పదవ తరగతి ఫలితాల్లో  మెరుగైన ర్యాంకులు సాధించాలి –జిల్లా కలెక్టర్ ఎస్. రాంసుందర్ రెడ్డి విజయనగరం, నవంబర్ 18: పదవ తరగతి ఫలితాల్లో  జిల్లా రాష్ట్రస్థాయి ర్యాంకుల్లో ముందంజలో నిలవాలని జిల్లా కలెక్టర్ ఎస్. రాంసుందర్ రెడ్డి సూచించారు. మంగళవారం కలెక్టరేట్ ఆడిటోరియంలో జరిగిన విద్యా విభాగ సమీక్ష సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ, ప్రతి విద్యార్థి ప్రతిభను కొలిచే మొదటి ప్రమాణం వారి ర్యాంకేనని ఉపాధ్యాయులు ప్రత్యేక వ్యూహాలు రూపొందించి విద్యార్థులను మెరుగైన ఫలితాల కోసం ప్రోత్సహించాలని […]

No Image

18.11.2025-ఆదర్శ సోలార్ గ్రామం గా బొద్దాం ఆమోదం కోటిరూపాయల వ్యయం తో నెడ్కాప్ ద్వారా అభివృద్ధి – జిల్లా స్థాయి కమిటీ లో కలెక్టర్ రాంసుందర్ రెడ్డి.

Published on: 19/11/2025

పత్రికాప్రకటన ఆదర్శ సోలార్ గ్రామం గా బొద్దాం ఆమోదం కోటిరూపాయల వ్యయం తో నెడ్కాప్ ద్వారా అభివృద్ధి – జిల్లా స్థాయి కమిటీ లో కలెక్టర్ రాంసుందర్ రెడ్డి. విజయనగరం నవంబర్ 18 : జిల్లా లో సోలార్ యూనిట్లు స్థాపన లక్ష్యాలు సకాలం లో సాధించాలని జిల్లా కలెక్టర్ ఎస్. రాంసుందర్ రెడ్డి అన్నారు. ప్రధానమంత్రి సూర్యాఘర్ పథకం అమలు పై జిల్లా స్థాయి కమిటీ సమావేశం కలెక్టరేట్ లో జరిగింది. ఈసందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ […]

No Image

18.11.2025-అంగన్వాడీసేవల నాణ్యతపై రాజీ ప్రసక్తే లేదు–జిల్లా కలెక్టర్ ఎస్ రాంసుందర్ రెడ్డి

Published on: 19/11/2025

పత్రికా ప్రకటన అంగన్వాడీ సేవల నాణ్యతపై రాజీ ప్రసక్తే లేదు –జిల్లా కలెక్టర్ ఎస్ రాంసుందర్ రెడ్డి విజయనగరం, నవంబర్ 18 :జిల్లా కలెక్టర్ ఎస్. రాంసుందర్ రెడ్డి మంగళవారం బొబ్బిలి మండలం పారాది గ్రామంలోని అంగన్వాడీ కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు.  కేంద్రంలో పిల్లలకు అందిస్తున్న పోషకాహారం, సౌకర్యాలు, రికార్డు నిర్వహణపై ఆరా తీశారు. తనిఖీలో భాగంగా, మంగళవారం మెనూ ప్రకారం మధ్యాహ్న భోజనంలో టమాట పప్పు వండవలసి ఉన్నప్పటికీ అది తయారు చేయకపోవడం గుర్తించిన కలెక్టర్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ,  నిర్లక్ష్యానికి […]