* Energy resources should be used sparingly * * Collector Suryakumari at the Energy Week End Celebration
Publish Date : 21/12/2021
*శక్తి వనరులను పొదుపుగా వినియోగించాలి*
* ఎనర్జీ వీక్ ముగింపు సదస్సులో కలెక్టర్ సూర్యకుమారి
విజయనగరం, డిసెంబర్ 20 ః శక్తి వనరులను పొదుపుగా వినియోగించాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని ఉందని కలెక్టర్ ఎ. సూర్యకుమారి పేర్కొన్నారు. వాటిని భావితరాలకు అందించాల్సిన నైతిక బాధ్యత మనందరిపైనా ఉందని ఉద్ఘాటించారు. ఎనర్జీ వీక్ ముగింపు సందర్భంగా ఏపీఈపీడీసీఎల్ ఆధ్వర్యంలో సోమవారం సాయంత్రం స్థానిక విద్యుత్ శాఖ కార్యాలయంలో ముగింపు సదస్సు నిర్వహించారు. కలెక్టర్ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు.
అన్ని శక్తి వనరుల్లోకి విద్యుత్ వనరులు చాలా ప్రధానమని వాటిని ఈ తరంలోనే కాకుండా భవిష్యత్తరాలకు అందించాలని పేర్కొన్నారు. ఒక యూనిట్ విద్యుత్ పొదుపు చేస్తే రెండు యూనిట్లు ఉత్పత్తి చేసినట్లేనని చెప్పారు. కాలం చెల్లిన యంత్రాల వినియోగాన్ని తగ్గించాలని, తద్వారా విద్యుత్తును ఆదా చేయాలని సూచించారు. ఈ క్రమంలో ఇటీవల నిర్వహించిన పెయింటింగ్స్ పోటీల్లో ప్రతిభ కనబరిచిన బి. గాయత్రి శివాణి, బి. రితిక, జి. అభిరామ్‌లకు కలెక్టర్ చేతుల మీదుగా బహుమతులు అందజేశారు.
అనంతరం ఏపీఈపీడీసీఎల్ ఎస్.ఈ. మసిలా మణి విద్యుత్ ఆదా, పొదుపు చర్యలను పాటించడం ద్వారా గృహ, వ్యవసాయ, వాణిజ్య, పారిశ్రామిక రంగాల్లో విద్యుత్తును గణనీయంగా ఆదా చేయవచ్చన్నారు. స్టార్ రేటెడ్ విద్యుత్ పరికరాలను వినియోగించడం ద్వారా తక్కువ విద్యుత్ ఖర్చు అవుతుందని పేర్కొన్నారు. విద్యుత్ పొదుపు చేయడంపై అవగాహన కల్పించేందుకు పాఠశాలల్లో, కళాశాలల్లో విద్యార్థులకు పెయింటింగ్ పోటీలు, వ్యాసరచన, వక్తృత్వపు పోటీలు, ర్యాలీలు నిర్వహించినట్లు వివరించారు.
అనంతరం వివిధ పోటీల్లో ప్రతిభ కనబరిచిన వారికి బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆహుతులను అలరించాయి.
కార్యక్రమంలో ఏపీఈపీడీసీఎల్ ఎస్.ఈ. మసిలా మణితో పాటు ఈఈ (టెక్నికల్) పి.ఎస్. రాంబాబు, ఈఈ (ఆపరేషన్స్) ఎన్. కృష్ణమూర్తి, ఈఈ (ఆపరేషన్స్, బొబ్బిలి) కె. నాగేశ్వరరావు, ఈఈ (ఆపరేషన్స్ – పార్వతీపురం) రామకృష్ణ , ఎస్.ఎ.వో. పి. వెంకటేశ్వరరావు, , డీఈలు, ఏఈలు తదితరులు పాల్గొన్నారు.
