Close

Collector A. Suryakumari directed the concerned authorities to provide full infrastructure to revive the construction of houses in Gunkalam layout.

Publish Date : 18/06/2022

మౌలిక స‌దుపాయాల‌ను పూర్తి స్థాయిలో క‌ల్పించండి

*గుంక‌లాం లేఅవుట్‌ను సంద‌ర్శించిన క‌లెక్ట‌ర్ సూర్య‌కుమారి

 

విజ‌య‌న‌గ‌రంజూన్ 14 ః గుంక‌లాం లేఅవుట్‌లో ఇళ్ల నిర్మాణాలు మ‌రింత పుంజుకునేలా మౌలిక స‌దుపాయాల‌ను పూర్తి స్థాయిలో క‌ల్పించాల‌ని సంబంధిత అధికారుల‌ను క‌లెక్ట‌ర్ ఎ. సూర్య‌కుమారి ఆదేశించారు. మంగ‌ళ‌వారం ఆమె లేఅవుట్‌ను సంద‌ర్శించి అక్క‌డ జ‌రుగుతున్న ప‌నుల‌ను ప‌రిశీలించారు. ల‌బ్ధిదారుల‌కు అవ‌స‌ర‌మైన ఇసుక‌ఇనుముసిమెంటు ఇత‌ర ముడి స‌రుకుల‌ను అందుబాటులో ఉంచాల‌ని రెవెన్యూగృహ నిర్మాణ శాఖ అధికారుల‌కు సూచించారు. నీటి సదుపాయం క‌ల్పించాల‌ని చెప్పారు. అలాగే సోలార్ సిస్టం ద్వారా విద్యుత్ స‌ర‌ఫ‌రా అందించేందుకు చ‌ర్య‌లు తీసుకోవాల‌ని పేర్కొన్నారు. బీబీఎల్ స్టేజీ నుంచి స్లాబ్ లెవెల్ వ‌ర‌కు జ‌రుగుతున్న నిర్మాణాలు త్వ‌రిత‌గ‌తిన‌ పూర్త‌య్యేలా ప‌ర్య‌వేక్షించాల‌ని సూచించారు. ల‌బ్ధిదారుల‌తో మాట్లాడి వారికి కావాల్సిన స‌హాయ‌స‌హ‌కారాలు అందించాల‌ని అధికారుల‌ను ఆదేశించారు. ఆమె వెంట విజ‌య‌న‌గ‌రం త‌హ‌శీల్దార్ బంగార్రాజుగృహ నిర్మాణ శాఖవిద్యుత్ శాఖ‌ అధికారులు త‌దిత‌రులు ఉన్నారు.

Collector A. Suryakumari directed the concerned authorities to provide full infrastructure to revive the construction of houses in Gunkalam layout.