Close

Doctors should interact with people, hospitals should be kept clean, Collector Surya Kumari at the presentation of Kayakalpa and Lakshya awards.

Publish Date : 12/09/2022

వైద్యులు ప్రజల తో మమేకం కావాలి

ఆసుపత్రులను పరిశుభ్రంగా ఉంచాలి

కాయకల్ప, లక్ష్య అవార్డుల  ప్రదానంలో   కలెక్టర్ సూర్య కుమారి

విజయనగరం, సెప్టెంబరు 09: వైద్యులు    వైద్య సేవలతో పాటు కొంత మేరకు సామాజిక బాధ్యతను కూడా తీసుకోవాలని జిల్లా కలెక్టర్ సూర్య కుమారి తెలిపారు.  ప్రజలతో మమేకం అయితే వారికి సంతృప్తికరమైన సేవలను  అందించగలరని అన్నారు. శుక్రవారం కలెక్టరేట్ ఆడిటోరియంలో కాయకల్ప, లక్ష్య అవార్డులను ఉత్తమ ఆసుపత్రులకు, వైద్యుల కు కలెక్టర్ అవార్డులను అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఆసుపత్రులలో నాది అనే భావంతో పనిచేయాలని, మన ఇల్లు ఎంత పరిశుభ్రంగా ఉంటుందో అంతే పరిశుభ్రంగా ఉంచాలని, అప్పుడే ఆసుపత్రుల్లో పని చేసేవారికి గానీ, వచ్చే వారికి గానీ ప్రశాంతంగా ఉంటుందని అన్నారు. చెత్త ను తొలగించడం, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచడం తో పాటు పేషెంట్ల అభిప్రాయాలను తెలుసుకోడానికి ఫిర్యాదుల పెట్టె, ఫీడ్ బాక్ ఫారం ఉంచాలని అన్నారు. అదే విధంగా ఆసుపత్రుల తనిఖీలకు వచ్చిన అధికారులను ప్రశ్నించవద్దని, వారికి సహకరించాలని, ఏవైనా పొరపాట్లు,  లోపాలు ఉంటే సరి చేసుకునే అవకాశం వీరి ద్వారానే కలుగుతుందని  అన్నారు. అవార్డులు పొందిన వారుతదుపరి వైద్యులకు స్ఫూర్తి కలిగించడానికి  పొందిన అవార్డులను ఏ వైద్యుని కాలం లో వచ్చాయో, ఎందుకు వచ్చాయో వైద్యుని  పేరుతో సహా   గోడ ల పై రాసి పెట్టాలన్నారు.

డిస్ట్రిక్ట్ క్వాలిటీ కన్సల్టెంట్ శ్రీనివాస్  కాయకల్ప,  లక్ష్య అవార్డుల వివరాలను పవర్ పాయింట్ ద్వారా వివరించారు.  ఆసుపత్రుల నిర్వాహణ, పనితీరు, ఫలితాలను ఆధారంగా చేసుకొని కేంద్ర, రాష్ట్ర , జిల్లా స్థాయిలో ఈ అవార్డులను   ప్రదానం చేయడం జయుగుతోందని తెలిపారు. జిల్లాలో ఉన్న  ఆసుపత్రులలో  3 లక్ష్య అవార్డులు, 3 కాయకల్ప అవార్డులను రాష్ట్ర స్థాయి లో పొందాయని తెలిపారు. మహారాజ ఆసుపత్రి కి కాయకల్ప రాష్ట్ర స్థాయి అవార్డ్ 4వ సారి వచ్చిందని తెలిపారు. అనంతరం  కాయకల్ప అవార్డులను,  లక్ష్య సర్టిఫికెట్లను గోషా ఆసుపత్రికి,   8 పి.హెచ్ సి లకు చెందిన వైద్యులకు అందజేశారు.

ఈ కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్య అధికారి డా.రమణ కుమారి, డి.సి.హెచ్.ఎస్ డా.నాగభూషణ రావు, మహారహ ఆసుపత్రి సూపరెంటెండెంట్ డా.సీతారామ స్వామి, పలువురు ప్రభుత్వ  వైద్యులు పాల్గొన్నారు.

Doctors should interact with people, hospitals should be kept clean, Collector Surya Kumari at the presentation of Kayakalpa and Lakshya awards.