Close

District Collector A. Surya Kumari said that the possibility of heavy to very heavy rains should be alerted.

Publish Date : 10/05/2022

భారి నుండి అతి భారి వర్షాలకు అవకాశం

అసని తుఫాన్ పట్ల అప్రమత్తంగా ఉండాలి

                                                                             జిల్లా కలెక్టర్ ఎ. సూర్య కుమారి

విజయనగరం, మే 09 :  జిల్లాలో మంగళవారం నుండి గురువారం వరకు భారీ నుండి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ  హెచ్చరికలు జరీ చేసినట్లు  జిల్లా కలెక్టర్ ఎ. సూర్య కుమారి  సోమవారం ఒక ప్రకటన లో తెలిపారు. తీరప్రాంత ప్రజలు,  లోతట్టు ప్రాంత ప్రజలను తగు  జాగ్రత్తలు తీసుకోవాలని ఇప్పటికే  సచివాలయ  సిబ్బంది ద్వారా సమాచారం అందించడం జరుతోందని తెలిపారు. తుఫాను స‌మ‌యంలో తగు జాగ్రతలు  తీసుకోవలని, పాత భ‌వ‌నాలు మరియు శిథిలావ‌స్థ‌లో ఉన్న‌ భ‌వ‌నాలకు ప్రజలు దూరంగా ఉండాలన్నారు.   నిరంతరం ప్రజలు వాతావ‌ర‌ణ హెచ్చ‌రిక‌ల‌ను చూసుకోవాలి, తుఫాను తీవ్ర‌త‌ను తెలుసుకోని జాగ్ర‌త్త‌గా ఉండాలన్నారు. లోత‌ట్టు ప్రాంతాల్లో ఉండే వారు ముంద‌స్తు జాగ్ర‌త్త‌గా ఎత్తైన ప్ర‌దేశాల్లోకి వెళ్లి ఉండ‌డం మంచిందని,  ఆల‌స్యం చేయ‌కుండా సురక్షిత ప్ర‌దేశాల్లో ఉండాలని,  న‌దీ ప‌రివాహ‌క ప్రాంతంలో ఉండే వారు మ‌రింత అప్ర‌మ‌త్తంగా ఉండేలా సుర‌క్షిత ప్రాంతానికి వెళ్లాలని తెలిపారు. ముంద‌స్తు జాగ్ర‌త్త‌గా వ‌ర్షాలు ప‌డే ప్రాంతాల్లో ఉండే వారు ఇంట్లో అదనపు ఆహారాన్ని, నీటి నిల్వ‌ల‌ను క‌లిగి ఉంచుకోవాలని, పిల్ల‌లు ఉన్న వారు వారికి అస‌వ‌ర‌మైన ఆహారాన్ని మందులను సిద్ధం చేసుకోవాలని అన్నారు.

     రోడ్డుపై ఉండే కరెంటు స్తంబాలను , వేలాడుతున్న తీగ‌లను తాకరాదని, మత్స్యకారులు ఎవరు కూడా సమద్రములోనికి వేటకు వెళ్ళ రాదనీ,  సముద్రంలో ఇది వరకే వేటకు వెళ్ళిన మత్స్యకారులును వెనుకకు రప్పించుటకు తగు చర్యలు తీసుకోవాలని  ఫిషరీస్ డిపార్టుమెంటు వారిని ఆదేశించడం జరిగిందన్నారు. జిల్లా యంత్రాంగం ముందస్తు చర్యలు తీసుకొనుట వలన జిల్లా ప్రజలు ఆందోళన చెందవలసిన అవసరం లేదని ప్రజలందరూ అప్రమత్తం గా వుంటూ జిల్లా యంత్రాంగానికి సహకరించాలని కోరారు.

కంట్రోల్ రూమ్ ల  ఏర్పాటు:

విజయనగరం జిల్లా కలక్టరు వారి కార్యాలయము, రెవెన్యూ డివిజినల్ అధికారి కార్యాలయములలో   ,  అన్ని తహసీల్దార్ కార్యాలయములలో  అసని తుఫాన్ సమాచారం కోసం కంట్రోల్ రూములు  ఏర్పాటు చేయుట జరిగిందని,

జిల్లా లో తుపాను సమయం లో ఎటువంటి సమస్యలు ఉన్న క్రింద తెలుపబడిన కంట్రోల్ రూము నకు సంప్రదించాలని కోరారు.

జిల్లా కలక్టరు వారి కార్యాలయములో ఏర్పాటు చేయబడిన కంట్రోల్ రూమ్ ఫోను నెంబరు 08922-236947.

రెవెన్యూ డివిజినల్ అధికారి, విజయనగరం వారి కార్యాలయములో ఏర్పాటు చేయబడిన కంట్రోల్ రూమ్ ఫోను నెంబరు 08922-276888

రెవెన్యూ డివిజినల్ అధికారి, చీపురుపల్లి  వారి కార్యాలయములో ఏర్పాటు చేయబడిన కంట్రోల్ రూమ్ ఫోను నెంబరు  9440717534

రెవెన్యూ డివిజినల్ అధికారి, బొబ్బిలి వారి కార్యాలయములో ఏర్పాటు చేయబడిన కంట్రోల్ రూమ్ ఫోను నెంబరు 08944 – 247288

తీర ప్రాంత మండలాలు అయినభోగాపురం & పూసపాటిరేగ తహసీల్దార్ వారి  కార్యాలయములలో ఏర్పాటు చేయబడిన కంట్రోల్ రూమ్ ఫోను నెంబరుభోగాపురం: 8074400947, పూసపాటిరేగ : 7036763036.

మత్స్యశాఖ, విజయనగరం  వారి కార్యాలయములలో ఏర్పాటు చేయబడిన కంట్రోల్ రూమ్ ఫోను నెంబరు 08922-273812

విద్యుత్ శాఖ, విజయనగరం  వారి కార్యాలయములలో ఏర్పాటు చేయబడిన కంట్రోల్ రూమ్ ఫోను నెంబరు 9490610102

District Collector A. Surya Kumari said that the possibility of heavy to very heavy rains should be alerted.