Close

Education is important to conquer poverty, we are going to bring revolutionary changes in the field of education, Chief Minister YS Jaganmohan Reddy

Publish Date : 25/03/2022

పేదరికాన్ని జయించాలంటే చదువు ముఖ్యం

విద్యారంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకురానున్నాం

జగనన్న విద్యా దీవెన నిధులు విడుదల

ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి

విజయనగరం, మార్చి 16: జగనన్న విద్యా దీవెన పధకం క్రింద అక్టోబరు-డిసెంబరు 2021 త్రైమాసికానికి సంబంధించి ఫీజ్ రియాంబర్స్మెంట్ ను రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి బుధవారం వీడియో కాన్పరెన్సు ద్వారా విద్యార్థుల తల్లుల ఖాతాలోకి జమచేసారు. వెలగపూడి సెక్రటేరియట్ నుండి పాల్గొన్న ముఖ్యమంత్రి మాట్లాడుతూ ఆర్థిక కారణాలవల్ల ఏఒక్క విద్యార్థి చదువు మానకుండా ఉండి వందకు వంద శాతం గ్రాడ్యూయేట్లు అయి బాగా చదువుకొని ఉన్నత స్థానాలకు చేరుకోవాలన్న ఉద్దేశ్యంతో విద్యా దీవెన పధకాన్ని పెట్టడం జరిగిందన్నారు.

విజయనగరం జిల్లాలో గల అర్హులైన పేద ఎస్.సి., ఎస్.టి., బి.సి., ఇ.బిసి, ముస్లిం, కాపు మరియు క్రిష్టయన్ విద్యార్థులకు జగనన్న విద్యా దీవెన క్రింద 269 కళాశాలలో డిగ్రీ, ఇంజనీరింగ్, ఫార్మసీ, పాలిటెక్నిక్, ఐటిఐ, మెడికల్, పేరామెడికల్, నర్శింగ్, అగ్రికల్చర్, హార్టికల్చర్, డిఎడ్, బిఎడ్, బిపిఎడ్ తదితర కోర్సులు చదువుతున్న 57,418 మంది విద్యార్థుల తల్లుల ఖాతాలో రూ.30.98 కోట్ల నిధులు జమ కాననున్నాయి. జిల్లా కలెక్టర్ ఎ.సూర్యకుమారి లబ్దిదారుల తల్లులకు చెక్కును అందజేసారు.

వెనుకబడిన తరగతులు బి.సి.లు 43,967 మంది విద్యార్థులకు రూ. 22.92 కోట్లు, ఎస్.సి.లు 5,398 మంది విద్యార్థులకు రూ.3.82 కోట్లు, ఇబి.సి. విద్యార్థులు 3,035 మందికి రూ.2.05 కోట్లు, ఎస్.టి.లు 3,843 మంది విద్యార్థులకు రూ.1.39 కోట్లు, కాపు విద్యార్థులు 883 మందికి రూ.0.63 కోట్లు, ముస్లిం విద్యార్థులు 246 మందికి రూ. 0.13 కోట్లు, క్రిష్టియన్ విద్యార్థులు 46 మందికి రూ.0.04 కోట్లు మొత్తం 57,418 మంది విద్యార్థులకు రూ. 30.98 కోట్లను మంజూరు చేయడం జరిగింది.

వీడియో కాన్పరెన్సులో జిల్లా కలెక్టర్ ఎ.సూర్యకుమారి, జాయింట్ కలెక్టర్ (ఆసరా) వెంకటరావు, జెడి సాంఘిక సంక్షేమ శాఖ సునీల్ రాజ్ కుమార్, బిసి సంక్షేమ శాఖాధికారి డి.కీర్తి హాజరయ్యారు.

***

లబ్దిదారుల మనోభావాలుః

జగనన్నకు రుణపడి ఉంటాం- సి.హెచ్.సంధ్య

పెద్ద చదువులు చదువుకోవడానికి జగనన్న మాకు ఆర్థిక సాయాన్ని అందిస్తునందుకు మాకు చాలా సంతోషంగా వున్నదని, దత్తిరాజేరు మండలం దత్తి గ్రామానికి చెందిన సి.హెచ్.సంధ్య తెలిపారు. తాను ఎం.ఆర్. డిగ్రీ కాళాశాలలో బికాం రెండవ సంవత్సరం చదువుతున్నాయని, ఫీజ్ రియాంబర్సుమెంట్ వస్తున్నదని, బాగా చదువుకొని పెద్ద అధికారి కావాలనుకుంటున్నాని తెలిపారు. తన తండ్రి ఆటో డ్రైవరని, తన తల్లి గ్రామ సచివాలయంలో వాలంటీరుగా పనిచేస్తున్నదని, తన తమ్ముడికి అమ్మ ఒడి, తాతయ్యకు ఫించన్ వస్తున్నదని రాష్ట్ర ముఖ్యమంత్రి జగనన్నకు తన కుటుంబం రుణపడి ఉంటుందని ఆనందం వ్యక్తపర్చారు.

విద్యా రంగానికి జగనన్న పెద్ద పీట వేసారు- కె.దుర్గ

విజయనగరం జె.ఎన్.టి.యు. యూనివర్శిటీలో మెకానిక్ ఇంజనీరింగ్ మూడవ సంవత్సరం చదువుతున్న కె.దుర్గ మాట్లాడుతూ తన తండ్రి ప్రవేట్ ఉద్యోగం చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నారన్నారు. ఇంజనీరింగ్ చదువుకోవడానికి ఎక్కువ ఫీజులు చెల్లించలేక ఆర్థిక ఇబ్బందులతో వున్న మాకు జగనన్న దేవుడిలా వచ్చి విద్యా దీవెన పధకంలో పూర్తి ఫీజు చెల్లించారని, పెద్ద చదువులు చదివి, మంచి ఉద్యోగం సంపాదించి మాతల్లి,దండ్రులను బాగా చూసుకుంటానని ఆనందాన్ని వ్యక్తపరుస్తున్నారు. తన తల్లి డ్వాక్రా గ్రూపులో సభ్యురాలిగా వున్నదని, నానమ్మకు ఫించన్ వస్తున్నందని అన్నారు. మాలాంటి నిరుపేదలకు పలు సంక్షేమ పధకాలను అందిస్తూ ఆర్థిక చేయూతనిస్తున్న జగనన్నకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నానన్నారు.

Education is important to conquer poverty, we are going to bring revolutionary changes in the field of education, Chief Minister YS Jaganmohan Reddy