District Collector A. Suryakumari announced that CEC and HEC groups will also be offered in English medium in government junior colleges from this year.
Publish Date : 25/06/2022
ఆంగ్ల మాధ్యమంలో ఇంటర్ సిఇసి, హెచ్ఇసి గ్రూపులు
కలెక్టర్ ఎ.సూర్యకుమారి
విజయనగరం, జూన్ 24 ః ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో, ఈ ఏడాది నుంచి ఆంగ్లమాధ్యమంలో సిఇసి, హెచ్ఇసి గ్రూపులను కూడా అందించనున్నట్లు జిల్లా కలెక్టర్ ఎ.సూర్యకుమారి ప్రకటించారు. విద్యార్థులు, వారి తల్లితండ్రుల కోరిక మేరకు, నిపుణుల సూచనలకు అనుగుణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెళ్లడించారు. విద్యార్థులు ఈ అవకాశాన్ని వినియోగించుకొని, ఆసక్తి ఉన్నవారు ఆంగ్లమాధ్యమంలోని సిఇసి, హెచ్ఇసి గ్రూపుల్లో చేరాలని సూచించారు. జిల్లాలోని మొత్తం 18 ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో ఆంగ్ల మాధ్యమంలో కూడా సిఇసి, హెచ్ఇసి గ్రూపుల బోధన జరుగుతుందని, ఇప్పటికే ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం, ఈ కోర్సులకు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఈ నెల 20 నుంచి దరఖాస్తుల జారీ ప్రక్రియ మొదలయ్యిందని, జులై 20లోగా పూర్తి చేసిన దరఖాస్తులను అందజేయాలన్నారు.
