Close

District Collector A. Surya Kumari has set a target of 5.80 metric tonnes this year.The purchase and monitoring of grain in 634 farmer assurance centers in the district is the responsibility of the special officers.

Publish Date : 15/11/2021

జిల్లాలో 634  రైతు భరోసా కేంద్రాల్లో ధాన్యం  కొనుగోలు

పర్యవేక్షణ బాధ్యత   ప్రత్యేకధికారులదే

ఈ ఏడాది 5.80 మెట్రిక్ టన్నుల లక్ష్యం

జిల్లా కలెక్టర్ ఎ. సూర్య కుమారి

విజయనగరం::నవంబర్ 13:: జిల్లా లో నున్న 634  రైతు భరోసా కేంద్రాల్లో ధాన్యం కొనుగోలు ప్రక్రియ ప్రారంభించాలని జిల్లా కలెక్టర్ ఎ. సూర్య కుమారి అధికారులకు ఆదేశించారు. జిల్లాలోని రైతు భరోసా కేంద్రాలకు పాక్స్, ఎఎంసి, డీసీఎంఎస్, జి సిసి ల నుండి  186 సహాయ ఏజెన్సీ లను కూడా సేకరణకోసం అనుసంధానించడం జరిగిందని తెలిపారు. ధాన్యం కొనుగోలు పై సంబంధిత అధికారులతో కలెక్టర్ టీం కాన్ఫరెన్స్ నిర్వహించి పలు సూచనలు జారీ చేశారు.  కోనుగోలు కోసం ఆర్.బి.కె లను  వారి పరిధిలోనున్న ధాన్యం ఉత్పత్తికి అనుగుణంగా  ఏ,బి,సి తరగతులుగా విభజించి  5,4,2 మంది సహాయకులను నియమించడం జరిగిందన్నారు.   ప్రతి మండల ప్రత్యేకాధికారి సోమవారం నుండి వారి మండల పరిధి లో నున్న ఆర్.బి.కె లను తనిఖీ చేయాలని ఆదేశించారు.  మండలం లో ఎంత వరి ఉత్పత్తి వస్తుంది, ఈ.కె.వై.సి ఎంత జరిగింది, కోతలు ఎప్పుడు చేయ వచ్చు , అమ్మకానికి ఎప్పటికి రావచ్చు అనే అంశాల ను సేకరించి నివేదిక సమర్పించాలన్నారు.  ముఖ్యముగా రైతులతో  మాట్లాడి వారి సందేహాలను నివృత్తి చేయాలన్నారు. ప్రభుత్వం చెప్పిన మిల్లు కే పంపాలని, లేని యెడల చెల్లింపుల విషయం లో ఇబ్బందులుంటాయని రైతులకు తెలియజేయాలన్నారు.   ప్రతి ఆర్.బి.కె వద్ద కనీస మద్దతు ధర ను ప్రదర్శించాలన్నారు.  ఆర్.బి.కె ల్లో ఖాళీ గా ఉన్న వ్యవసాయ సహాయకులు పోస్ట్ ల వివరాలను వెంటనే తెలియజేయాలని సూచించారు.  ధాన్యం కొనుగోళ్లు సక్రమంగా జరిగేలా చూడడానికి సబ్ కలెక్టర్, ఆర్.డి ఓ , డి.సి.ఓ, జిల్లా రవాణా , ఎల్.డి.ఎం,లారీ ఓనర్లు, తదితర శాఖల మధ్య సమన్వయం ఉండాలని, ప్రతి ఒక్కరు వారి పరిధి లోనున్న ప్రక్రియ సజావుగా జరిగేలా చూడాలని అన్నారు.

     ముందుగా సంయుక్త కలెక్టర్ డా.జి.సి.కిషోర్ కుమార్ పవర్ పాయింట్ ద్వారా నూతన కొనుగోలు ప్రక్రియ విధి విధానాలను వివరించారు.  గతం లో డ్వాక్రా, వ్యవసాయ మార్కెట్ ,పాక్స్ ద్వారా కోనుగోళ్ళు జరిగేవని, ఈ ఏడాది వారి సహాయం తో  ఆర్.బి.కె ల్లో  మాత్రమే జరుగుతుందని వివరించారు.  జిల్లాలో మొత్తం విస్తీర్ణం లో 76 శాతం వరి సాగు జరుగుతుందని,  గత ఏడాది కన్నా అధికంగా ఈ ఏడాది అధికంగా వస్తుందని అన్నారు.  ఈ ఏడాది 5.80 మెట్రిక్ టన్నుల సేకరణ లక్ష్య0 గా  చేస్తున్నామన్నారు. ఈ క్రాప్ నమోదు శత శాతం జరిగిందని, ఈ కె వై సి 90 శాతం పూర్తి అయ్యిందని తెలిపారు.  ప్రతి రైతుకు కూపన్లు ఇవ్వడం, మిల్లలు ట్యాగ్ చేయడం జరుగుతుందని తెలిపారు.  ప్రత్యేకధికారుల పర్యవేక్షణ లో  రియల్ టైం లో సేకరణ జరగాలని, అందుకు తగ్గ ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయని, అధికారులంతా బాధ్యతగా పని చేయాలని అన్నారు.

   ఈ టీమ్ కాన్ఫరెన్స్ లో సబ్ కలెక్టర్ భావన, పిఓ ఆర్.కూర్మ నాధ్, ఆర్.డి.ఓ   భవాని శంకర్,  వ్యవసాయ శాఖ జె.డి తారక రామ రావు, నోడల్ అధికారులు, ప్రత్యేక అధికారులు,  వ్యవసాయ శాఖ  అధికారులు , మిల్లర్లు తదితరులు పాల్గొన్నారు.

District Collector A. Surya Kumari has set a target of 5.80 metric tonnes this year.The purchase and monitoring of grain in 634 farmer assurance centers in the district is the responsibility of the special officers.