Close

Deposits in banks that do not cooperate with loans should be withdrawn, special time for schemes every Tuesday and Wednesday, food processing should be encouraged, awareness should be raised on financial literacy, District Collector Surya Kumari said in a meeting of district level bankers.

Publish Date : 26/09/2022

రుణాలకు సహకరించని బ్యాంకుల్లో డిపాజిట్లు వెనక్కి

ప్రతి మంగళ, బుధ వారాల్లో పధకాల కోసం ప్రత్యేక సమయం

ఫుడ్ ప్రాసెసింగ్ ను ప్రోత్సహించాలి

ఫైనాన్సియల్ లిటరసీ పై అవగాహన పెంచాలి

జిల్లా స్థాయి బ్యాంకర్ల సమావేశం లో జిల్లా కలెక్టర్ సూర్య కుమారి

విజయనగరం, సెప్టెంబరు 16 : రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పధకాలను లబ్దిదారులకు అందించి వారి జీవనోపాదులను మెరుగుపడేలా బ్యాంకు అధికారులు సహకరించాలని జిల్లా కలెక్టర్ ఎ. సూర్య కుమారి తెలిపారు. కాగితాల పై రుణాలు మంజూరు అవుతున్నాయి కాని లబ్ది దారులకు ఆ నగదు అందడం లేదని , చిన్న చిన్న కారణాలతో నగదు అందించడం లేదని, ఆశించిన లబ్ది జరగనప్పుడు ఇలాంటి సమావేశాలు ఎందుకని బ్యాంకర్ల పై ఆగ్రహం వ్యక్తం చేసారు. ఇలాంటి పరిస్థితులు వలసలకు దారి తీస్తాయని అన్నారు. కలెక్టరేట్ సమావేశ మందిరం లో శుక్రవారం జిల్లా స్థాయి బ్యాంకర్ల సమావేశం కలెక్టర్ అధ్యక్షతన జరిగింది. సంక్షేమ పధకాల క్రింద రుణాలు అందించడానికి ముందుకు రాని బ్యాంకులనుండి ప్రభుత్వ డిపాజిట్లను వెనక్కు తీసు కుంటామని హెచ్చరించారు. లబ్దిదారులు ముఖ్యంగా మహిళలు బ్యాంకు ల చుట్టూ తిరిగే పరిస్థితి మంచిది కాదని, వారికీ ఋణం అందించక పోగా వారి సమయాన్ని వృధా చేస్తూ వారి ఆదాయానికి నష్టం కలిగించే పరిస్థిని సహించేది లేదని అన్నారు. గైడ్ లైన్స్ రాలేదని బ్యాంకు ల చుట్టూ తిప్ప వద్దని, ఏ ఒక్కరిని నిరాశ పరచాకూడదని తెలిపారు. సంక్షేమ పధకాల గ్రౌన్డింగ్ కోసం ప్రత్యేకంగా మంగళ, బుధవారాలను కేటాయించాలని, ఆ రెండు రోజుల్లో వారి వీలును బట్టి లబ్ది దారులు బ్యాంకులకు వస్తారని, వారి నుండి అవసరమగు ధ్రువ పత్రాలను తీసుకొని పధకాలను గ్రౌన్డింగ్ చేయడానికి ప్రత్యెక అధికారి ఒకరు పని చేయాలనీ సూచించారు. వై.ఎస్.ఆర్. చేయూత, జగన్న తోడు తదితర పధకాలలో తక్కువగా గ్రౌన్డింగ్ చేసిన బ్యాంకు వివరాలను చదివి ఇక పై పురోగతి లేకపోతే మా నుండి మీకు ఎలాంటి సహకారం ఉండదని వారిని ఉద్దేశించి అన్నారు. అదే విధంగా రుణాలు పొందిన వారి నుండి రికవరీ బాధ్యతను అధికారులు తెసుకోవాలని, తిరిగి చెల్లిస్తేనే వడ్డీ రాయితీ తో పాటు, మరల రుణాలను పొందగలరని ముందే చెప్పాలని సూచించారు. బ్యాంకర్ల తో ప్రతి నెల జరిగే సమావేశాలకు జిల్లా అధికారులే స్వయంగా హాజరై, వారి పధకాల గురించి చర్చించి దరఖాస్తులను గ్రౌన్డింగ్ చేయించాలన్నారు. ఏ.పి.ఎం.ఐ.పి , ఉద్యాన శాఖల యూనిట్ లను వెంటనే గ్రౌన్డింగ్ జరిగేల చూడాలని అదే విధంగా మత్స్య శాఖ యూనిట్లకు రుణాల కోసం బ్యాంకు గ్యారంటీ లు అడుగుతున్నారని, అలాంటి బెరాలాడవద్దని, అర్హులైన వారందరికీ నిబంధనల మేరకు రుణాలు ఇవ్వాల్సిందేనని స్పష్టం చేసారు. స్కేల్ అఫ్ ఫైనాన్సు వివరాలను ఆర్.బి.కే లలో ప్రదర్శించాలని సూచించారు.

జామి మండలం బీమాలి లో నిర్వహిస్తున్న మామిడి తాండ్ర , పచ్చళ్ళు తదితర ఉత్పత్తులు మంచి రుచిగా ఉంటూ నాణ్యంగా ఉంటాయని, అయితే ప్యాకింగ్, స్టోరేజి తదితర అంశాలు సరిగ్గా జరగడం లేదని దానివలన మంచి ధర అందడం లేదని అన్నారు. శాస్త్రీయ పద్ధతి లో ప్యాకింగ్, స్టోరేజి ఉంటే ఆకర్షణీయంగా ఉంటుందని ఇందులో తగు శిక్షణ నిచ్చి ప్రోత్సహించాలని డి.ఆర్.డి.ఏ ప్రాజెక్ట్ డైరెక్టర్ కళ్యాణ చక్రవర్తి కి సూచించారు.

స్కిల్ డెవలప్మెంట్ క్రింద శిక్షణలు పెంచాలని, దీనివలన ఉపాధి లేదా స్వయం ఉపాధి అవకాశాలు పెరగడం తో జీవనోపాదులు మెరుగుపడతాయని తెలిపారు. ఫైనాన్సియల్ లిటరసీ పై సచివాలయ స్థాయి లో శిక్షణలు ఇవ్వాలని , అందుకోసం ఒక షెడ్యూల్ తయారు చేయాలనీ ఎల్.డి.ఎం శ్రీనివాస రావు కు కలెక్టర్ సూచించారు.

ఈ సమావేశం లో సంయుక్త కలెక్టర్ మయూర్ అశోక్, రిజర్వు బ్యాంకు ఎల్.డి.ఓ రెహమాన్, నాబార్డ్ డి డి ఎమ్ నాగార్జున , పలు బ్యాంకు లకు చెందిన ప్రతినిధులు , జిల్లా అధికారులు పాల్గొన్నారు.

Deposits in banks that do not cooperate with loans should be withdrawn, special time for schemes every Tuesday and Wednesday, food processing should be encouraged, awareness should be raised on financial literacy, District Collector Surya Kumari said in a meeting of district level bankers.