Press Release
E-Governance is given high priority in Secretariat services *The new system is a platform for quick services and transparent governance *Central team visited the district.. Collector Suryakumari explained the services
Published on: 16/09/2022సచివాలయ సేవల్లో ఈ-గవర్నెన్స్‌కు అధిక ప్రాధాన్యత *సత్వర సేవలకు, పారదర్శక పాలనకు వేదికగా నిలుస్తోన్న నూతన వ్యవస్థ *జిల్లాకు విచ్చేసిన కేంద్ర బృందం.. సేవలను వివరించిన కలెక్టర్ సూర్యకుమారి విజయనగరం, సెప్టెంబర్ 14 ః సామాన్య ప్రజలకు సులభంగా.. వేగంగా నాణ్యమైన సేవలందించే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా సచివాలయ వ్యవస్థను అందుబాటులోకి తీసుకొచ్చిందని, తద్వారా ప్రజలకు సుమారు 798 రకాల సేవలందిస్తోందని జిల్లా కలెక్టర్ ఎ. సూర్యకుమారి పేర్కొన్నారు. సచివాలయ వ్యవస్థ పనితీరును పరిశీలించేందుకు కేంద్ర ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో కమిటీ […]
The dream of middle class people realized, the allotment of plots for smart township layouts in Jaganna, the dream of common people has come true: ZP Chairman Majji Srinivasa Rao, for the first time in the state: District Collector Suryakumari, within a year we will give it to VMRDA Chairman.
Published on: 14/09/2022నెరవేరిన మధ్యతరగతి ప్రజల కల జగనన్న స్మార్ట్ టౌన్ షిప్ లేఅవుట్ల ప్లాట్లు కేటాయింపు సామాన్యుల కల నెరవేరింది ః జెడ్‌పి ఛైర్మన్ మజ్జి శ్రీనివాసరావు, రాష్ట్రంలోనే తొలిసారి ః జిల్లా కలెక్టర్ సూర్యకుమారి ఏడాదిలోగా అప్పగిస్తాం ః విఎంఆర్‌డిఏ ఛైర్‌పర్సన్ విజయనిర్మల విజయనగరం, సెప్టెంబరు 13 ః మధ్యతరగతి ప్రజల చిరకాల స్వప్నం సాకారమయ్యింది. ఇళ్ల స్థలాల కోసం ఏళ్లతరబడి వేచి చూస్తున్న వారి ఆశను రాష్ట్రప్రభుత్వం నెరవేర్చింది. అతితక్కువ ధరకే అత్యంత విలువైన ఇంటి స్థలాలు […]
District Collector A. Suryakumari said that the teaching profession is the most sacred. He said that apart from shaping the future of children, teachers have a great task of making them useful to the society.
Published on: 07/09/2022గురువులపై గురుతర బాధ్యత ఉపాధ్యాయ వృత్తికే వన్నెతెచ్చిన సర్వేపల్లి ఎంపి బెల్లాన చంద్రశేఖర్ ఘనంగా 60వ గురుపూజోత్సవం విజయనగరం, సెప్టెంబరు 05 ః సమాజాన్ని తీర్చిదిద్దే గురుతర బాధ్యత ఉపాధ్యాయులపైనే ఉందని, విజయనగరం ఎంపి బెల్లాన చంద్రశేఖర్ అన్నారు. డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ ఉపాధ్యాయ వృత్తికే వన్నె తెచ్చారని కొనియాడారు. జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో, 60 వసంతాల గురు పూజోత్సవం, జెడ్‌పి సమావేశమందిరంలో సోమవారం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా ఉత్తమ ఉపాధ్యాయులను, చిట్టిగురువులను ఘనంగా సన్మానించారు. జ్ఞాపికలు, ప్రశంసా పత్రాలను బహూకరించారు. ఈ […]
The notification for the filling of various posts in the medical department, the deadline for the grievance of the candidates till 6th of this month, the district collector has given many instructions to the candidates.
