Close

District Collector A. Surya Kumari directed to grant permits to those who have applied for setting up of industry within the specified deadline

Publish Date : 20/11/2021

నిర్దిష్ట గడువు లోగా పరిశ్రమలకు అనుమతులివ్వాలి

జిల్లా కలెక్టర్ ఎ. సూర్య కుమారి

విజయనగరం, నవంబర్ 20:: పరిశ్రమ స్థాపనకు దరఖాస్తులు చేసుకున్న వారికి నిర్దిష్ట గడువు లోగా అనుమతులను మంజూరు చేయాలని జిల్లా కలెక్టర్ ఎ. సూర్య కుమారి  ఆదేశించారు.  శనివారం కలెక్టరేట్ ఆడిటోరియంలో జిల్లా పరిశ్రమల ప్రోత్సాహక కమిటీ సమావేశం కలెక్టర్ అద్వర్యం లో జరిగింది.  ఈ  సందర్బంగా శాఖల వారీగా పెండింగ్  ఉన్న దరఖాస్తులను  సమీక్షించారు.  గత సమావేశం నుండి ఈ సమావేశం వరకూ నెల లో 33 దరఖాస్తులు  అందాయని, అందులో 14 దరఖాస్తులను డిస్పోజ్ చేయడం   జరిగిందని పరిశ్రమ శాఖ జనరల్  మేనేజర్  తెలిపారు. మిగిలిన 19 లో 15 దరఖాస్తులు  కాలుష్య నియంత్రణ  శాఖ వద్ద, 4 దరఖాస్తులు అగ్నిమాపక శాఖ వద్ద పెండింగ్ ఉన్నట్లు వివరించారు.  ఇంకా పెండింగ్ ఉండడానికి    కారణాలేంటని కలెక్టర్   రెండు శాఖల అధికారులకు  ప్రశ్నించారు. ప్రాసెస్ చేస్తున్నామని, నిర్ణీత గడువు లోగా  డిస్పోజ్ చేస్తామని  కాలుష్య, అగ్నిమాపక అధికారులు తెలిపారు.  కలెక్టర్ మాట్లాడుతూ దరఖాస్తులను తిరష్కరిస్తే అందుకు గలా కారణాలను కూడా వివరంగా తెలపాలన్నారు.

    ఈ సమావేశం లో సంయుక్త కలెక్టర్ అభివృద్ది డా.మహేష్ కుమార్,  ఆసరా జె.సి జె.వెంకట రావు, లీడ్ జిల్లా మేనేజర్ శ్రీనివాస రాయ్, ఐలా, ఎస్.ఎస్.ఎం.ఈ, పి.సి.బి, వ్యవసాయ, మత్స్య, మార్కెటింగ్ తదితర లైన్ శాఖల  అధికారులు  పాల్గొన్నారు.

District Collector A. Surya Kumari directed to grant permits to those who have applied for setting up of industry within the specified deadline