News
విపత్తును సమర్థవంతంగా ఎదుర్కొంటాం : కలెక్టర్ ఎస్ రాసుందర్ రెడ్డి పేర్కొన్నారు
Published on: 29/10/2025విపత్తును సమర్థవంతంగా ఎదుర్కొంటాం ఆకస్మిక తనిఖీలలో నలుగురు అధికారులకు షోకాస్ నోటీసులు విజయనగరం, అక్టోబర్ 28: మొంథా తుఫాను నేపథ్యంలో ఎటువంటి విపత్తులైన సమర్థవంతంగా ఎదుర్కోటానికి జిల్లా యంత్రాంగం సంసిద్ధంగా ఉందని కలెక్టర్ ఎస్ రాసుందర్ రెడ్డి పేర్కొన్నారు. మంగళవారం ఎస్ పి ఏ ఆర్ దామోదర్ తో కలిసి పెద్ద చెరువు ట్యాంక్ బండ్ రోడ్లను పరిశీలించి మున్సిపల్ కమిషనర్ నల్లనయ్యకు తగు సూచనలు జారీ చేశారు. ముఖ్యంగా కాలువలు స్టాగ్నేషన్ లేకుండా నీరు సజావుగా పారే విధంగా […]
పురిటి నొప్పులతో సహాయక చర్యల కోసం ఎదురు చూసిన గర్భిణి 👉 జిల్లా కలెక్టర్ ఆదేశాల ముద్రకు వైద్య సిబ్బంది చొరవ తో సుఖ ప్రసవం.. 👉 వైద్య సిబ్బందిని అభినందించిన జిల్లా కలెక్టర్ రాం సుందర్ రెడ్డి I
Published on: 29/10/2025పురిటి నొప్పులతో సహాయక చర్యల కోసం ఎదురు చూసిన గర్భిణి జిల్లా కలెక్టర్ ఆదేశాల ముద్రకు వైద్య సిబ్బంది చొరవ తో సుఖ ప్రసవం.. వైద్య సిబ్బందిని అభినందించిన జిల్లా కలెక్టర్ రాం సుందర్ రెడ్డి విజయనగరం, అక్టోబరు 28: నిండు గర్భిణీ ..పురిటి నొప్పులతో బాధపడుతుంటే…సహాయం కోసం కుటుంబ సభ్యులు ఎదురు చూస్తున్నారు…నదిని దాటే సాహసం చేయలేక .. రవాణా సౌకర్యం లేక..ఆందోళన చెందుతున్న కుటుంబ సభ్యులు… అంతలోనే ఏ.ఎన్.ఎం., ఆశ కార్యకర్త సురక్షితంగా గజపతినగరం ఆసుపత్రికి అంబులెన్స్ లో చేర్చగా […]
24 గంటలూ విధుల్లో ఉండాలి పునరావాస కేంద్రాల్లో అన్ని వసతులు జిల్లా తుఫాను ప్రత్యేకాధికారి రవి సుభాష్ పలు మండలాల్లో విస్తృత పర్యటన
Published on: 29/10/2025గుర్ల, గరివిడి, చీపురుపల్లి (విజయనగరం), అక్టోబరు 28 ః మోంథా తుఫానును దృష్టిలో పెట్టుకొని జిల్లా యంత్రాంగం ఏర్పాటు చేసిన 71 పునరావాస కేంద్రాల్లో అన్ని వసతులను కల్పించాలని జిల్లా తుఫాను ప్రత్యేకాధికారి రవి సుభాష్ పట్టంశెట్టి ఆదేశించారు. కాల్‌సెంటర్లతో పాటు సచివాలయాలు, పునరావాస కేంద్రాల్లో కూడా ప్రభుత్వ సిబ్బంది షిప్టులవారీగా 24 గంటలూ విధులను నిర్వహించాలని స్పష్టం చేశారు. రేషన్ సరుకులు, త్రాగునీరు, మందులు, ఇతర అవసరమైన వస్తువులన్నటినీ సిద్దంగా ఉంచాలని ఆదేశించారు. ఆయన గుర్ల, గరివిడి మండలాల్లోని లోతట్టు ప్రాంతాల్లో ఆయన మంగళవారం విస్తృతంగా పర్యటించారు. పునరావాస కేంద్రాలను, సచివాలయాలను తనిఖీ చేశారు. అక్కడ […]
తుఫాన్ చర్యల పై టెలి కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించిన ప్రత్యేకాధికారి రవి పట్టం శెట్టి, జిల్లా కలెక్టర్ రాం సుందర్ రెడ్డి
