News

Filter by:
No Image

28.12.2025 ప్రతి సోమవారం రెవెన్యూ క్లినిక్* జిల్లా కలెక్టర్ ఎస్ రాంసుందర్ రెడ్డి

Published on: 29/12/2025

పత్రికా ప్రకటన *ప్రతి సోమవారం రెవెన్యూ క్లినిక్* జిల్లా కలెక్టర్ ఎస్ రాంసుందర్ రెడ్డి విజయనగరం, డిసెంబర్ 28:  ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్‌లో ప్రతి సోమవారం ఉదయం 10.00 గంటలకు రెవెన్యూ క్లినిక్ నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ ఎస్ రాంసుందర్ రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. ముగ్గురు రెవెన్యూ డివిజనల్ అధికారులు,  తహసీల్దార్లు తప్పనిసరిగా ఉదయం 10.00 గంటలకు కలెక్టరేట్‌లో నిర్వహించే రెవెన్యూ క్లినిక్‌కు హాజరుకావాలని ఈ సందర్బంగా కలెక్టర్ ఆదేశించారు. అదేవిధంగా […]

No Image

27.12.2025 పారిశ్రామిక వృద్దికి అవ‌గాహ‌న కార్య‌క్ర‌మాలు, 8 ప‌రిశ్ర‌మ‌ల ద్వారా 54 వేల మందికి ఉపాధికి ప్ర‌తిపాద‌న‌, జిల్లా క‌లెక్ట‌ర్ ఎస్‌.రాంసుంద‌ర్ రెడ్డి

Published on: 29/12/2025

ప‌త్రికా ప్ర‌క‌ట‌న‌-2 పారిశ్రామిక వృద్దికి అవ‌గాహ‌న కార్య‌క్ర‌మాలు 8 ప‌రిశ్ర‌మ‌ల ద్వారా 54 వేల మందికి ఉపాధికి ప్ర‌తిపాద‌న‌ జిల్లా క‌లెక్ట‌ర్ ఎస్‌.రాంసుంద‌ర్ రెడ్డి విజ‌య‌న‌గ‌రం, డిసెంబ‌రు 27 ః   జిల్లాలో ప‌రిశ్ర‌మ‌ల స్థాప‌న‌కు  ఔత్సాహికుల‌కు విస్తృతంగా అవ‌గాహ‌నా కార్య‌క్ర‌మాల‌ను నిర్వ‌హించాల‌ని  జిల్లా క‌లెక్ట‌ర్ ఎస్‌.రాంసుంద‌ర్ రెడ్డి ఆదేశించారు. దీనికోసం ఈ నెలాఖ‌రులోగా స‌మ‌గ్ర కార్యాచ‌ర‌ణ ప్ర‌ణాళిక‌ను రూపొందించాల‌ని సూచించారు. ప‌రిశ్ర‌మ‌ల స్థాప‌న‌కోసం వ‌చ్చే ద‌ర‌ఖాస్తుల‌ను సింగిల్ విండో విధానంలో వెంట‌నే ప‌రిశీలించి, అనుమ‌తులు మంజూరు చేయాల‌ని చెప్పారు.               జిల్లా ప‌రిశ్ర‌మ‌లు మ‌రియు ఎగుమ‌తుల ప్రోత్సాహ‌క […]

No Image

27.12.2025 ఎస్సీ, ఎస్టీ కుటుంబాలకు ఉచితంగా సౌర విద్యుత్, జ‌న‌వ‌రి మొదటివారంలో అమ‌లుకు క‌లెక్ట‌ర్ ఆదేశం

