Close

District Collector A. Surya Kumari cancels the deeds of those who do not go ahead with the construction of houses and gives a week to the beneficiaries.

Publish Date : 29/04/2022

👉గృహ నిర్మాణాలకు ముందుకు రాని వారి పట్టాలు రద్దు
👉లబ్ధిదారులకు వారం రోజులు గడువు
👉జిల్లా కలెక్టరు ఎ. సూర్య కుమారి

విజయనగరం, ఏప్రిల్ 28:: గుంకలాం లే ఔట్ నందు గృహాలు మంజూరైన వారు త్వరలోనే నిర్మాణాలు ప్రారంభించాలని జిల్లా కలెక్టరు సూర్య కుమారి ఒక ప్రకటనలో తెలిపారు. లే ఔట్ నందే సిమెంట్, ఉచితంగా ఇసుక అందజేయడం జరుగుతోందని, విద్యుత్, రహదారులు తదితర మౌలిక వసతులు కూడా కల్పించడం జరుగుతున్నదని తెలిపారు. ఈ లే ఔట్ లో 11 వేల గృహాలు మంజూరు కాగా ఇంతవరకు స్వంతంగా 850 మంది లబ్ధిదారులు కట్టుకున్నారని, మిగిలిన వారు కూడా ముందుకు రావాలని కోరారు. వారం లోగా స్వంతంగా కట్టుకోవడానికి లేదా ప్రభుత్వం కట్టించి ఇవ్వడానికి ఉద్దేశించిన ఆప్షన్- 3 కానీ ఎంచుకోవాలని, ఎం.ఓ.యూ చేసుకోడానికి ముందుకు రావాలని అన్నారు. అలా రాని వారి ఇళ్ల పట్టాను రద్దు చేయడం జరుగుతుందని తెలిపారు. ఆప్షన్ 3 ద్వారా ఎం.ఓ.యూ చేసుకున్న వారు వెంటనే బాంక్ ఖాతాలను తెరుచికోవాలని తెలిపారు.

District Collector A. Surya Kumari cancels the deeds of those who do not go ahead with the construction of houses and gives a week to the beneficiaries.