Close

Effective Ecology Day, District Collector issues directions to various departments

Publish Date : 06/06/2022

ఫ‌ల‌వంతంగా ప‌ర్యావ‌ర‌ణ దినోత్స‌వం
ప‌లు శాఖ‌ల‌కు జిల్లా క‌లెక్ట‌ర్‌ ఆదేశాలు జారీ

విజ‌య‌న‌గ‌రం, జూన్ 03 :ప్ర‌పంచ వ్యాప్తంగా ప్ర‌తి ఏటా జూన్ 5న నిర్వ‌హిస్తున్న ప్ర‌పంచ ప‌ర్యావ‌ర‌ణ దినోత్స‌వాన్ని ప‌లు ప్ర‌భుత్వ శాఖ‌ల భాగ‌స్వామ్యంతో ఫ‌ల‌వంతంగా జిల్లాలో నిర్వ‌హించేందుకు జిల్లా క‌లెక్ట‌ర్ శ్రీ‌మ‌తి ఏ.సూర్య‌కుమారి కార్యాచ‌ర‌ణ రూపొందించారు. ఈ ఏడాది ‘ఒకే ఒక ధ‌రిత్రి’ (Only One Earth) అనే నినాదంతో ప‌ర్యావ‌ర‌ణ దినోత్స‌వం నిర్వ‌హిస్తున్నారు. జిల్లాలో గ్రామ‌, మండ‌ల‌, జిల్లా స్థాయి అధికార యంత్రాంగాన్నంత‌టినీ ఈ ప‌ర్యావ‌ర‌ణ దినోత్స‌వ వేడుక‌ల్లో భాగం చేసి అంద‌రి స‌హ‌కారంతో జిల్లాను కాలుష్య ర‌హితంగా రూపొందించేందుకు ఆయా శాఖ‌ల‌కు వివిధ ర‌కాల కాలుష్య నివార‌ణ‌ బాధ్య‌త‌లు అప్ప‌గించారు. దీనిలో భాగంగా నాలుగు ర‌కాల కార్య‌క‌లాపాల‌ను చేప‌ట్టాల‌ని నిర్ణయించి ఏ కార్య‌క‌లాపాల‌ను ఎవ‌రు చేప‌ట్టాలో స్ప‌ష్టమైన ఆదేశాలు ఇచ్చారు.

Ø     ఇళ్ల నుంచి వినియోగించిన పాఠ్య‌పుస్త‌కాలు, నోటు పుస్త‌కాల‌ను సేక‌రించే బాధ్య‌తను గ్రామ‌, వార్డు స‌చివాల‌య విద్యా స‌హాయ‌కులు నిర్వ‌హించాల్సి వుంటుంది. దీనిని ఆయా ఎం.పి.డి.ఓ.లు ప‌ర్య‌వేక్షిస్తారు.

Ø     వాహ‌నాల‌కు త‌క్కువ శ‌బ్దంతో కూడిన‌, చ‌ట్టంలోని నిబంధ‌న‌ల మేర‌కు ఆయా వాహ‌నాల‌కు తగిన సైలెన్స‌ర్లు, హార‌న్‌లు మాత్ర‌మే వినియోగించేలా చ‌ర్య‌లు చేప‌ట్ట‌డానికి ప‌ట్ట‌ణాల్లో మునిసిప‌ల్ క‌మిష‌న‌ర్‌లు చ‌ర్య‌లు చేప‌ట్టాల్సి వుంటుంది. ఇది అమ‌లు జ‌రిగేలా ఉప ర‌వాణా క‌మిష‌న‌ర్ ప‌ర్య‌వేక్ష‌ణ చేయాల్సి వుంటుంది.

Ø     నీటిని స‌ద్వినియోగం చేయడం, పొదుపుగా వినియోగించేందుకు చ‌ర్య‌లు చేప‌ట్టేలా చ‌ర్య‌లు చేప‌ట్టే బాధ్య‌త‌ను గ్రామ, వార్డు స్థాయిలో ఇంజ‌నీరింగ్ స‌హాయ‌కులు, స్వ‌యంశ‌క్తి సంఘాలు నిర్వ‌హించాల్సి వుంటుంది. గ్రామీణ నీటిస‌ర‌ఫ‌రా ప‌ర్య‌వేక్ష‌క ఇంజ‌నీర్‌, మెప్మా, డి.ఆర్‌.డి.ఏ. ప్రాజెక్టు డైర‌క్ట‌ర్‌లు దీనిని ప‌ర్య‌వేక్షించాల్సి వుంటుంది.

Ø      గ్రామాలు, ప‌ట్ట‌ణాల్లో దోమ‌ల నియంత్ర‌ణ‌లో భాగంగా ఖాళీ ప్ర‌దేశాల్లో నీటి నిల్వ‌లు లేకుండా చ‌ర్య‌లు చేప‌ట్ట‌డం వంటి కార్య‌క్ర‌మాలు చేప‌ట్టే బాధ్య‌త‌ను గ్రామ స్థాయిలో ఇంజ‌నీరింగ్ స‌హాయ‌కులు, స్వ‌యంశ‌క్తి సంఘాల‌కు అప్ప‌గించారు. దీనిపై డి.ఆర్‌.డి.ఏ., మెప్మా, గ్రామీణ నీటిస‌ర‌ఫ‌రా విభాగం ఉన్న‌తాధికారులు ప‌ర్య‌వేక్ష‌ణ చేయాల్సి వుంటుంది.
ఈ కార్య‌క్ర‌మాల‌న్నీ చేప‌ట్ట‌డం ద్వారా జిల్లాలో ప్ర‌పంచ ప‌ర్యావ‌ర‌ణ దినోత్స‌వాన్ని ఫ‌ల‌ప్ర‌దం చేయాల‌ని జిల్లా క‌లెక్ట‌ర్ శ్రీ‌మ‌తి సూర్య‌కుమారి ఒక స‌ర్క్యుల‌ర్ విడుద‌ల చేశారు.

Effective Ecology Day, District Collector issues directions to various departments