Close

Distribution of TLM kits to children with special needs at the call of District Collector A. Suryakumari

Publish Date : 14/12/2021

దివ్యాంగుల‌కు చ‌క్క‌ని భ‌విష్య‌త్తునిద్దాం
జిల్లా క‌లెక్ట‌ర్ ఎ.సూర్య‌కుమారి పిలుపు
ప్ర‌త్యేక అవ‌స‌రాల పిల్ల‌ల‌కు టిఎల్ఎం కిట్లు పంపిణీ

విజ‌య‌న‌గ‌రండిసెంబ‌రు 14 ః
పిల్ల‌ల్లో విక‌లాంగ‌త్వం ఉంద‌ని బాధ‌ప‌డ‌వ‌ద్ద‌నివారికి మంచి భ‌విష్య‌త్తునిచ్చేందుకు కృషి చేయాల‌ని జిల్లా క‌లెక్ట‌ర్ శ్రీ‌మ‌తి ఎ.సూర్య‌కుమారి పిలుపునిచ్చారు. దివ్యాంగుల అభివృద్దికి ప్ర‌భుత్వం ఎన్నో అవ‌కాశాల‌ను క‌ల్పిస్తోంద‌నివాటిని వినియోగించుకోవాల‌ని సూచించారు.

ప్ర‌త్యేక అవ‌స‌రాల పిల్ల‌ల‌కు క‌లెక్ట‌రేట్ ఆడిటోరియంలో టీచింగ్‌లెర్నింగ్ మెటీరియ‌ల్ కిట్ల‌ను మంగ‌ళ‌వారం క‌లెక్ట‌ర్ పంపిణీ చేశారు. ఒక్కొక్క‌టి సుమారు రూ.10వేలు విలువ‌చేసే 162 కిట్ల‌ను ఎన్ఐఇపిఐడి (నేష‌న‌ల్ ఇన్‌స్టిట్యూట్ ఫ‌ర్ ది ఎంప‌వ‌ర్‌మెంట్ ఆఫ్ పెర్స‌న్ విత్ ఇంట‌లెక్చువ‌ల్ డిజేబిలిటీ) స‌మకూర్చింది. ఈ కిట్ల‌ను పంపిణీ చేసిన అనంత‌రం క‌లెక్ట‌ర్ మాట్లాడుతూదివ్యాంగుల్లో కూడా ఏదో ఒక ప్ర‌తిభ దాగిఉంటుంద‌నిదానిని గుర్తించి ప్రోత్స‌హిస్తే అద్భుతాలు చేస్తార‌ని అన్నారు. ఆ దిశ‌గా వారి త‌ల్లితండ్రులు కృషి చేయాల‌న్నారు. ప్ర‌త్యేక అవ‌స‌రాల పిల్ల‌ల‌గురించి దిగులు చెంద‌వ‌ద్ద‌నిఏ క‌ల్మ‌షం అంట‌ని వారి జ‌న్మపూర్వ‌జ‌న్మ సుకృతంగాఅదొక‌ అధృష్టంగా భావించాల‌ని సూచించారు. ఇటువంటి పిల్ల‌ల‌ను పెంచి పెద్ద‌చేయ‌డానికి  త‌ల్లితండ్రుల‌కు ఎంతో ఓర్పుస‌హ‌నం అవ‌స‌ర‌మ‌ని అన్నారు.

జాయింట్ క‌లెక్ట‌ర్ (అభివృద్ది) డాక్ట‌ర్ ఆర్‌.మ‌హేష్‌కుమార్ మాట్లాడుతూ,  దివ్యాంగుల‌కు గ‌తంతో పోలిస్తేవిద్య‌ఉద్యోగావ‌కాశాలు ఎంతో మెరుగుప‌డ్డాయ‌నిప్ర‌భుత్వ‌పరంగా త‌గిన స‌హ‌కారం అందుతోంద‌ని చెప్పారు. ఈ అవ‌కాశాల‌ను వినియోగించుకోవడం ద్వారా వారికి బంగారు భ‌విష్య‌త్తునివ్వాల‌ని కోరారు.

ఈ కార్య‌క్ర‌మంలో జిల్లా విద్యాశాఖాధికారి ఎస్‌.బ్ర‌హ్మాజీరావుస‌మ‌గ్ర శిక్ష అద‌న‌పు ప్రాజెక్టు కో-ఆర్డినేట‌ర్ డాక్ట‌ర్ స్వామినాయుడుఎన్ఐఇపిఐడి ప్ర‌తినిధులు ప్ర‌వీణ్‌కుమార్‌పాచిప‌న్‌స‌హిత‌విద్య జిల్లా స‌మ‌న్వ‌య‌క‌ర్త‌ ఎం.శ్రీ‌నివాస‌రావుస‌హాయ స‌మ‌న్వ‌య‌క‌ర్త ఎం.భార‌తిస‌హిత విద్య ఉపాధ్యాయులువిద్యార్థులు పాల్గొన్నారు.

Distribution of TLM kits to children with special needs at the call of District Collector A. Suryakumari