Published on: 07/09/2022వైద్య శాఖలో పలు పోస్టుల భర్తీ కి నోటిఫికేషన్ ఈ నెల 6వ తేదీ వరకు అభ్యర్ధుల గ్రీవెన్సు కు గడువు అభ్యర్ధులకు పలు సూచనలు చేసిన జిల్లా కలెక్టర్ విజయనగరం, సెప్టెంబర్ 02: వైద్య శాఖకు సంబంధించిన ఉమ్మడి జిల్లాల్లో పలు కేటగిరీ లలో 194 పోస్టు లకు ఆగష్టు 29 నాటికీ ఉన్న ఖాళీలతో రోస్టర్ వారీగా నోటిఫికేషన్ జరీ చేయడం జరిగిందని జిల్లా కలెక్టర్ మరియు డిస్ట్రిక్ట్ సెలెక్షన్ కమిటి చైర్మన్ ఎ. సూర్య కుమారి ఒక ప్రకటన లో తెలిపారు. ఈ […]
Everyone should come forward for eye donation, Collector A. Suryakumari, who started the Eye Donation Party, District Collector who donated the eyes and gave the acceptance letter.
Published on: 25/08/2022ప్రతి ఒక్కరూ నేత్ర దానానికి ముందుకు రావాలి నేత్రదాన పక్షోత్సవాలను ప్రారంభించిన కలెక్టర్ ఎ. సూర్యకుమారి నేత్రాలను దానం చేస్తూ అంగీకార పత్రం అందజేసిన జిల్లా కలెక్టర్ విజయనగరం, ఆగస్టు 25 ః అన్ని దానాల్లో కన్నా నేత్ర దానం గొప్పదని.. ప్రతి ఒక్కరూ పెద్ద మనసుతో నేత్ర దానానికి ముందుకు రావాలని.. ఇతరుల జీవితాల్లో వెలుగులు నింపాలని జిల్లా కలెక్టర్ ఎ. సూర్యకుమారి పిలుపునిచ్చారు. నేత్ర దానం తాలూక ఆవశ్యకతను తెలియజేస్తూ జిల్లా అంధత్వ నివారణ సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించతలపెట్టిన […]
Explain the dangers caused by drugs, District Collector A. Suryakumari
Published on: 24/08/2022మత్తుపదార్ధాల వల్ల కలిగే అనర్ధాలను వివరించాలి జిల్లా కలెక్టర్ ఎ.సూర్యకుమారి విజయనగరం, ఆగస్టు 23 ఃమత్తు పదార్ధాలు, మాదక ద్రవ్యాలవల్ల కలిగే అనర్థాలను విద్యార్థులకు వివరించాలని జిల్లా కలెక్టర్ ఎ.సూర్యకుమారి సూచించారు. నష ముక్త భారత్ అభియాన్ కార్యక్రమం అమలులో భాగంగా తన ఛాంబర్‌లో వివిధ విద్యాశాఖల అధికారులతో, కలెక్టర్ తన ఛాంబర్‌లో సోమవారం సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, విద్యార్థులు, యువతను మత్తుపదార్ధాలనుంచి విముక్తి కల్గించాలని కోరారు. దీనిపై పెద్ద ఎత్తున అవగాహనా కార్యక్రమాలను నిర్వహించి, వీటి వాడకం వల్ల కలిగే నష్టాలను, దుష్పరిణామాలను […]
Special attention should be given to building constructions, details of beneficiaries should be displayed in secretaries, review of response requests every Wednesday, State Chief Minister YS Jaganmohan Reddy in Spandana V.C.