Published on: 29/12/2025

ప‌త్రికా ప్ర‌క‌ట‌న‌ ఎస్సీ, ఎస్టీ కుటుంబాలకు ఉచితంగా సౌర విద్యుత్ జ‌న‌వ‌రి మొదటివారంలో అమ‌లుకు క‌లెక్ట‌ర్ ఆదేశం విజయనగరం, డిసెంబ‌రు 27 :       ప్రధానమంత్రి సూర్య ఘర్ పథకంలో భాగంగా, జిల్లాలోని షెడ్యూల్డ్ కులాలు మరియు షెడ్యూల్డ్ తెగలకు చెందిన కుటుంబాలకు ఉచితంగా సౌర విద్యుత్‌ను అందించే ప‌థ‌కాన్ని జ‌న‌వ‌రి మొదటి వారంలో ప్రారంభించాల‌ని జిల్లా క‌లెక్ట‌ర్ ఎస్‌.రాంసుంద‌ర్ రెడ్డి ఆదేశించారు. అర్హులైన ప్రతి ఇంటిపై రెండు కిలోవాట్ల సామర్థ్యం కలిగిన సౌర విద్యుత్ ఫలకాలను ప్రభుత్వం ఎటువంటి ఖర్చు లేకుండా ఉచితంగా […]

No Image

ఈ నెల 31నే పింఛ‌న్ల పంపిణీ, జిల్లా క‌లెక్ట‌ర్ ఎస్‌.రాంసుంద‌ర్ రెడ్డి

Published on: 27/12/2025

ఈ నెల 31నే పింఛ‌న్ల పంపిణీ జిల్లా క‌లెక్ట‌ర్ ఎస్‌.రాంసుంద‌ర్ రెడ్డి విజ‌య‌న‌గ‌రం, డిసెంబ‌రు 26 ః       సామాజిక పింఛ‌న్ దారుల‌కు రాష్ట్ర‌ ప్ర‌భుత్వం నూత‌న సంవ‌త్స‌ర కానుక‌ను ప్ర‌క‌టించింది. జ‌న‌వ‌రి 1కి బ‌దులుగా ఒక‌రోజు ముందుగా ఈ నెల 31నే ఎన్‌టిఆర్ భ‌రోసా పింఛ‌న్ల‌ను పంపిణీ చేయ‌నున్న‌ట్లు జిల్లా క‌లెక్ట‌ర్ ఎస్‌.రాంసుంద‌ర్ రెడ్డి ఒక ప్ర‌క‌ట‌న‌లో పేర్కొన్నారు. ఆ రోజు ఉద‌యం 7 గంట‌లు నుంచి గ్రామ‌, వార్డు స‌చివాల‌య సిబ్బంది ల‌బ్దిదారుల ఇళ్ల‌కు వ‌చ్చి పింఛ‌న్ల‌ను అందజేస్తార‌ని తెలిపారు. డిసెంబ‌రు నెల‌కు గాను జిల్లాలో  2,71,697 మంది పింఛ‌న్ దారుల‌కు […]

No Image

జ‌న్నివ‌ల‌స అనాధ‌ బాలుర‌కు క‌లెక్ట‌ర్ అండ‌ ఇళ్లు, హాస్ట‌ల్ సీట్ల మంజూరుకు హామీ

Published on: 27/12/2025

జ‌న్నివ‌ల‌స అనాధ‌ బాలుర‌కు క‌లెక్ట‌ర్ అండ‌ ఇళ్లు, హాస్ట‌ల్ సీట్ల మంజూరుకు హామీ విజ‌య‌న‌గ‌రం, డిసెంబ‌రు 26 ః             త‌ల్లితండ్రుల‌ను కోల్పోయి అనాధ‌లుగా మారిన  జ‌న్నివ‌ల‌స గ్రామానికి చెందిన ఇద్ద‌రు బాలుర‌కు జిల్లా క‌లెక్ట‌ర్ ఎస్‌.రాంసుంద‌ర్ రెడ్డి అండ‌గా నిలిచారు. వారికి ఇళ్లు మంజూరు చేయ‌డ‌మే కాకుండా, చ‌దువుకొనేందుకు స‌హ‌క‌రిస్తామ‌ని, హాస్ట‌ల్ సీట్ల‌ను మంజూరు చేస్తామ‌ని హామీ ఇచ్చారు.                    జామి మండ‌లం జ‌న్నివ‌ల‌స గ్రామానికి చెందిన మైల‌ప‌ల్లి విజ‌య్‌(12), గౌత‌మ్‌(10) కొద్ది కాలంలోనే త‌ల్లితండ్రుల‌కు కోల్పోయారు. వారి చిన్న‌త‌నంలోనే తండ్రి కేన్స‌ర్‌తో మ‌ర‌ణించ‌గా, త‌ల్లి ఆరు నెల‌ల క్రితం […]