Published on: 29/10/2025తుఫాన్ చర్యల పై టెలి కాన్ఫరెన్స్: ముప్పు ఉన్న ప్రాంతాల్లో ఉన్నవారిని తక్షణమే తరలించాలి. బలహీనంగా ఉన్న చెరువుల వద్ద సిబ్బంది, సామగ్రి తో పొజిషన్ లో ఉండాలి తుఫాన్ చర్యల పై టెలి కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించిన ప్రత్యేకాధికారి రవి పట్టం శెట్టి , జిల్లా కలెక్టర్ రాం సుందర్ రెడ్డి విజయనగరం, అక్టోబరు 28: ముప్పు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో ఉన్నవారిని తక్షణమే తరలించాలని జిల్లా స్పెషలాఫీసర్ రవి సుభాష్ పట్టం శెట్టి ఆదేశించారు. వృద్ధులను, పాత ఇళ్లు, పాడు పడిన ఇళ్లల్లో ఉన్నవారిని, పాకల్లో ఉన్న […]
పెద్దచెరువును పరిశీలించిన కలెక్టర్ అప్రమత్తంగా ఉండాలని ఆదేశం
Published on: 29/10/2025విజయనగరం, అక్టోబరు 28 ః పట్టణంలోని పెద్దచెరువును జిల్లా కలెక్టర్ ఎస్.రాంసుందర్ రెడ్డి మంగళవారం పరిశీలించారు. భారీ వర్షాలవల్ల పెద్దచెరువు పొంగి పొరలుతున్న కారణంగా, నీటి మట్టం పరిస్థితి, నీటిని బయటకు పంపించే కాలువల గురించి మున్సిపల్ కమిషనర్ నల్లనయ్యను అడిగి తెలుసుకున్నారు. అప్రమత్తంగా ఉండాలని, గండి పడకుండా తగిన జాగ్రత్తలను తీసుకోవాలని ఆదేశించారు. పెద్దచెరువు నీరు రోడ్డుపైకి రాకుండా తగిన చర్యలను తీసుకుంటున్నామని కమిషనర్ తెలిపారు.
We should achieve sustainability in poverty eradication*– District Collector S. Ramsunder Reddy
Published on: 25/10/2025పేదరిక నిర్మూలనలో సుస్థిరిత సాధించాలి* — జిల్లా కలెక్టర్ ఎస్. రాంసుందర్ రెడ్డి విజయనగరం, అక్టోబర్ 24: జిల్లాలో పేదరిక నిర్మూలన దిశగా డిఆర్డిఎ చేస్తున్న కార్యక్రమాలు సుస్థిరత సాధించే దిశగా చేయాలని జిల్లా కలెక్టర్ ఎస్. రాంసుందర్ రెడ్డి సూచించారు. శుక్రవారo కలెక్టరేట్ సమావేశమందిరం లో జరిగిన డిఆర్డిఎ, మెప్మా సమీక్షలో కలెక్టర్ మాట్లాడుతూ, ఎస్ హెచ్ జి లకు అవసరమైన శిక్షనలు ఇవ్వడం ద్వారా వారికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలన్నారు, ప్రస్తుతం ఆర్. […]
శివారు భూములకూ సాగునీరు అందాలి, మడ్డువలస రిజర్వాయర్ ను పరిశీలించిన కలెక్టర్ రాంసుందర్ రెడ్డి
Published on: 24/10/2025శివారు భూములకూ సాగునీరు అందాలి మడ్డువలస రిజర్వాయర్ ను పరిశీలించిన కలెక్టర్ రాం సుందర్ రెడ్డి వంగర (విజయనగరం), అక్టోబర్ 24.: మడ్డువలస రిజర్వాయర్ శివారు భూములకి సైతం సాగునీరు అందించేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ఎస్.రాం సుందర్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఆయన వంగర మండలంలో శుక్రవారం పర్యటించారు. మడ్డువలస రిజర్వాయర్ ను పరిశీలించారు. ప్రాజెక్టులోకి నీటి ప్రవాహ స్థితిగతులపై ఆరా తీశారు ఆ ప్రాజెక్ట్ కింద సాగులో ఉన్న భూమి నీటి ప్రవాహ స్థితిని ఆరా […]
