Close

Central team inspecting the proposed site for setting up of Central Tribal University, Central District Coalition District Collector.

Publish Date : 08/10/2021

కేంద్రీయ గిరిజ‌న విశ్వ‌విద్యాల‌యం ఏర్పాటుకు స్థ‌ల ప‌రిశీల‌న‌
ప్ర‌తిపాదిత స్థ‌లాన్ని ప‌రిశీలించిన కేంద్ర బృందం
కేంద్ర బృందాన్ని క‌ల‌సిని జిల్లా క‌లెక్ట‌ర్‌

విజ‌య‌న‌గ‌రం, సెప్టెంబ‌రు 29; జిల్లాలోని మెంటాడ‌, ద‌త్తిరాజేరు మండ‌లాల ప‌రిధిలో కేంద్రీయ గిరిజ‌న విశ్వ‌విద్యాల‌యం ఏర్పాటుకోసం రాష్ట్ర ప్ర‌భుత్వం ప్ర‌తిపాదించిన స్థ‌లాన్ని కేంద్ర ఉన్న‌తాధికారుల బృందం బుధ‌వారం ప‌రిశీలించింది. యూనివ‌ర్శిటీ గ్రాంట్స్ క‌మిష‌న్ కార్య‌ద‌ర్శి ర‌జ‌నీష్ జైన్‌, రాష్ట్ర ఉన్న‌త విద్యాశాఖ ప్ర‌త్యేక ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి స‌తీష్‌చంద్ర‌, కేంద్ర విద్యాశాఖ అండ‌ర్ సెక్ర‌ట‌రీ ర‌విశంక‌ర్‌, హైద‌రాబాద్ కేంద్రీయ విశ్వ‌విద్యాల‌యంకు చెందిన ప్రొ.స‌ర్రాజు, కేంద్రీయ గిరిజ‌న విశ్వ‌విద్యాల‌యం వైస్ ఛాన్స‌ల‌ర్ ప్రొ.క‌ట్టిమ‌ణి, రోడ్లు భ‌వ‌నాల శాఖ చీఫ్ ఇంజ‌నీర్ ర‌మేష్‌బాబుల‌తో కూడిన క‌మిటీ మెంటాడ మండ‌లం చిన‌నాడ‌ప‌ల్లి, ద‌త్తిరాజేరు మండ‌లం మ‌ర్రివ‌ల‌స త‌దిత‌ర గ్రామాల ప‌రిధిలోని ప్ర‌తిపాదిత స్థ‌లాన్ని ప‌రిశీలించింది. రెవిన్యూ డివిజ‌న‌ల్ అధికారి బిహెచ్‌.భ‌వానీ శంక‌ర్ యూనివ‌ర్శిటీ ఏర్పాటుకు  ప్ర‌తిపాదిస్తున్న‌ 561 స్థ‌లం వివ‌రాల‌ను మ్యాప్ స‌హాయంతో కేంద్ర బృందం అధికారుల‌కు వివ‌రించారు.
క్షేత్ర‌స్థాయిలో స్థ‌ల ప‌రిశీల‌న అనంత‌రం జిల్లా కేంద్రంలోని జెడ్పీ అతిథిగృహం చేరుకున్న కేంద్ర బృందం అధికారుల‌ను జిల్లా క‌లెక్ట‌ర్ శ్రీ‌మ‌తి ఏ.సూర్య‌కుమారి, జాయింట్ క‌లెక్ట‌ర్ డా.జి.సి.కిషోర్ కుమార్ క‌లిశారు. ఈ స్థ‌లంలో యూనివ‌ర్శిటీ ఏర్పాటు వ‌ల్ల గిరిజ‌న ప్రాంతానికి ద‌గ్గ‌ర‌గా వుంటుంద‌ని, రోడ్డు, రైలు, విమాన సౌక‌ర్యాలు కూడా ద‌గ్గ‌ర‌గానే ఉన్నాయ‌ని బృందం స‌భ్యుల‌కు వివ‌రించారు.

———————————————————————————————–
జారీ స‌హాయ సంచాల‌కులు, స‌మాచార పౌర‌సంబంధాల శాఖ‌, విజ‌య‌న‌గ‌రం

Central team inspecting the proposed site for setting up of Central Tribal University