No Image

పిల్లలే వికసిత్ భారత్‌కు పునాది జిల్లా కలెక్టర్ ఎస్.రాంసుందర్ రెడ్డి ఘనంగా వీరబాల దివస్ పోస్ట‌ర్ల‌ను ఆవిష్క‌రించినక‌లెక్ట‌ర్‌

Published on: 27/12/2025

పిల్లలే వికసిత్ భారత్‌కు పునాది జిల్లా కలెక్టర్ ఎస్. రాంసుందర్ రెడ్డి ఘనంగా వీరబాల దివస్ పోస్ట‌ర్ల‌ను ఆవిష్క‌రించిన క‌లెక్ట‌ర్‌   విజయనగరం, డిసెంబర్ 26, 2025:   భారత భవిష్యత్తుకు మూలస్తంభాలైన బాలలను గౌరవిస్తూ, వారిలో స్ఫూర్తిని నింపేందుకు ఉద్దేశించిన ‘వీర్ బాల్ దివస్’ వేడుకలు  జిల్లాలో శుక్రవారం ఘనంగా జరిగాయి. స్థానిక కలెక్టరేట్‌లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్‌లో జిల్లా కలెక్టర్ ఎస్. రాంసుందర్ రెడ్డి, ఐ.సి.డి.ఎస్ ప్రాజెక్ట్ డైరెక్టర్ టి. విమలారాణి మరియు ఇతర జిల్లా అధికారులు జాతీయ స్థాయి ప్రత్యక్ష ప్రసారాన్ని వీక్షించారు. […]

No Image

జిల్లాలో అమలు జరుగుతున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలపై కలెక్టర్ తో చర్చించిన మంత్రి కొండపల్లి శ్రీనివాస్

Published on: 26/12/2025

జిల్లాలో అమలు జరుగుతున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలపై కలెక్టర్ తో చర్చించిన మంత్రి కొండపల్లి శ్రీనివాస్.  త్వరితగతిన పరిశ్రమలు ఏర్పాటుకు చర్యలు చేపట్టాలి.  నైపుణ్య శిక్షణ అందించి నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలి. విజయనగరం: 24 డిసెంబర్ 2025: విజయనగరం జిల్లాలో జరుగుతున్న పలు అభివృద్ధి కార్యక్రమాల పురోగతి, సంక్షేమ కార్యక్రమాల అమలుపై మంత్రి కొండపల్లి శ్రీనివాస్ జిల్లా కలెక్టర్ కలిసి చర్చించారు. పెండింగ్ అంశాలను వీలైనంత త్వరగా పరిష్కరించాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం విజయనగరం జిల్లాకు […]

No Image

ఉద్యాన పంట‌ల‌ విస్త‌ర‌ణ‌కు ప్ర‌త్యేక‌ కార్యాచ‌ర‌ణ‌* *అద‌నంగా 10వేల ఎక‌రాల్లో సాగుకు ప్రణాళిక‌* *ప‌లు ప్ర‌భుత్వ శాఖ‌ల స‌మ‌న్వ‌యంతో అమ‌లు* *జిల్లా క‌లెక్ట‌ర్ ఎస్‌.రాంసుంద‌ర్ రెడ్డి వినూత్న కార్య‌క్ర‌మం