Published on: 24/08/2022భవన నిర్మాణాలపై ప్రత్యేక శ్రద్ధ వహించండి లబ్ధిదారుల వివరాలను సచివా లయాలలో ప్రదర్శించాలి ప్రతి బుధవారం స్పందన వినతులు పై సమీక్షించాలి స్పందన వి.సి లో రాష్ట్ర ముఖ్యమంత్రి వై.యస్.జగన్మోహన్ రెడ్డి విజయనగరం, ఆగస్టు 23 : రాష్ట్ర ప్రభుత్వం అమలుచేస్తున్న సంక్షేమ పథకాల అమలులో జిల్లా కలెక్టర్లు మరింత ప్రత్యేక శ్రద్ధ వహించాలని, ముఖ్య0గా ప్రభుత్వ భవనాల నిర్మాణాల పై ప్రత్యేక శ్రద్ధ వహించాలని రాష్ట్ర ముఖ్యమంత్రి వై.యస్.జగన్మోహన్ రెడ్డి జిల్లా కలెక్టర్లకు సూచించారు. గ్రామ సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు, డిజిటల్ లైబ్రరీలు, వై.ఎస్.ఆర్. […]
Tanguturi of Andhrakesari * Tribute by District Collector A. Suryakumari * Tanguturi 150th Anniversary Celebrations at Collectorate
Published on: 24/08/2022బహుముఖ ప్రజ్ఞాశాలి.. ఆంధ్రకేసరి టంగుటూరి *నివాళులర్పించిన జిల్లా కలెక్టర్ ఎ. సూర్యకుమారి *కలెక్టరేట్లో టంగుటూరి 150వ జయంతి వేడుకలు విజయనగరం, ఆగస్టు 23 ః న్యాయవాదిగా… రచయితగా.. రాజకీయ వేత్తగా సమాజానికి ఎనలేని సేవలందించిన ఘనుడు.. ధైర్యశాలి.. ప్రజ్ఞాశాలి టంగుటూరి ప్రకాశం పంతులు అని జిల్లా కలెక్టర్ ఎ. సూర్యకుమారి కొనియాడారు. ఆయన చూపిన ప్రతిభా పాటవాలు, ధైర్య సాహసాలు నేటి యువతరానికి ఎంతో స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు. ఆంధ్రరాష్ట్ర తొలి ముఖ్యమంత్రిగా ఆయన నిర్వర్తించిన కర్తవ్యాలు.. తీసుకున్న నిర్ణయాలు మనందరికీ మార్గదర్శకంగా నిలుస్తాయని అన్నారు. […]
Focus on crops with low investment, District Collector Mrs. Suryakumari advises farmers, visits Rythu Bharosa Kendras in Gantyada Mandal
Published on: 24/08/2022@తక్కువ పెట్టుబడితో వచ్చే పంటలపై దృష్టి సారించండి @రైతులు బాధ్యత తీసుకొని తమ భూములు రీసర్వే చేయించుకోవాలి @ఫోర్టిఫైడ్ బియ్యంలో పోషక విలువలు అధికం -వాటిని అమ్ముకోవద్దు @రైతులకు జిల్లా కలెక్టర్ శ్రీమతి సూర్యకుమారి సూచన @గంట్యాడ మండలంలో రైతుభరోసా కేంద్రాలు సందర్శన విజయనగరం, ఆగష్టు 22 : పోషక విలువలు గల బియ్యం అందించడం కోసం ప్రభుత్వం ఎంతో ఖర్చు భరించి ప్రజాపంపిణీ వ్యవస్థ ద్వారా మన జిల్లాలో ఫోర్టిఫైడ్ బియ్యం సరఫరా చేస్తోందని, అటువంటి బియ్యం ఇతరులకు అమ్ముకొనే ప్రయత్నం […]
Talk to the petitioners and give a satisfactory answer, 251 petitions for response, District Collector Suryakumari
Published on: 24/08/2022అర్జీదారులతో మాట్లాడి సంతృప్తి కరమైన సమాధానం ఇవ్వాలి స్పందనకు 251 వినతులు స్పందన కు హెచ్.ఓ.డి లు హాజరు కావాలి జిల్లా కలెక్టర్ సూర్యకుమారి విజయనగరం, ఆగస్టు 22: సోమవారం కలెక్టరేట్ నందు నిర్వహించిన స్పందన కు ప్రజల నుండి 251 వినతులు అందాయి. వీటిలో వైద్య శాఖకు 34, డి.ఆర్.డి.ఏ కు 32, అందగా అత్యధికంగా రెవిన్యూ కు సంబంధించి 195 వినతులు అందాయి. ముఖ్యంగా సదరం, పింఛన్లు, ఇళ్ల స్థలాలు, గృహాల కోసం విజ్ఞప్తులు వచ్చాయి. ఈ వినతులు జిల్లా కలెక్టరు ఎ. సూర్య కుమారి, ఉప కలెక్టర్లు సుదర్శన దొర, సూర్యనారాయణ స్వీకరించారు. అనంతరం కలెక్టర్ అధికారుల తో […]