Close

District Collector A. Surya Kumari said there should be coordination among the secretariat employees working for the village staying in one place.

Publish Date : 23/06/2022

ఉద్యోగుల మధ్య సమన్వయం ఉండాలి

గంట్యాడ మండలం   పెనసాం,  బుడతనాపల్లి సచివాలయాలను ఆకశ్మీకంగా తనిఖీ చేసిన కలెక్టర్

విజయనగరం, జూన్ 22:: ఒకే చోట ఉంటూ గ్రామం కోసం పనిచేసే   సచివాలయ ఉద్యోగుల మధ్య సమన్వయం  ఉండాలని జిల్లా కలెక్టర్ ఎ. సూర్య కుమారి తెలిపారు. వ్యక్తుల ఆలోచనల  మధ్య చిన్న చిన్న తేడాలున్నప్పటికీ వాటిని ప్రజల మధ్యకు వెళ్లకుండా చూసుకోవాలని అన్నారు. గంట్యాడ మండలం పెనసాం, బుడతనాపల్లి గ్రామ సచివలయాలను బుధవారం తనిఖీ చేశారు. ఫంక్షనల్ అసిస్టెంట్లతో సమీక్షించారు. పెనసాం లో ఎవరికి వారు అందరూ బాగానే పని చేస్తున్నారు కానీ అందరి మధ్య సమన్వయం కొరవడి0దని, కొత్త భవనం నిర్మాణం త్వరగా పూర్తి చేసి అందులోకి వెళ్లాలని, అందరూ కలసి సంతోషంగా పని చేసుకోవాలని సూచించారు.

       రెండు సచివలయాలలో    వ్యవసాయ సహాయకులు సమీక్షిస్తూ విత్తనాలు , ఎరువులు నిల్వ పై ప్రశ్నించారు. డి.కృషి లో నమోదు జరుగుతోందని, ప్రస్తుతం ఎలాంటి సమస్య లేదని వి ఏ ఏ లు  వివరించారు. రైతులతో కలెక్టర్ మాట్లాడుతూ వరి కాకుండా పంటల మార్పిడి  పై దృష్టి పెట్టాలని కోరగా బొప్పాయి, మునగ , వేస్తున్నామని, మామిడి లో అంతర్ పంటలు వేస్తామని తెలిపారు. పొలంబడులు జరుగు తున్నాయని, ఆర్.బి.కె సేవలు సంతృప్తిగా ఉన్నాయని రైతులు తెలిపారు. సచివలయాలకు కులధ్రువీకరణ సర్టిఫికెట్ ల కోసం వచ్చే వారికి ఆలస్యం చేయకుండా వెంటనే సర్టిఫికెట్స్ జారీ చేయాలన్నారు.

గృహ నిర్మాణాలు వేగవంతం చేయాలని, లబ్ది దారులను చైతన్యం చేయాలని అన్నారు. ఆర్.బి.కె., సచివాలయ భవనాలు, వెల్నెస్ కేంద్రం,బి.ఎం.సి.యూ ల నిర్మాణాలను వేగంగా పూర్తి చేయాలన్నారు. సిమెంట్ వచ్చిందని, పనులు త్వరగా జరగాలని అన్నారు.

     గర్భిణీల నమోదు, సామ్, మాం వివరాలను తనిఖీ చేశారు.  గ్రామం లో 10 వ తరగతి ఫెయిల్ అయిన విద్యార్థులతో మాట్లాడి సప్లిమెంటరీ కి ఎలా ప్రిపేర్ అవుతున్నది అడిగారు. కష్టబడి చదవాలని, సప్లిమెంటరీ లో పాస్ అయి డిగ్రీ వరకు చదువు కొనసాగించాలని సూచించారు. సఖి గ్రూప్  సభ్యులతో మాట్లాడి సమావేశాలకు హాజరు కావాలని, ఆడవారికి అవసరమగు యోగాసనాలు అభ్యాసం చేయాలని అన్నారు.

 ఈ పర్యటన లో ఎం.పి.డి.ఓ నిర్మలా కుమారి, తహసీల్దార్ రాఘవ రావు, పెనసాం సర్పంచ్ పాపాయమ్మ, బుడతనాపల్లి సర్పంచ్ వాణి, మండల సిబ్బంది పాల్గొన్నారు.

District Collector A. Surya Kumari said there should be coordination among the secretariat employees working for the village staying in one place.