Published on: 26/12/2025

ఉద్యాన పంట‌ల‌ విస్త‌ర‌ణ‌కు ప్ర‌త్యేక‌ కార్యాచ‌ర‌ణ‌* *అద‌నంగా 10వేల ఎక‌రాల్లో సాగుకు  ప్రణాళిక‌* *ప‌లు ప్ర‌భుత్వ శాఖ‌ల స‌మ‌న్వ‌యంతో అమ‌లు* *జిల్లా క‌లెక్ట‌ర్ ఎస్‌.రాంసుంద‌ర్ రెడ్డి వినూత్న కార్య‌క్ర‌మం* విజ‌య‌న‌గ‌రం, డిసెంబ‌రు 24 ః                    జిల్లాలో ఉద్యాన‌సాగు విస్త‌ర‌ణ‌కు ప్ర‌త్యేక కార్యాచ‌ర‌ణ రూపొందింది. జిల్లా క‌లెక్ట‌ర్ ఎస్‌.రాంసుంద‌ర్ రెడ్డి వినూత్న ఆలోచ‌న‌తో త్వ‌ర‌లోనే అద‌నంగా జిల్లాలో సుమారు ప‌దివేల ఎక‌రాల్లో ఉద్యాన పంట‌ల సాగు […]

No Image

ప్రతినెల నిర్వహించే పౌర హక్కుల దినం కు సభ్యులందరినీ ఆహ్వానించాలి• ఎస్.సి.,ఎస్.టి అట్రాసిటి జరిగినప్రాంతానికి ఆర్.డి.ఓ, డి.ఎస్.పి లు హాజరు కావాలిజిల్లా కలెక్టర్ ఎస్. రాంసుందర్ రెడ్డి

Published on: 24/12/2025

ప్రతి నెల నిర్వహించే పౌర హక్కుల దినం కు సభ్యులందరినీ ఆహ్వానించాలి ఎస్.సి., ఎస్.టి అట్రాసిటి  జరిగిన ప్రాంతానికి ఆర్.డి.ఓ, డి.ఎస్.పి లు హాజరు కావాలి జిల్లా కలెక్టర్ ఎస్. రాంసుందర్ రెడ్డి విజయనగరం, డిసెంబర్ 23:  ప్రతి నెల 30 వ తేదీన నిర్వహించే పౌర హక్కుల దినం కు డివిఎంసి సభ్యులందరినీ ఆహ్వానించాలని, నెల రోజుల ముందే సివిల్ రైట్స్ డే నిర్వహించే గ్రామం, సమయం వివరాలను షెడ్యూల్ చేయాలనీ  జిల్లా కలెక్టర్ ఎస్. రాంసుందర్ రెడ్డి తెలిపారు. సమావేశం నిర్వహించిన అనంతరం సమేవేశపు మినిట్స్ ను […]

No Image

ఈవిఎం గోదాములను త‌నిఖీ చేసిన క‌లెక్ట‌ర్‌ రాంసుందర్ రెడ్డి

Published on: 24/12/2025

ఈవిఎం గోదాములను త‌నిఖీ చేసిన క‌లెక్ట‌ర్‌ రాంసుందర్ రెడ్డి   నెల్లిమ‌ర్ల‌, (విజ‌య‌న‌గ‌రం), డిసెంబర్ 23 : స్థానిక‌ ఈవిఎం గోదాముల‌ను జిల్లా క‌లెక్ట‌ర్ ఎస్‌.రాంసుంద‌ర్ రెడ్డి మంగళవారం త‌నిఖీ చేశారు. గోదాము ష‌ట్ట‌ర్ల‌కు వేసిన సీళ్ల‌ను, తాళాల‌ను తెరిపించి లోపలి గదులను, ఈవీఎం పెట్టెలను ప‌రిశీలించారు. పోలీసు బందోబ‌స్తుపై స‌మీక్షించారు. సిసి కెమేరాల ద్వారా చుట్టుప్ర‌క్క‌ల‌ ప‌రిస్తితుల‌ను ప‌రిశీలించారు. అంతా అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని అధికారుల‌ను, పోలీసు సిబ్బందిని ఆదేశించారు. డిఆర్వో ఇ.మురళి, ఆర్‌డిఓ డి.కీర్తి, నెల్లిమ‌ర్ల‌ తాహ‌సీల్దార్ శ్రీ‌కాంత్‌, క‌లెక్ట‌రేట్ ఇంచార్జి ఎన్నిక‌ల‌ సూప‌రింటిండెంట్ ప్రసాదరావు, ఇత‌ర రెవెన్యూ అధికారులు, సిబ్బంది, రాజకీయ […]