Close

District Collector A. Surya Kumari said that every student writing 10th class exams this year should strive to achieve 10 out of 10 points. They want to stay focused on the exams as there are still a week to go before the exams.

Publish Date : 19/04/2022

👉ప్రతి విద్యార్థి పదికి పది పాయింట్లు సాధించాలి
👉మధ్యాహ్న భోజనం మెనూ ప్రకారమే ఉండాలి
👉 పాఠశాలలు గోడల పై మెనూ, టోల్ ఫ్రీ నెంబర్ డిస్ప్లే చెయ్యాలి
👉 రైతుకు పంటల మార్పిడి పై అవగాహన కలిగించాలి
👉ఘన వ్యర్ధాల నిర్వహణ పై ప్రత్యేక దృష్టి పెట్టాలి
👉 వేపాడ మండలం పర్యటనలో జిల్లా కలెక్టర్ ఏ.సూర్యకుమారి

విజయనగరం, ఏప్రిల్ 19:: ఈ ఏడాది 10 వ తరగతి పరీక్షలు రాస్తున్న ప్రతి విద్యార్థి 10 కి 10 పాయింట్లు సాధించడానికి కృషి చేయాలని జిల్లా కలెక్టర్ ఎ. సూర్య కుమారి తెలిపారు. పరీక్షల కు ఇంకా వారం రోజులే ఉన్నందున దృష్ట0తా పరీక్షల పైనే ఉండాలన్నారు.
మంగళవారం కలెక్టర్ వేపాడ జెడ్పీ ఉన్నత పాఠశాల , వళ్ళంపూడి, సింగరాయి గ్రామ సచివాలయాలను సందర్శించారు. పాఠశాల లో పదో తరగతి విద్యార్ధులతో మాట్లాడి వారు పబ్లిక్ పరీక్షలకు ఎలా సన్నద్ధం అవుతున్నదీ తెలుసుకున్నారు. ఇంగ్లీష్ మీడియం విద్యార్థులతో టెక్స్ట్ పుస్తకం లోని పాఠాన్ని చదివించారు. ఎవరెవరు ఏమేమి చదవాలనుకుంటు న్నారని ప్రశ్నించారు. అమ్మాయిలైతే కనీసం డిగ్రీ వరకూ అయిన చదవాలన్నారు. మీ కాళ్ళ పై మీరు నిలబడిన తర్వాతే పెళ్లిల్లు కోసం ఆలోచించాలన్నారు.
పాఠశాలలో మధ్యాహ్న భోజనం పరిశీలించారు. మెనూ ప్రకారంగా వండింది లేనిది తనిఖీ చేశారు. పప్పు, టమాటా, పులిహోర రుచి చూసి సంతృప్తి వ్యక్తంచేశారు. ఉడక బెట్టి ఉన్న గుడ్లను పరిశీలించి, కుళ్ళిన గుడ్లు వస్తే ఏం చేస్తున్నారని వంట వారిని ప్రశ్నించగా, సరఫరాదారునికి ఇచ్చేస్తున్నామని, తిరిగి మంచి గుడ్లు తీసుకుంటున్నామని తెలిపారు. విద్యార్థులకు రుచికరంగా, ఆరోగ్య కరంగా ఆహార పదార్థాలు వండి పెట్టాలని సూచించారు.
👉 టోల్ ఫ్రీ నెంబర్ డిస్ప్లే చేయాలి::
పాఠశాలల్లో అందిస్తున్న జగనన్న గోరుముద్ద, మరుగుదొడ్ల నిర్వహణ, విద్యా కానుక కిట్ల పంపిణీ, మౌలిక సదుపాయాల నిర్వహణ లో లోటుపాట్లు, విద్యా బోధనలో సమస్యలు, తదితర ఫిర్యాదుల కోసం విద్యా శాఖ 14417 టోల్ ఫ్రీ నంబర్ ను ఏర్పాటు చేసిందని తెలిపారు. ఈ నంబర్ ను ప్రతి పాఠశాల గోడల పై ప్రదర్శించాలని, పిల్లలకు కూడా ఈ నెంబర్ గురించి తెలియజేయాలని కలెక్టర్ సూచించారు. అదే విధంగా ప్రభుత్వం వెల్లడించిన మెనూ చార్ట్ ను కూడా డిస్ప్లే చేయాలన్నారు.
👉 వళ్ళంపూడి, సింగరాయి గ్రామ సచివాలయాల సందర్శన::
రెండు సచివాలయాల సిబ్బందితో మాట్లాడుతూ హౌసింగ్ , ఓ.టి.ఎస్, ఈ క్రాప్ నమోదు,ఈ- సేవలు, వాలంటీర్ల హాజరు, ఉపాధి పనులు, వెల్నెస్ కేంద్రాల నిర్మాణాలు,ఘన వ్యర్ధాల నిర్వాహణ తదితర అంశాల పై సమీక్షించారు. పిల్లల బరువులు, సామ్, మామ్, హీమోగ్లోబిన్ నమోదు, గర్భ స్రావాలు, సీసారిన్ ఆపరేషన్లు, సెక్స్ రేషియో, తదితర అంశాల పై ఆరా తీశారు. రక్త హీనత తగ్గించడానికి తీసుకోవలసిన జాగ్రత్తలు పై అవగాహన కలిగించాలన్నారు. పాఠశాలల్లో గుడ్ టచ్, బాడ్ టచ్ గురుంచి అవగాహన కలిగించాలని మహిళా పోలీస్లకు సూచించారు.
👉 రైతు భరోసా కేంద్రాల్లో ప్రత్యామ్నాయ పంటలు, పంటల మార్పిడి పై రైతులకు అవగాహన కలిగించాలన్నారు. ఈ.క్రాప్ నమోదు శత శాతం జరగాలన్నారు. ధాన్యం సేకరణ డబ్బులు అందరికి అందేలా చూడాలన్నారు.
ఈ పర్యనలో వేపాడ తహసీల్దార్ రమణ రాజు, ఎం.పి.డి.ఓ పద్మజ, సర్పంచ్ అంజలి, జెడ్.పి.టి.సీ అప్పా రావు, హౌసింగ్, పంచాయతీ రాజ్, ఆర్.డబ్ల్యూ.ఎస్ ఇంజనీర్లు పాల్గొన్నారు.

District Collector A. Surya Kumari said that every student writing 10th class exams this year should strive to achieve 10 out of 10 points. They want to stay focused on the exams as there are still a week to go before the exams.