District Collector S. Ramsunder Reddy takes drastic measures to bring back fishermen
Published on: 24/10/2025మత్స్యకారులను రప్పించేందుకు ముమ్మర చర్యలు జిల్లా కలెక్టర్ ఎస్. రాంసుందర్ రెడ్డి విజయనగరం, అక్టోబర్ 23:బంగ్లాదేశ్ నేవీకి చిక్కిన విజయనగరం జిల్లాకు చెందిన ఎనిమిది మంది మత్స్యకారులను స్వదేశానికి క్షేమంగా రప్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని స్థాయిల్లో చర్యలు వేగవంతం చేసిందని జిల్లా కలెక్టర్ ఎస్. రాంసుందర్ రెడ్డి తెలిపారు. సముద్రంలో చేపల వేటకు వెళ్లి పొరపాటున బంగ్లాదేశ్ సముద్ర సరిహద్దులోకి ప్రవేశించిన ఈ మత్స్యకారుల పరిస్థితిపై రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమై, కేంద్ర విదేశాంగ మంత్రిత్వశాఖ (MEA)తో నిరంతరం సంప్రదింపులు కొనసాగిస్తోందని […]
RDO Keerthi met the affected fishermen families as per the instructions of the District Collector. MPs and MLAs consoled the affected families.
Published on: 24/10/2025జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు బాధిత మత్స్యకార కుటుంబాలను కలిసిన ఆర్.డి.ఓ కీర్తి బాధిత కుటుంబాలను ఓదార్చిన ఎం.పి, ఎం.ఎల్.ఏ లు విజయనగరం, అక్టోబరు 23: బాంగ్లాదేశ్ లో చిక్కుకున్న 8 మంది మత్స్యకారుల కుటుంబ సభ్యులను గురువారం విజయనగరం ఆర్.డి.ఓ డి.కీర్తి విశాఖపట్నం ఫిషింగ్ హార్బర్ లో కలిశారు. జిల్లా కలెక్టర్ ఎస్.రాం సుందర్ రెడ్డి ఆదేశాల మేరకు ఆర్.డి.ఓ బాధిత కుటుంబాలతో మాట్లాడి బాంగ్లాదేశ్ నుండి రప్పించడానికి ప్రభుత్వం అన్ని విధాలుగా చర్యలు తీసుకుంటుందని, ఆందోళన చెందవద్దని ధైర్యం చెప్పారు. బాధిత కుటుంబాలు […]
We will bring the fishermen back safely: Union Minister Kinjarapu Rammohan Naidu
Published on: 24/10/2025మత్స్యకారులను క్షేమంగా తీసుకువస్తాం : కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు. – ఇప్పటికే విదేశాంగ శాఖ మంత్రితో మాట్లాడిన రామ్మోహన్ నాయుడు. – బంగ్లాదేశ్ ఎంబసీ తో నిరంతర సంప్రదింపులు, నిశిత పరిశీలన. – సముద్ర భద్రత, చట్టం, రక్షణ వ్యవహారాలు చూసే కోస్ట్ గార్డ్ వ్యవస్థతో ఈ సమస్యపై మాట్లాడిన రామ్మోహన్ నాయుడు. అక్టోబర్ 23 : ఆంధ్రప్రదేశ్ లోని విజయనగరం జిల్లాకు చెందిన ఎనిమిది మంది మత్స్యకారులు పొరపాటున బంగ్లాదేశ్ సముద్ర జలాల్లోకి ప్రవేశించిన నేపథ్యంలో అక్కడి నేవీ అధికారుల చేతిలో బందీలు అయిన […]