District Collector Smt. A. Suryakumari on Thursday inspected the conduct of the Tenth examinations in the district.
Publish Date : 06/05/2022
పదో తరగతి పరీక్షా కేంద్రాల తనిఖీ
నగరంలోనూ, డెంకాడలో తనిఖీ చేసిన కలెక్టర్
విజయనగరం, మే 05 : జిల్లాలో జరుగుతున్న పదో తరగతి పరీక్షల నిర్వహణను జిల్లా కలెక్టర్ శ్రీమతి ఏ.సూర్యకుమారి గురువారం పరిశీలించారు. నగరంలోని సెయింట్ ఆన్స్ బాలికోన్నత పాఠశాల, సెయింట్ జోసెఫ్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ లను, డెంకాడ మండలం జొన్నాడలోని జిల్లాపరిషత్ ఉన్నత పాఠశాల పరీక్ష కేంద్రాన్ని కలెక్టర్ తనిఖీచేసి పరీక్షలు జరుగుతున్న తీరును తెలుసుకున్నారు. పరీక్ష రాస్తున్న విద్యార్ధులకు తగిన సౌకర్యాలు కల్పించినదీ లేనిదీ పరిశీలించారు. ఆయా కేంద్రాల్లో విద్యార్ధుల హాజరును తెలుసుకున్నారు. పరీక్షలు నిర్వహిస్తున్న తీరు పట్ల సంతృప్తి వ్యక్తంచేశారు.
