Close

District Collector A. Suryakumari directed the staff of the Secretariat to issue caste certificates to the students of Tenth and Inter from now onwards.

Publish Date : 22/06/2022

ఇప్ప‌టినుంచే కేస్ట్ స‌ర్టిఫికేట్ల‌ను జారీ చేయాలి
జిల్లా క‌లెక్ట‌ర్ ఎ.సూర్య‌కుమారి
విజ‌య‌న‌గ‌రం, జూన్ 21 ః
                ప‌దోత‌ర‌గ‌తి, ఇంట‌ర్ విద్యార్థుల‌కు ఇప్ప‌టినుంచే కుల ధృవీక‌ర‌ణ ప‌త్రాల‌ను జారీ చేయాల‌ని, స‌చివాల‌య సిబ్బందిని జిల్లా క‌లెక్ట‌ర్ ఎ.సూర్య‌కుమారి ఆదేశించారు. పాఠ‌శాల‌లు, క‌ళాశాలలు తెరిచిన తరువాత‌, కుల‌ధృవీక‌ర‌ణ ప‌త్రాల‌కోసం ఒకేసారి  విద్యార్థులు ఎగ‌బ‌డే అవ‌కాశం ఉంద‌ని, ర‌ద్దీని నివారించేందుకు ముందుగానే ఈ ప్ర‌క్రియ‌ను మొద‌లు పెట్టాల‌ని సూచించారు.
              స్థానిక 41వ డివిజ‌న్‌ ప‌రిధిలోని అంబేద్క‌ర్ కాల‌నీ, 49వ వార్డు స‌చివాల‌యాన్ని జిల్లా క‌లెక్ట‌ర్ మంగ‌ళ‌వారం సాయంత్రం ఆక‌స్మికంగా త‌నిఖీ చేశారు. ముందుగా స‌చివాల‌యాల అటెండెన్సు, ఇత‌ర రిజిష్ట‌ర్ల‌ను త‌నిఖీ చేశారు. జ‌గ‌న‌న్న గృహ‌నిర్మాణం, ఓటిఎస్ అమ‌లు, గ‌ర్భిణుల‌కు, చిన్న‌పిల్ల‌ల‌కు పోష‌కాహారం పంపిణీ, టీకా కార్య‌క్ర‌మాల‌పై ఆరా తీశారు. ఓటిఎస్‌లో రిజిష్ట్రేష‌న్ల జాప్యంపై అసంతృప్తి వ్య‌క్తం చేశారు.  పిల్ల‌ల‌ బ‌రువు, ఎత్తు రిజిష్ట‌ర్ల‌ను ప‌రిశీలించారు. స‌చివాల‌య ప‌రిధిలో బ‌రువు త‌క్కువ‌గా ఉన్న ఒక బాలిక‌ను, చిన్న‌పిల్ల‌ల వైద్య‌నిపుణులకు ట్యాగ్ చేయాల‌ని ఆదేశించారు. ప‌దోత‌ర‌గ‌తి ఫ‌లితాల‌పై ఆరా తీశారు. స‌ప్లిమెంట‌రీ ప‌రీక్ష‌ల్లో అంద‌రూ ఉత్తీర్ణుల‌య్యేలా, స‌చివాల‌య ప‌రిధిలోని విద్యార్థుల‌ను ప‌రీక్ష‌ల‌కు సిద్దం చేయాల‌ని సూచించారు. స‌ఖి గ్రూపు నిర్వ‌హ‌ణ‌, అవ‌గాహ‌న క‌ల్పిస్తున్న విష‌యాల‌పై ఇంట‌ర్ విద్యార్థిని అంజ‌లిని ప్ర‌శ్నించారు. స‌ఖి గ్రూపుల‌కు అవ‌గాహ‌ణా కార్య‌క్ర‌మం నిరంత‌ర ప్ర‌క్రియ అని, వారికి వివిధ ఆరోగ్య‌ప‌ర‌మైన, సామాజిక‌ అంశాల‌తోపాటు, కెరీర్ గైడెన్స్ కూడా ఇవ్వాల‌ని సూచించారు. వ‌య‌సు 9 నుంచి 19 ఏళ్ల మ‌ద్య ఉన్న బాలిక‌ల‌కు, అన్ని అంశాల‌పైనా సంపూర్ణ‌ అవ‌గాహ‌న క‌ల్పించాల‌ని క‌లెక్ట‌ర్ కోరారు.
District Collector A. Suryakumari directed the staff of the Secretariat to issue caste certificates to the students of Tenth and Inter from now onwards.