District Collector A. Surya Kumari said that drip irrigation is very beneficial for farmers
Publish Date : 24/08/2022
బిందు సేద్యంతో రైతుకు ఎంతో మేలు
జిల్లా కలెక్టర్ ఎ.సూర్య కుమారి
విజయనగరం, ఆగస్టు, 21: మొక్కల నీటి అవసరాలకు అనుగుణంగా సరిపడా పరిమాణంలో సాగు నీటిని అవసరమైనపుడు అందించే విధానాన్ని సూక్ష్మ నీటి సాగు పధకం అంటారు. ఇందులో రెండు పద్ధతులు కలవు.
- బిందు సేద్య సాగు పద్ధతి(డ్రిప్ఇరిగేషన్) :
సన్నని ప్లాస్టిక్ గొట్టాల ద్వారా నీటిని తీసుకొని వచ్చి మొక్క వేళ్ళ వద్ద డిప్పర్లు ద్వారా బొట్లు, బొట్లు గా నీరు మరియు నీటితో పాటు ఎరువులను అందించే విధానాన్ని బిందు సేద్యం అంటారు.
బిందు సేద్యంనకు అనువైన పంటలు:
కొబ్బరి, మామిడి, జీడిమామిడి, సపొటా, జామ, బొప్పాయి, అరటి, కూరగాయలు, పొగాకు, ఉల్లి, చెరకు, పత్తి, మల్బరి, ఆయిల్ పాం, మొక్కజొన్న.
- తుంపర్ల సేద్య సాగు పద్ధతి(స్ప్రింక్లర్ ఇరిగేషన్) :
వర్షాభావ పరిస్థితులలో వేరుశనగ, పప్పుధాన్యాలు, ఆకు కూరలు మొదలగు పంటలకు తుంపర్ల సేద్య పరికరాల ద్వారా సాగు నీటిని అందించే పద్దతిని తుంపర్ల సేద్య పద్ధతి అంటారు.
తుంపర్ల సేద్యంనకు అనువైన పంటలు:
వేరు శెనగ, పప్పుధాన్యాలు, ఆకుకూరలు మొదలగునవి.
1) బిందు సేద్య పరికరాల పై రాయితీ:
Ø చిన్న మరియు సన్నకారు రైతులకు రూ. 2,18,000/- రాయితీ వరకు డ్రిప్ పరికరాలను 90% రాయితీ తో
5.00 ఎకరాలకు మించకుండా అందించబడును.
Ø 5.00 నుండి 12.50 ఎకరాల కలిగిన రైతులకు రూ. 3,10,000/- రాయితీ వరకు డ్రిప్ పరికరాలను 50% రాయితీ
తో అందించబడును.
బిందుసేద్యం వలన లాభాలు:
v సాగు నీటి ఆదా, భూగర్భ జల వనరుల పొదుపు, అధిక పంట దిగుబడి.
v ఇసుక నేలలకు, ఎగుడు దిగుడు భూములకు కూడ బిందు సేద్యo ద్వారా సాగు లోనికి తీసుకురావచ్చును.
v కరెంటు వినియోగం లో పొదుపు.
v పోషక పదార్ధాలు, రసాయనిక ఎరువులు, నీటి ద్వారా మొక్కల వేళ్ళ దగ్గరకు ఇవ్వటం వలన ఎరువుల వినియోగ సామర్ధ్యం 80%-90% పెరుగుదల.
v అన్ని రకాల పొలం పనులకు కూలీల ఖర్చు తగ్గుతుంది.
2) తుంపర్ల సేద్య పరికరాల పై రాయితీ:
Ø చిన్న మరియు సన్నకారు రైతులకు తుంపర్ల సేద్య పరికరాలను 55% రాయితీ తో 5.00 ఎకరాలకు మించకుండా
అందించబడును.
Ø 5.00 నుండి 12.50 ఎకరాల కలిగిన రైతులకు రైతులకు తుంపర్ల సేద్య పరికరాలను 45% రాయితీతో
అందించబడును.
అర్హులు: నీటి వసతి (బోరు/బావి) విద్యుత్ సౌకర్యం (మోటార్లకు/ ఆయిల్ ఇంజన్లకు) ఉన్నవారెవరికైనా ఈ పధకం క్రింద సూక్ష్మనీటిసేద్య పరికరాలు పొందుటకు అర్హులు.
Ø 2022-23 ఆర్దిక సంవత్సరంనకు 4500 హెక్టార్లు భౌతిక లక్ష్యం గా నిర్దేశించినారు. నేటి వరకు 478 మంది రైతులు 570 హెక్టార్లలో ఆన్ లైన్ పద్ధతిలో రైతు భరోసా కేంద్రాల్లో నమోదు చేయడం జరిగింది. ఆసక్తి గల రైతులు రైతు భరోసా కేంద్రాలలో పేరును నమోదు చేసుకొనవలసినదిగా తెలియజేయడమైనది.
జిల్లా కలెక్టర్
విజయనగరం
